న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వంగలేక రనౌట్: ఇంజమామ్‌ను గుర్తుకు తెచ్చిన విండిస్ భారీకాయుడు (వీడియో)

Watch: Rahkeem Cornwall’s run out in CPL 2019 leaves commentators in splits

హైదరాబాద్: రకీమ్ కార్న్‌వాల్‌... విండిస్ భారీకాయుడిగా పేరొందిన ఇతడు ఈ మధ్య టీమిండియాతో జరిగిన రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో అంతర్జాతీయ టెస్టు అరంగేట్రం చేశాడు. 140 కిలోల బరువు ఉండటంతో అంతర్జాతీయ క్రికెట్లో అత్యంత బరువైన క్రికెటర్‌గా అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు.

ప్రస్తుతం వెస్టిండిస్ వేదికగా జరుగుతున్న కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(సీపీఎల్)లో ఆడుతున్నాడు. టోర్నీలో భాగంగా బుధవారం గయానా అమెజాన్‌-సెయింట్‌ లూసియా జోక్స్‌ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ టోర్నీలో సెయింట్‌ లూసియా జోక్స్‌ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తోన్న కార్న్‌వాల్‌ విచిత్రంగా రనౌటయ్యాడు.

<strong>నవంబర్ వరకు ధోని సెలక్షన్‌కు అందుబాటులో ఉండకపోవడానికి కారణమిదే!</strong>నవంబర్ వరకు ధోని సెలక్షన్‌కు అందుబాటులో ఉండకపోవడానికి కారణమిదే!

ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన కార్న్‌వాల్ 12 బంతులాడి 6 పరుగులు చేశాడు. 26 ఏళ్ల కార్న్‌వాల్ ఓపెనర్‌గా బరిలోకి దిగాడు. మ్యాచ్‌లో పరుగు తీసే క్రమంలో అతడు క్రీజు దగ్గరికి వచ్చినప్పటికీ బ్యాట్ పెట్టలేదు. దీనిని గమనించిన ప్రత్యర్థి జట్ట వికెట్ కీపర్‌ కాస్త ఆలస్యమైనప్పటికీ వికెట్లను గిరాటేశాడు.

దీంతో థర్డ్ అంఫైర్ కార్న్‌వాల్(6)ను ఔట్‌గా ప్రకటించాడు. ఈ మ్యాచ్‌కి కామెంటేటర్‌ ఉన్న డానీ మోరిసన్‌ నవ్వుకున్నాడు. ఈ సంఘటన పాకిస్థాన్ మాజీ క్రికెటర్ ఇంజమాన్ ఉల్ హక్‌ను గుర్తుకు తెచ్చింది. క్రికెట్‌లో ఇంజమామ్ ఉల్ హక్ ఈ విదంగా ఔటైన సందర్భాలు అనేకం. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో కొలిన్‌ ఇంగ్రామ్‌ 14 బంతుల్లో 25 పరుగులతో విజృంభించగా మరో ఆటగాడు కొలిన్‌ డి గ్రాండ్‌హోమ్‌ 37 బంతుల్లోనే 65 పరుగులతో హాఫ్ సెంచరీ సాధించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసింది. అనంతరం 162 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన గుయానా అమెజాన్ జట్టు అలవోక విజయాన్ని నమోదు చేసింది.

భారత్ vs దక్షిణాఫ్రికా మహిళల రెండో టీ20: ఎప్పుడు, ఎక్కడ, ఎలా వీక్షించాలి!భారత్ vs దక్షిణాఫ్రికా మహిళల రెండో టీ20: ఎప్పుడు, ఎక్కడ, ఎలా వీక్షించాలి!

గుయానా అమెజాన్ జట్టు ఓపెనర్ బ్రాండ్ కింగ్ 59 బంతుల్లో రెండు ఫోర్లు, ఆరు సిక్సుల సాయంతో 81 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. చంద్రపాల్ హేమ్ రాజ్‌తో కలిసి తొలి వికెట్‌కు బ్రాండ్ కింగ్ 52 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. చివర్లో హెట్ మెయిర్ 30 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

Story first published: Thursday, September 26, 2019, 16:11 [IST]
Other articles published on Sep 26, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X