వెన్నునొప్పితో ధోని హెలికాప్టర్ షాట్: వీడియో చూశారా?

Posted By:
WATCH: MS Dhoni hits Mohit Sharma out of the ground

హైదరాబాద్: ఐపీఎల్ 11వ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఫామ్‌లోకి వచ్చాడు. గత రెండు మ్యాచ్‌ల్లో ఆశించిన స్థాయిలో ప్రదర్శన కనబర్చిన ధోని ఆదివారం రాత్రి కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు.

వరుస బౌండరీలతో అభిమానుల్ని అలరించాడు. ముఖ్యంగా ధోని హెలికాప్టర్ షాట్ ఈ మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచింది. ఇన్నింగ్స్‌ 18వ ఓవర్ వేసిన పంజాబ్ పేసర్ మోహిత్ శర్మ యార్కర్ రూపంలో బంతిని విసరగా.. కళ్లు చెదిరే రీతిలో మిడ్ వికెట్‌గా ధోని బంతిని స్టాండ్స్‌లోకి తరలించాడు..

వెన్నునొప్పితో ధోని బ్యాటింగ్ చేయలేకపోయిన వేళ చెన్నై ఓటమి

ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ మ్యాచ్‌లో ధోని 44 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సులతో మునుపటి ధోనీని గుర్తు చేశాడు. ఆదివారం నాటి మ్యాచ్‌లో చెన్నై జట్టు ఓడిపోయి ఉండొచ్చు కానీ ధోని మాత్రం గెలిచాడంటూ నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. .

చెన్నై విజయానికి 12 బంతుల్లో 36 పరుగులు అవసరమైన దశలో.. జడేజా ఔటైనప్పటికీ ధోని వరుసగా 6, 4, 2, 6తో ఒకే ఓవర్‌లో 19 పరుగులు పిండుకున్నాడు. ఆ ఓవర్‌లోని చివరి బంతిని ఒంటిచేత్తో ధోనీ సిక్స్‌గా మలచడం విశేషం. వెన్నునొప్పి బాధిస్తున్నా చెన్నై విజయం కోసం ధోనీ (79 నాటౌట్) కడవరకూ పోరాడాడు.

చివరి ఓవర్‌లో అభిమానులతో పాటు ఇరు జట్ల సభ్యుల్లో కూడా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ధోనీ దూకుడు చూసి గెలుపు సీఎస్‌కేదే అని అందరూ భావించారు. చివరి ఓవర్‌లో చెన్నై విజయానికి 17 పరుగులు అవసరమైన దశలో మళ్లీ మోహిత్ శర్మ బౌలింగ్‌కి వచ్చాడు.

ఐపీఎల్‌లో చరిత్రలోనే తొలిసారి: ఉమేశ్ యాదవ్ చెత్త రికార్డు

అయితే చివరి ఓవర్‌లో బౌలర్ కట్టడి చేయడంతో మ్యాచ్ చెన్నై చేజారిపోయింది. ఈ ఓవర్‌లో ఒక ఫోర్, సిక్స్‌ని మాత్రమే ధోని బాదడంతో చెన్నై జట్టు 4 పరుగుల తేడాతో ఓడిపోయింది. అయితే చివరి బంతికి కూడా సిక్స్‌ కొట్టి తానేంటో ధోని తానెంటో మరోసారి నిరూపించుకున్నాడు.

రికెట్ అంటే ఇష్టమా? నిరూపించు! మైఖేల్ ఫాంటసీ క్రికెట్ ఆడు

Story first published: Monday, April 16, 2018, 12:53 [IST]
Other articles published on Apr 16, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి