న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

డబుల్ కాదు ట్రిపుల్: కోహ్లీ కోరిక తీర్చలేకపోయిన మయాంక్ అగర్వాల్ (వీడియో)

IND vs BAN,1st Test : Virat Kohli Signals Mayank Agarwal To Go For 300 || Oneindia Telugu
Watch: Mayank Agarwal scores double ton, Virat Kohli signals to go for 300

హైదరాబాద్: ఇండోర్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో జట్టు స్కోరు 432 పరుగుల వద్ద మయాంక్ అగర్వాల్ రూపంలో టీమిండియా ఐదో వికెట్ కోల్పోయింది. 37 పరుగులతో రెండో రోజు ఆటను కొనసాగించిన మయాంక్ అగర్వాల్ (243; 330 బంతుల్లో 28 పోర్లు, 8 సిక్సలు)తో డబుల్ సెంచరీని సాధించాడు.

ఇటీవలే దక్షిణాఫ్రికాతో ముగిసిన మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో సైతం విశాఖ వేదికగా దక్షిణాఫ్రికాతో ఆడిన తొలి టెస్టులో మయాంక్ అగర్వాల్ డబుల్ సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే. 12 ఇన్నింగ్స్‌ల్లోనే మయాంక్ రెండు డబుల్ సెంచరీలు సాధించి అనేక రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. మయాంక్ ప్రదర్శనపై కెప్టెన్ కోహ్లీ సంతోషంగా ఉన్నాడు.

ఇండోర్ టెస్టులో మయాంక్ సెంచరీ: సమం చేసిన రికార్డులివే, స్మిత్‌కు చేరువలో!ఇండోర్ టెస్టులో మయాంక్ సెంచరీ: సమం చేసిన రికార్డులివే, స్మిత్‌కు చేరువలో!

భారీ సిక్సర్‌తో డబుల్ సెంచరీ

శుక్రవారం నాటి మ్యాచ్‌లో మయాంక్ అగర్వాల్ భారీ సిక్సర్‌తో డబుల్ సెంచరీ పూర్తి చేసుకుని అనంతరం ఆకాశం వైపు చూస్తూ సంబరాలు చేసుకున్నాడు. ఆ తర్వాత టీమిండియా డ్రెస్సింగ్‌ రూమ్‌ వైపు బ్యాట్‌ చూపిస్తూ అభివందనం చేశాడు. దీంతో డ్రెస్సింగ్ రూమ్‌ వైపు చూస్తూ డబుల్ సెంచరీ చేశానని చేతివేళ్లతో కెప్టెన్‌ కోహ్లీకి సైగలు చేశాడు.

మూడు వేళ్లను చూపిస్తూ ట్రిపుల్ సెంచరీ బాదాలని

దీనికి చిరునవ్వుతో స్పందించిన కెప్టెన్ కోహ్లీ మూడు వేళ్లను చూపిస్తూ ట్రిపుల్ సెంచరీ బాదాలని సూచించాడు. అయితే, ట్రిపుల్ సెంచరీ చేయాలన్న కసితో దూకుడుగా ఆడే క్రమంలో యమాంక్ అగర్వాల్ 243 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్‌కు చేరాడు. మెహదీ హసన్‌ బౌలింగ్‌లో జయేద్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు.

కోహ్లీ కోరికను తీర్చలేకపోయిన మయాంక్

దీంతో కెప్టెన్ విరాట్ కోహ్లీ కోరిన కోరికను మయాంక్ అగర్వాల్ తీర్చలేకపోయాడు. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో మయాంక్ అగర్వాల్ అనేక రికార్డులను బద్దలు కొట్టాడు. టెస్టుల్లో అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో రెండు డబుల్ సెంచరీలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో వినోద్ కాంబ్లి(ఐదు ఇన్నింగ్స్‌ల్లో రెండు డబుల్ సెంచరీలు) అగ్రస్థానంలో ఉన్నాడు.

13 ఇన్నింగ్స్‌ల్లో బ్రాడ్‌మన్ రెండు డబుల్ సెంచరీలు

ఆస్ట్రేలియా లెజెండర్ బ్యాట్స్‌మన్ డాన్ బ్రాడ్‌మన్ 13 ఇన్నింగ్స్‌ల్లో రెండు డబుల్ సెంచరీలు చేశాడు. ఇక టెస్టుల్లో రెండు ద్విశతకాలు బాదిన కోహ్లీ, వినూ మన్కడ్‌, వసీమ్‌ జాఫర్‌ సరసన నిలిచాడు. ఈ ఏడాది మయాంక్ అగర్వాల్ ఇప్పటివరకు ఆడిన మ్యాచ్‌ల్లో 700కుపైగా పరుగులు చేశాడు. అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్ శర్మ(630), క్వింటన్ డీకాక్(629), బెన్ స్టోక్స్(627) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

Story first published: Friday, November 15, 2019, 17:21 [IST]
Other articles published on Nov 15, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X