పఠాన్ బ్రదర్స్: సెంచరీ ఒకరిది, ఆనందరం మరొకరిది (వీడియో)

Posted By:

హైదరాబాద్: మధ్యప్రదేశ్‌తో జరుగుతున్న రంజీ ట్రోఫీలో బరోడా జట్టు కష్టాల్లో ఉంది. ఇండోర్ వేదికగా జరుగుతున్న ఈ రంజీ ట్రోఫీలో బరోడా జట్టు టాపార్డర్ పూర్తిగా విఫలమైంది. ఈ సమయంలో క్రీజులోకి దిగిన పఠాన్ బ్రదర్స్ కీలక ఇన్నింగ్స్‌తో బరోడా జట్టుని ఆదుకున్నారు.

పఠాన్ బ్రదర్స్ ఒకప్పుడు టీమిండియాలో ఆల్ రౌండర్లుగా వెలుగొందారు. అప్పట్లో వీరిద్దరూ క్రీజులో నిలదొక్కుకుని భారీ ఇన్నింగ్స్‌లు ఆడారు. యూసఫ్ పఠాన్ ఫించ్ హిట్టింగ్‌తో సిక్సర్లు బాదుతుంటే, ఇర్ఫాన్ ఫఠాన్ తన అద్భుతమైన బౌలింగ్‌తో మ్యాచ్ గమనాన్నే మార్చేవాడు.

Watch: Irfan Pathan's Wild Celebrations After Brother Yusuf Scores Century

అయితే, ఆ తర్వాతి రోజుల్లో వీరిద్దరూ టీమిండియాకు దూరమయ్యారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌)లో యూసఫ్ పఠాన్ కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తుండగా, గతేడాది జరిగిన వేలంలో ఇర్ఫాన్ పఠాన్‌ను కొనుగోలు చేసేందుకు ఏ ఫ్రాంచైజీ కూడా ఆసక్తి చూపలేదు.

దీంతో అభిమానులు పఠాన్ బ్రదర్స్ ఇన్నింగ్స్ చూసే గొప్ప అవకాశాన్ని కోల్పోయారు. కాగా, చాన్నాళ్లకు రంజీ మ్యాచ్ పుణ్యామా అని వీరిద్దరి భారీ ఇన్నింగ్స్‌ను చూసే అవకాశం క్రికెట్ అభిమానులకు కలిగింది. బరోడా తరుపున బరలోకి దిగిన వీరిద్దరూ ఐదో వికెట్‌కి 188 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.

ఈ క్రమంలోనే యూసఫ్ పఠాన్ (125 బంతుల్లో 111 పరుగులు) సెంచరీ పూర్తి చేసుకోవడంతో నాన్‌స్ట్రైక్‌ ఎండ్‌లో ఉన్న ఇర్ఫాన్ పఠాన్ ఉద్వేగం ఆపుకోలేకపోయాడు. బ్యాట్‌ని అక్కడ విసిరేసి.. యూసఫ్ కంటే ఎక్కువగా సంబరాలు చేసుకుంటూ కౌగలింతతో అనుబంధాన్ని చాటుకున్నాడు.

ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Story first published: Thursday, October 12, 2017, 17:41 [IST]
Other articles published on Oct 12, 2017

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి