న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అవాక్కైన బ్యాట్స్‌మన్: అచ్చం ధోనిలా స్టంపింగ్ చేసిన కీపర్ (వీడియో)

MS Dhoni Stumping Style, Hampshire Wicket keeper Lewis McManus Fools Laurie Evans Before Stumping
WATCH: Hampshire wicketkeeper Lewis McManus fools Laurie Evans before stumping him in MS Dhoni style

హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని వికెట్ల వెనుక ఎంత చురుగ్గా ఉంటాడో మనందరికీ తెలిసిందే. బ్యాట్స్‌మెన్ కాలు క్రీజు దాటిందంటే చాలు రెప్పపాటులో స్టంపింగ్ చేస్తాడు. స్టంపింగ్ మాత్రమే కాదు రనౌట్లు చకా చకా జరిగిపోతుంటాయి. ఐసీసీ సైతం ధోని స్టంపింగ్స్‌పై ఎన్నో సార్లు ప్రశంసల వర్షం కురిపించింది.

ప్రో కబడ్డీ 7వ సీజన్ వార్తలు, పాయింట్ల పట్టిక కోసం క్లిక్ చేయండి

ధోని వికెట్ కీపింగ్ స్టైల్‌కు ఉన్న ప్రత్యేకత వేరు

ప్రపంచ క్రికెట్‌లో దిగ్గజ వికెట్ కీపర్లు ఎంతోమంది ఉన్నా ధోని వికెట్ కీపింగ్ స్టైల్‌కు ఉన్న ప్రత్యేకత వేరు. తాజాగా ఇంగ్లీష్ టీ20 బ్లాస్ట్‌లో హాంప్‌షైర్ వికెట్ కీపర్ లుయిస్ మెక్‌మనుస్ అచ్చం ధోని మాదిరి స్టంపింగ్ చేసి బ్యాట్స్‌మెన్‌తో పాటు జట్టులోని సహచర క్రికెటర్లను ఆశ్చర్యానికి గురి చేశాడు.

ఇంగ్లీష్ టీ20 బ్లాస్ట్‌లో భాగంగా

ఇంగ్లీష్ టీ20 బ్లాస్ట్‌లో భాగంగా

ఇంగ్లీష్ టీ20 బ్లాస్ట్‌లో భాగంగా గురువారం హాంప్‌షైర్, సస్సెక్స్ జట్లు తలబడ్డాయి. ఈ మ్యాచ్‌లో స్పిన్నర్ మాసాన్ క్రేన్ వేసిన బంతిని సస్సెక్స్ బ్యాట్స్‌మెన్ ఇవాన్స్ సిక్స్ కొట్టేందుకు క్రీజుని వదిలాడు. అయితే బంతి బ్యాట్‌కు తగలకపోగా నేరుగా వికెట్ కీపర్ చేతుల్లో పడింది.

బంతి బెయిల్‌ను తాకే సమయంలో

ఈ సమయంలో బ్యాట్స్‌మన్ క్రీజులో నుంచి ముందుకు కదిలాడు. దీంతో వికెట్ కీపర్ మెక్‌మనుస్ ధోని స్టైల్‌లో స్టంపింగ్ చేసి అందరిని అబ్బురపరిచాడు. ఈ ఔట్‌ను చూసి క్రీజులో ఉన్న బ్యాట్స్‌మన్ సైతం అవాక్కయ్యాడు. అయితే, బంతి బెయిల్‌ను తాకే సమయంలో బ్యాట్స్‌మన్ క్రీజు వదలడం విశేషం. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Story first published: Friday, July 26, 2019, 16:55 [IST]
Other articles published on Jul 26, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X