న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నోరు పారేసుకున్న ఇంగ్లాండ్ అభిమాని: డేవిడ్ వార్నర్‌ ఏం చేశాడో తెలుసా! (వీడియో)

Watch: Fan yells David Warner you f*****g cheat. Australian openers reaction is hilarious

హైదరాబాద్: ప్రతిష్టాత్మక యాషెస్ సిరిస్‌లో భాగంగా ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో డేవిడ్ వార్నర్‌కు ఓ చేదు అనుభవం ఎదురైంది. బాల్ టాంపరింగ్‌కు పాల్పడి ఏడాది పాటు అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమై యాషెస్ సిరిస్‌తో టెస్టుల్లోకి ఎంట్రీ ఇచ్చిన స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌లపై ఇంగ్లాండ్ అభిమానులు విషం కక్కుతూనే ఉన్నారు.

యుఎస్ ఓపెన్‌లో సెరెనా vs బియాంక: ఎవరు గెలిచినా చరిత్రే!, మ్యాచ్ ఎప్పుడంటే!యుఎస్ ఓపెన్‌లో సెరెనా vs బియాంక: ఎవరు గెలిచినా చరిత్రే!, మ్యాచ్ ఎప్పుడంటే!

అవకాశం దొరికినప్పుడుల్లా ఈ ఇద్దరినీ ఇంగ్లాండ్ అభిమానులు ఎగతాళి చేస్తూనే ఉన్నారు. ఎడ్జిబాస్టన్ వేదికగా జరిగిన తొలి టెస్టు మొదలుకుని ప్రస్తుతం జరుగుతున్న నాలుగో టెస్టు వరకు 'చీటర్‌' వేధింపుల బారిన పడుతూనే ఉన్నారు. తాజాగా నాలుగో టెస్టు మూడో రోజైన శుక్రవారం ఆటలో భాగంగా ఓ ఇంగ్లాండ్ అభిమాని వార్నర్‌పై నోరు పారేసుకున్నాడు.

వర్షం అడ్డంకిగా మారడంతో

వర్షం అడ్డంకిగా మారడంతో

వర్షం అడ్డంకిగా మారడంతో మూడో రోజు మార్నింగ్ సెషన్ మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. దీంతో ముందస్తుగానే లంచ్ విరామాన్ని తీసుకోవాలని అంపైర్లు ఇరు జట్లకు సూచించారు. లంచ్ అనంతరం ఆసీస్‌ జట్టు తన డ్రెస్సింగ్‌ రూమ్‌ నుంచి గ్రౌండ్‌లోకి వెళుతున్న సమయంలో ఓ ఇంగ్లాండ్ అభిమాని ‘హేయ్‌ డేవిడ్‌ వార్నర్‌.. నువ్వొక చీటర్‌' అంటూ ఎగతాళి చేసే యత్నం చేశాడు.

వెంటనే వెనక్కి తిరిగి చూసిన వార్నర్‌

అయితే, దీనికి వెంటనే వెనక్కి తిరిగి చూసిన వార్నర్‌.. తన రెండు చేతుల్ని పైకి ఎత్తి వావ్‌ అంటూ నవ్వుతూ రిప్లై ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇంగ్లాండ్ అభిమాని తనను ఎగతాళి చేసినప్పటికీ డేవిడ్ వార్నర్ ఆ అభిమానిపై మండిపడకపోవడాన్ని నెటిజన్లు కొనియాడుతున్నారు.

పట్టు బిగిస్తోన్న ఆస్ట్రేలియా

పట్టు బిగిస్తోన్న ఆస్ట్రేలియా

ఇదిలా ఉంటే, నాలుగో టెస్టులో ఆస్ట్రేలియా జట్టు పట్టు బిగిస్తోంది. ఆసీస్ పేసర్ జోష్ హేజిల్‌వుడ్‌ (4/48) విజృంభించడంతో ఇంగ్లాండ్‌ మూడో రోజైన శుక్రవారం వెలుతురు లేమితో ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 200 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. స్టోక్స్‌ (7), బెయిర్‌స్టో (2) క్రీజులో ఉన్నారు.

స్టోక్స్, బెయిర్ స్టో రాణిస్తేనే!

స్టోక్స్, బెయిర్ స్టో రాణిస్తేనే!

వీరిద్దరూ భారీ స్కోర్లు సాధిస్తే ఇంగ్లాండ్‌ తేరుకునే అవకాశం ఉంది. అంతకముందు ఆస్ట్రేలియా 497/8 వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే. ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో ప్రస్తుతం ఇరు జట్లు 1-1 సమంగా నిలిచాయి.

తొలి టెస్టులో ఆస్ట్రేలియా విజయం సాధించగా.. రెండో టెస్టు డ్రాగా ముగిసింది. ఇక, మూడో టెస్టులో ఇంగ్లాండ్ విజయం సాధించింది.

Story first published: Saturday, September 7, 2019, 14:01 [IST]
Other articles published on Sep 7, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X