న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

హనుమాన్ టెంపుల్‌లో ధోని ప్రత్యేక పూజలు (వీడియో)

By Nageshwara Rao
Watch: Dhoni offers puja at Jharkhand Hanuman temple

హైదరాబాద్: క్రికెట్ నుంచి కాస్త విరామం లభించడంతో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయాన్ని గడుపుతున్నాడు. ఇంగ్లాండ్ గడ్డపై తాజాగా భారత్ జట్టు టెస్టు సిరీస్ ఆడుతుండగా.. వన్డేలు, టీ20లు ముగిసిన ధోని తర్వాత స్వదేశానికి వచ్చిన సంగతి తెలిసిందే.

తాజాగా తేందర్‌లోని జార్ఖండ్ జాగ్వార్ ఫోర్స్‌ క్యాంప్‌కు సమీపంలో ఉన్న ప్రసిధ ఆంజనేయ స్వామి ఆలయాన్ని సందర్శించిన ధోనీ ప్రత్యేకంగా పూజలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. అంతకముందు ధోని జాగ్వార్ ఫోర్స్‌ క్యాంప్‌‌లోని సైనికుల గౌరవ వందనం స్వీకరించాడు.

ప్రస్తుతం కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌ అనంతరం టీమిండియా దుబాయి వేదికగా ఆసియా కప్‌ టోర్నమెంట్‌లో ఆడనుంది. ఈ టోర్నీ కోసం ధోనీ టీమిండియాతో కలవనున్నాడు. సెప్టెంబరు 15న ఆసియా కప్‌ ప్రారంభంకానుంది.

తన అద్భుత నాయకత్వ ప్రతిభతో పాటు ప్రపంచ కప్‌‌లో జట్టును స్ఫూర్తివంతంగా ముందుకు నడిపించినందుకు ధోనీకి లెఫ్టినెంట్ కల్నల్ ర్యాంక్ ఇవ్వాలని సిఫార్సు చేస్తూ జార్ఖండ్ ముఖ్యమంత్రి అర్జున్ ముండా గతంలో రక్షణ శాఖకు లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత టెరిటోరియల్ ఆర్మీ, ధోనికి ఆ హోదాను కల్పించింది.

కల్నల్ హోదా పొందాక ధోని.. ఆగ్రాలోని పారా రెజిమెంట్‌లో రెండు వారాల పాటు ఆగ్రాలోని పారా రెజిమెంట్‌లో రెండు వారాల పాటు మిలిటరీ ట్రైనింగ్‌కు హాజరయ్యాడు. రెండు వారాల ట్రైనింగ్ అనంతరం ధోని ఏఎన్-32 యుద్ధ విమానంలో 10,000 అడుగుల ఎత్తు నుంచి ఐదుసార్లు పారా జంప్ చేసిన సంగతి తెలిసిందే.

భారత ఆర్మీ అంటే ధోనికి ఎనలేని గౌరవం. 2018 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మభూషణ్ పురస్కారాన్ని ధోని కల్నల్ హోదాలోనే అందుకున్న సంగతి తెలిసిందే. ఆర్మీ డ్రెస్ ధరించి.. మార్చింగ్ చేస్తూ వచ్చి రాష్ట్రపతి నుండి పద్మభూషణ్ పురస్కారాన్ని ధోని అందుకున్నాడు.

Story first published: Monday, August 27, 2018, 14:39 [IST]
Other articles published on Aug 27, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X