న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కళ్లు చెదిరే క్యాచ్ పట్టిన బెన్ స్టోక్స్: టోర్నీకే హైలెట్ (వీడియో)

ICC World Cup 2019: Imran Tahir 1st ever spinner to bowl 1st over of a World Cup
Watch: Ben Stokes Takes Spectacular Catch In England vs South Africa World Cup Opener

హైదరాబాద్: వరల్డ్‌కప్ ఆరంభ మ్యాచ్ క్రికెట్ అభిమానులకు సరైన మజాను పంచింది. ఓవల్ వేదికగా గురువారం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్ 104 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌స్టోక్స్‌ అద్భుత ప్రదర్శనతో దక్షిణాఫ్రికా ఓటమిలో కీలకపాత్ర పోషించాడు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌ ఇలా... మూడు విభాగాల్లో రాణించాడు. బ్యాటింగ్‌లో 79 బంతుల్లో 89 పరుగులు చేసిన బెన్ స్టోక్స్‌.. అనంతరం రెండు వికెట్లు, రెండు క్యాచ్‌లు, ఒక రనౌట్‌తో సత్తా చాటాడు. ముఖ్యంగా అదిల్‌ రషిద్‌ బౌలింగ్‌లో బౌండరీ వద్ద స్టోక్స్‌ అందుకున్న ఫెలుక్వాయో క్యాచ్‌ మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచింది.

సఫారీ ఇన్నింగ్స్ 35వ ఓవర్‌లో

సఫారీ ఇన్నింగ్స్ 35వ ఓవర్‌లో ఈ అద్భుతం చోటు చేసుకుంది. రషీద్‌ బౌలింగ్‌లో ఫెలుక్వాయో బంతిని డీప్‌ మిడ్‌వికెట్ మీదగా ఆడాడు. అదే సమయంలో బౌండరీ వద్ద ఫీల్డింగ్ చేస్తోన్న స్టోక్స్ సూపర్ మ్యాన్‌లా గాల్లో వెనక్కి ఎగురుతూ ఒంటి చేత్తో బంతిని ఒడిసిపట్టుకున్నాడు.

స్టోక్స్ కళ్లు చెదిరే క్యాచ్

స్టోక్స్‌ అందుకున్న ఈ క్యాచ్‌ ఈ వరల్డ్‌కప్‌ బెస్ట్‌ క్యాచ్‌ జాబితాలో తప్పకుండా నిలుస్తోంది. మ్యాచ్ అనంతరం ఇంగ్లాండ్‌ మాజీ కెప్టెన్‌ నాసిర్‌ హుస్సేన్‌ అయితే ఈ క్యాచ్‌ను క్రికెట్‌ చరిత్రలో అతి గొప్ప క్యాచ్‌ల్లో ఒకటిగా అభివర్ణించాడు. బెన్ స్టోక్స్ క్యాచ్‌కి సంబంధించిన వీడియో మీ కోసం....

311 పరుగులు చేసిన ఇంగ్లాండ్

311 పరుగులు చేసిన ఇంగ్లాండ్

కాగా, ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 311 పరుగులు చేసింది. స్టోక్స్ (79 బంతుల్లో 89; 9 ఫోర్లు), కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (57; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), జాసన్ రాయ్ (54; 8 ఫోర్లు), రూట్ (51; 5 ఫోర్లు) హాఫ్ సెంచరీలతో రాణించారు. సఫారీ బౌలర్లలో లుంగి ఎంగిడి మూడు, ఇమ్రాన్ తాహిర్, రబాడ చెరో రెండు వికెట్లు తీశారు.

స్టోక్స్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు

స్టోక్స్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు

అనంతరం లక్ష్యఛేదనలో దక్షిణాఫ్రికా 39.5 ఓవర్లలో 207 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ డికాక్ (74 బంతుల్లో 68; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), మిడిలార్డర్లో డసన్ (61 బంతుల్లో 50; 4 ఫోర్లు, 1 సిక్స్) మినహా మిగతావారు చేతులెత్తేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో ఆర్చర్ (3/27), స్టోక్స్ (2/12), ప్లంకెట్ (2/37) రాణించారు. బెన్ స్టోక్స్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

అచ్చం 2011 వరల్డ్‌కప్‌లో మాదిరి

అచ్చం 2011 వరల్డ్‌కప్‌లో మాదిరి

2011 వరల్డ్‌కప్‌లోనూ ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికాల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండే గెలిచింది. ఆశ్చర్యకరంగా ఆ మ్యాచ్‌లోనూ ఇంగ్లాండ్ ఒక్క పరుగుకే ఓ వికెట్ కోల్పోయి 1/1తో నిలిచి.. చివరకు 171 పరుగులకు ఆలౌటైంది. లక్ష్యఛేదనలో అనూహ్యంగా చతికిలపడిన దక్షిణాఫ్రికా 165 పరుగులకే కుప్పకూలడంతో ఇంగ్లాండ్ విజయం సాధించింది.

Story first published: Friday, May 31, 2019, 11:54 [IST]
Other articles published on May 31, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X