న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

గొప్ప ప్లేయర్‌: కోహ్లీతో పోల్చడంపై పాకిస్థాన్ క్రికెటర్ (వీడియో)

Babar Azam Opens Up On Comparison With Virat Kohli | Oneindia Telugu
Watch: Babar Azam urges people not to compare him with Virat Kohli, says he still has long way to go

హైదరాబాద్: మోడ్రన్ డే క్రికెట్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌గా కొనసాగుతున్నాడు. మూడు ఫార్మాట్లలో కూడా కోహ్లీ అనేక రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే, గణాంకాల విషయంలో మాత్రం కోహ్లీ ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. గతంలో అనేక సార్లు పాకిస్థాన్ క్రికెటర్ బాబర్ ఆజాంను టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీతో పోల్చారు.

 అచ్చం కోహ్లీలాగే

అచ్చం కోహ్లీలాగే

బాబర్ ఆజాం బ్యాటింగ్ శైలి అచ్చం కోహ్లీలాగే ఉండటంతో వీరిద్దరిని ఒకరితో మరొకరిని అభిమానులు పోల్చడం సాధారణమైంది. అయితే బాబర్ అజాం మాత్రం తనను కోహ్లీలాంటి గొప్ప ప్లేయర్‌తో పోల్చొద్దని కోరాడు. తాజాగా లాహోర్‌లో ఓ కార్యక్రమానికి హాజరైన బాబర్ ఆజాంను కోహ్లీతో ఉన్న పోలికపై కొందరు ప్రశ్నించారు.

బాబర్ ఆజాం మాట్లాడుతూ

దీనిపై అతడు మాట్లాడుతూ "నన్ను తరచూ కోహ్లీతో పోలుస్తుంటారు. కానీ అతడు చాలా గొప్ప ప్లేయర్. అతనికి దరిదాపుల్లో కూడా నేను లేను. నేనిప్పుడే నా కెరీర్‌ను ప్రారంభించాను. అతడు ఇప్పటికే చాలా సాధించేశాడు. అతనిలాగే నేను ఆడగలిగితే ఏదో ఒక రోజు కోహ్లీ సాధించిన రికార్డులను సాధిస్తా. అప్పుడు నన్ను అతనితో పోల్చండి. కానీ ఇప్పుడు మాత్రం కోహ్లీతో పోల్చవద్దు" అని స్పష్టం చేశాడు.

బాబర్ కీలక పాత్ర

బాబర్ కీలక పాత్ర

పాక్ టీమ్ ఈ మధ్య సాధించిన విజయాల్లో బాబర్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. వన్డేలు, టీ20ల్లో బాబర్ అజాం సగటు 50కిపైగానే ఉండటం విశేషం. అంతేకాదు అరంగేట్రం చేసిన కొద్దికాలంలోనే వన్డేల్లో 8 సెంచరీలు బాదాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో రాణించిన బాబర్ ఆజాం టెస్టుల్లో ఇంకా ఆ స్థాయి ప్రదర్శన చేయలేదు.

Story first published: Wednesday, February 13, 2019, 17:06 [IST]
Other articles published on Feb 13, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X