న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మన్కడింగ్ భయం: అశ్విన్ బౌలింగ్‌లో వెనక్కి తగ్గిన వార్నర్ (వీడియో)

WATCH: Avoiding Mankad dismissal? David Warner cautious versus R Ashwin during KXIP vs SRH game

హైదరాబాద్: ఐపీఎల్ 2019 సీజన్‌లోమన్కడింగ్ రనౌట్ తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఈ సీజన్ ఆరంభంలో రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ జోస్ బట్లర్‌ను పంజాబ్ కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్ మన్కడింగ్ ఔట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ మన్కడింగ్ రనౌట్ విషయంలో పలువురు మాజీ క్రికెటర్లు అశ్విన్ చేసింది కరెక్ట్ అని మద్దతు పలకగా మరికొందరు మాత్రం అశ్విన్ లాంటి సీనియర్ ఆటగాడు అలా చేసి ఉండకూడదంటూ తీవ్ర విమర్శలు చేశారు. అయితే, ఇప్పుడు పంజాబ్ జట్టుతో మ్యాచ్ అంటే చాలు ప్రత్యర్ధి జట్టు బ్యాట్స్‌మన్ అశ్విన్‌ను చూసి భయపడుతున్నారు.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

మన్కడింగ్ అవుతామోనని

అందుకు కారణం అశ్విన్ చేతిలో మళ్లీ మనం ఎక్కడ మన్కడింగ్ అవుతామోనని క్రీజు వదిలేందుకు ఒక్క క్షణం ఆలోచిస్తున్నారు. తాజాగా టోర్నీలో భాగంగా సోమవారం కింగ్స్ ఎలెవన్ పంజాబ్, సన్‌రైజర్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. మొహాలీ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ కెప్టెన్ అశ్విన్ సన్‌రైజర్స్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు.

అప్రమత్తమైన డేవిడ్ వార్నర్ వెంటనే

సన్‌రైజర్స్ ఇన్నింగ్స్‌లో భాగంగా ఓపెనర్ డేవిడ్ వార్నర్‌‌ను ఈ మ్యాచ్‌లో మరోసారి అశ్విన్ ఇదే తరహా ప్రదర్శన చేయబోయాడు. అశ్విన్ బౌలింగ్ వేసేందుకు క్రీజు వదిలిన సమయంలో అప్పటికీ అప్రమత్తమైన డేవిడ్ వార్నర్ వెంటనే క్రీజులో బ్యాట్ పెట్టేందుకు ఇబ్బంది పడ్డాడు. దీనిని చూసిన అశ్విన్ ముసిముసి నవ్వులతో తన బౌలింగ్‌పై దృష్టి పెట్టాడు.

ఐపీఎల్‌ ట్విట్టర్‌లో వీడియో

ఇందుకు సంబంధించిన వీడియోని ఐపీఎల్ తన అధికారిక ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకుంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేసింది. అనంతరం సన్‌రైజర్స్‌ నిర్దేశించిన 151 పరుగుల లక్ష్య చేధనకు దిగిన పంజాబ్ జట్టులో ఓపెనర్ కేఎల్ రాహుల్ 53 బంతుల్లో 71 నాటౌట్(7 ఫోర్లు, ఒక సిక్స్) హాఫ్ సెంచరీ నమోదు చేసి జట్టుకు విజయాన్ని అందించాడు.

Story first published: Tuesday, April 9, 2019, 19:23 [IST]
Other articles published on Apr 9, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X