న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఉనాద్కత్ అతి సంబరాలే... ధోని చేతిలో హ్యాట్రిక్ సిక్సులు (వీడియో)

WATCH: A perfect MS Dhoni finish! CSK skipper clobbers Jaydev Unadkat for a hat-trick of sixes

హైదరాబాద్: ఐపీఎల్ 2019లో సీఎస్‌కే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అద్భతమైన ఫామ్‌లో ఉన్నాడు. చెపాక్ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో చివరి వరకు క్రీజులో నిలిచిన ధోని మ్యాచ్‌ని తనదైన శైలిలో హ్యాట్రిక్ సిక్సర్లతో ముగించాడు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ ఆరంభంలోనే అంబటి రాయుడు (1), షేన్ వాట్సన్ (13), కేదార్ జాదవ్ (8) రూపంలో వికెట్లు చేజార్చుకుంది.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

దీంతో 4.5 ఓవర్లకు చెన్నై 3 వికెట్లు కోల్పోయి 27 పరుగులు చేసింది. దీంతో ఆ జట్టు తక్కువ స్కోరుకే పరిమితమవుతుందని అంతా అనుకున్నారు. అయితే, సురేశ్ రైనా (36)తో కలిసి ఇన్నింగ్స్ నిర్మించిన మహేంద్రసింగ్ ధోని (75 నాటౌట్) ఆఖరి వరకూ క్రీజులో నిలిచి చైన్నైని 175/5తో మెరుగైన స్థితిలో నిలిపాడు.

రైనాతో కలిసి నాలుగో వికెట్‌కి ధోనీ 61 పరుగులు

రైనాతో కలిసి నాలుగో వికెట్‌కి ధోనీ 61 పరుగులు

ఈ మ్యాచ్‌లో రైనాతో కలిసి నాలుగో వికెట్‌కి ధోనీ 61 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. అదే సమయంలో ఇన్నింగ్స్ 14వ ఓవర్ వేసిన జయదేవ్ ఉనాద్కత్ అద్భుతమైన యార్కర్‌ డెలివరీతో సురేశ్ రైనా‌ని క్లీన్ బౌల్డ్ చేశాడు. వికెట్ పడటంతో గట్టిగా అరుస్తూ జయదేవ్ అతిగా సంబరాలు చేసుకున్నాడు.

ధోని చేత మూడు సిక్సులు

ఈ సంబరాలే ఆఖరి ఓవర్‌లో ధోని చేత మూడు సిక్సులు బాదించుకునేలా చేశాయి. ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్‌లో జయదేవ్ బౌలింగ్‌కి రాగానే.. తొలి బంతికి సింగిల్ తీసిన ధోనీ.. అప్పుడే క్రీజులోకి వచ్చిన రవీంద్ర జడేజాతో చెవిలో ఏదో చెప్పాడు. వెంటనే రెండో బంతిని జడేజా సిక్స్‌ కొట్టగా, మూడో బంతి వైడ్‌ అయ్యింది.

తనదైన శైలిలో రెచ్చిపోయిన ధోని

తనదైన శైలిలో రెచ్చిపోయిన ధోని

అటు తర్వాత జడేజా సింగిల్‌ తీయగా, ధోని తనదైన శైలిలో రెచ్చిపోయాడు. చివరి మూడు బంతుల్నీ వరుసగా 6,6,6‌గా మలిచేశాడు. ఈ మూడు బంతుల వ్యవధిలోనే ఒత్తిడికి గురైన జయదేవ్ రెండు వైడ్స్ కూడా విసరడంతో ఆ ఓవర్‌లో చెన్నై 28 పరుగుల్ని రాబట్టుకుంది. కాగా, గత 12 సీజన్లలో రైనా ఒక్కసారి కూడా చెన్నై తుది జట్టులో చోటు కోల్పోలేదు.

Story first published: Monday, April 1, 2019, 18:35 [IST]
Other articles published on Apr 1, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X