న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నిద్రపోతున్నారా..? అసలేం జరుగుతోంది..?

Warne & Clarke Stunned After Australias Dismal Show Against England

హైదరాబాద్: ఆస్ట్రేలియా క్రికెట్ పరిస్థితి రోజురోజుకూ దిగజారిపోతోంది. టాంపరింగ్ వివాదంతో పలు విమర్శలు ఎదుర్కొన్న ఆసీస్ క్రికెట్.. మళ్లీ పాత ఫామ్‌ను తీసుకురాలేకపోతోంది. మంగళవారం ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ అదే పేలవ ప్రదర్శన చూపించడంతో.. మాజీ క్రికెటర్లు సైతం జట్టుకు చివాట్లు పెడుతున్నారు.

ఆసీస్‌ వన్డే క్రికెట్‌ చరిత్రలోనే ఇది అత్యంత చెత్త ప్రదర్శన కావడంతో ఆసీస్‌ మాజీ క్రికెట్‌ దిగ్గజం షేన్‌వార్న్‌‌... 'నిద్ర లేవండి, ఇంగ్లండ్‌ స్కోరు ఒకసారి చూడండి. అసలు అక్కడ ఏం జరుగుతోంది. వాట్‌ ద హెల్‌ అంటూ' ట్వీట్‌ చేశాడు. ఇక ఆసీస్‌ మాజీ సారథి మైకేల్‌ క్లార్క్‌ కూడా ట్విటర్‌ వేదికగా తమ జట్టు ప్రదర్శనపై తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు.

కాగా 1986లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 206 పరుగులతో ఓడిన ఆసీస్‌ ప్రస్తుతం ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌తో ఆ రికార్డును అధిగమించి మరో చెత్త రికార్డును మూటగట్టుకుంది. మంగళవారం ఇంగ్లండ్‌తో జరిగిన డే- నైట్‌ వన్డేలో 242 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాల్లో టిమ్‌ పైనె జట్టు దారుణంగా విఫలమైన నేపథ్యంలో ఆసీస్‌ మాజీ క్రికెట్‌ దిగ్గజాలు షేన్ వార్న్, మైకెల్ క్లార్క్‌లు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

నాటింగ్‌హామ్‌ వేదికగా జరిగి మూడో వన్డేలో మోర్గాన్‌ సేన వన్డేల్లో అత్యధిక స్కోరు సాధించి కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పింది. మంగళవారం జరిగిన డే-నైట్‌ వన్డేలో ఇంగ్లాండ్‌ 50 ఓవర్లలో 6 వికెట్లకు 481 పరుగులు చేసింది. ఫలితంగా 2016లో పాకిస్థాన్‌పై చేసిన 444 పరుగుల రికార్డును ఇంగ్లాండ్ తానే బద్దలు కొట్టింది.

Story first published: Wednesday, June 20, 2018, 16:44 [IST]
Other articles published on Jun 20, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X