న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఫైనల్లో 'వందేమాతరం' పాడటం: ధోని మరపురాని జ్ఞాపకాల్లో అదొకటి!

MS Dhoni Shares Two Best Moments Of His Life || Oneindia Telugu
Wankhede crowd singing Vande Mataram at World Cup 2011 final among MS Dhonis unforgettable memories

హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తన హృదయానికి హత్తుకున్న రెండు సంఘటలను అభిమానులతో పంచుకున్నాడు. బుధవారం ముంబై నగరంలో 'పనెరాయ్‌' అనే వాచీ కంపెనీ ప్రచార కార్యక్రమంలో ధోనీ పాల్గొన్నాడు. ఈ కార్యక్రమంలో ధోని తన క్రికెట్ కెరీర్‌కు సంబంధించిన రెండు అత్యుత్తమ క్షణాలను అభిమానులతో పంచుకున్నాడు.

ధోని నాయకత్వంలోని టీమిండియా 2007లో దక్షిణాఫ్రికా ఆతిథ్యమిచ్చిన ఆరంభ సీజన్ టీ20 వరల్డ్‌కప్‌ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక, 2011లో ముంబైలోని వాంఖడే స్టేడియంలో శ్రీలంకతో జరిగిన వన్డే వరల్డ్‌కప్‌ ఫైనల్లో విజయం సాధించి విజేతగా నిలవడంతో పాటు రెండోసారి టీమిండియా వన్డే వరల్డ్ కప్‌ను సొంతం చేసుకుంది.

హెచ్‌సీఏ గౌరవానికి భంగం.. అంబటి రాయుడిపై చట్టపరమైన చర్యలు?హెచ్‌సీఏ గౌరవానికి భంగం.. అంబటి రాయుడిపై చట్టపరమైన చర్యలు?

'పనెరాయ్‌' అనే వాచీ కంపెనీ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ధోని మాట్లాడుతూ "నా కెరీర్‌లో రెండు సంఘటనలు నా మనసుకు అత్యంత చేరువగా నిలిచాయి. 2007 టీ20 ప్రపంచకప్‌ గెలిచి స్వదేశం తిరిగొచ్చాం. ముంబైలో ఓపెన్‌ టాప్‌ బస్సులో ఊరేగింపు జరిగింది. ఆ సమయంలో మెరైన్‌ డ్రైవ్‌ మొత్తం పూర్తిగా నిండిపోయింది. తమ పనులన్నీ వదిలేసుకొని అభిమానులు అందరూ మా కోసం వచ్చారు. ప్రతి ఒక్కరి ముఖంలో నవ్వు కనిపించడం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. మాకు లభించిన స్వాగతాన్ని నేనెప్పటికీ మరవను" అని అన్నాడు.

వీసా గడువు ముగిసినా భారత్‌లోనే: బంగ్లా క్రికెటర్‌కు జరిమానా విధించిన కేంద్ర ప్రభుత్వంవీసా గడువు ముగిసినా భారత్‌లోనే: బంగ్లా క్రికెటర్‌కు జరిమానా విధించిన కేంద్ర ప్రభుత్వం

"ఇక, రెండోది 2011 ప్రపంచకప్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో విజయానికి ఇంకా 15-20 పరుగులు చేయాల్సిన సమయంలో.. మైదానంలోని అభిమానులంతా 'వందేమాతరం' నినాదాలు చేశారు. ఎంతో ఉద్వేగానికి లోనయ్యా. ఆ రెండు సంఘటనలు మళ్లీ జరుగుతాయని అనుకోను. అవి నా హృదయానికి ఎంతో దగ్గరయ్యాయి" అని ధోని చెప్పుకొచ్చాడు.

Story first published: Thursday, November 28, 2019, 13:43 [IST]
Other articles published on Nov 28, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X