న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోహ్లీ మళ్లీ రాణించగలడు: వీవీఎస్‌ లక్ష్మణ్‌

VVS laxman & kapildev respond on virat kohli IPL form

ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ సీజన్-12లో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ జట్టుతో పాటు కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా సతమతమవుతున్నాడు. పరుగుల మెషిన్ విరాట్ కోహ్లీ పరుగులు చేయడంతో విఫలమయి బెంగళూరు అభిమానులను తీవ్రంగా నిరాశపరుస్తున్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 4 మ్యాచులలో కలిపి మొత్తం 78 పరుగులు చేశాడు. ముంబయి ఇండియన్స్‌పై చేసిన 48 పరుగులు అత్యధికం. చెన్నైపై 6 పరుగులు, హైద్రాబాదుపై 3 పరుగులు, రాజస్తాన్‌పై 23 పరుగులు చేసాడు. దీంతో ట్విట్టర్ వేదికగా కోహ్లీ తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నాడు.

వాటిపై దృష్టిపెట్టి బయటపడతాడు:

వాటిపై దృష్టిపెట్టి బయటపడతాడు:

ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఆటగాళ్లు వీవీఎస్‌ లక్ష్మణ్‌, కపిల్‌ దేవ్‌లు విరాట్ కోహ్లీపై వస్తున్న విమర్శలపై స్పందించారు. లక్ష్మణ్‌ మాట్లాడుతూ... గత ఐపీఎల్‌ టోర్నీలో కోహ్లీ స్పిన్నర్లు ముజ్బీబ్‌, జంపా, మర్కాండేల బౌలింగ్‌లో ఔటయ్యాడు. మొన్న జరిగిన మ్యాచ్‌లో శ్రేయాస్‌ గోపాల్ ఔట్‌ చేశాడు. ఈ విషయాన్ని విరాట్‌ గుర్తుంచుకుంటాడు. అతడు ఔటయ్యిన విషయంపై దృష్టిపెట్టి దాని నుంచి బయటపడతాడు. ఇంగ్లాండ్‌ సిరీస్‌లో కూడా కోహ్లీ అలానే చేసాడు' అని లక్ష్మణ్ అన్నారు.

గెలవాలనే కసి ఉంటుంది:

గెలవాలనే కసి ఉంటుంది:

'విరాట్ కోహ్లీ ప్రత్యేకమైన ఆటగాడు. ఎప్పుడూ కూడా జట్టును విజయ తీరాలకు చేర్చాలని తపన పడుతుంటాడు. గెలవాలనే కసి కోహ్లీలో ఉంటుంది. ప్రస్తుతం కూడా అతడు పుంజుకుంటాడు. బెంగళూరు ఆడే తదుపరి 3 మ్యాచులు ఆ జట్టుకి చాలా కీలకం. జట్టులో కోహ్లీతో పాటు ఏబీ డివిలియర్స్‌ వంటి నైపుణ్యం ఉన్న ఆటగాళ్లు ఉన్నారు. ఆ జట్టు తప్పకుండ గాడిలో పడుతుంది' అని లక్ష్మణ్ పేర్కొన్నారు.

కోహ్లీకి అదృష్టం తోడవ్వాలి:

కోహ్లీకి అదృష్టం తోడవ్వాలి:

'సానుకూల దృక్పథంతో కోహ్లీ వచ్చే మ్యాచులు ఆడతాడు. కోహ్లీకి ప్రస్తుతం గడ్డుకాలం ముగిసింది.. ఇక కాస్త అదృష్టం తోడవ్వాలి. మరోవైపు అతనికి ఉన్న క్రికెట్ అనుభవాన్ని వినియోగించుకోవాలి. తన ఆటతీరు ఏంటో అతడికి తెలుసు. కోహ్లీ కచ్చితంగా రాణిస్తాడు' అని కపిల్‌ దేవ్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.

Story first published: Thursday, April 4, 2019, 17:16 [IST]
Other articles published on Apr 4, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X