న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మన పేస్ విప్లవానికి అతనే కారణం: వీవీఎస్ లక్ష్మణ్

 VVS Laxman Credits Javagal Srinath Triggered A Revolution In Indian Pace Bowling

హైదరాబాద్: ఒకప్పుడు భారత బౌలింగ్ అంటే స్పిన్నర్లే. దాదాపు 20-30 ఏళ్ల పాటు టీమిండియా బౌలింగ్‌కు వాళ్లే అండగా నిలిచారు. కానీ గత రెండు, మూడేళ్లలో మన పేస్ బౌలింగ్ ఒక్కసారిగా పదునెక్కింది. వరల్డ్ క్లాస్ బౌలింగ్ యూనిట్‌గా ప్రత్యర్థులను వణికిస్తుంది. జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్, ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్‌లతో కూడిన పేస్ దళం.. స్వదేశంతో పాటు విదేశాల్లోనూ జట్టుకు విజయాలు అందిస్తుంది.

అయితే ఈ విప్లవాత్మక మార్పుకు నాంది పలికింది భారత మాజీ పేసర్ జవగళ్ శ్రీనాథ్ అని దిగ్గజ క్రికెటర్, హైదరాబాద్ సొగసరి బ్యాట్స్‌మన్ వీవీఎస్ లక్ష్మణ్ అభిప్రాయపడ్డాడు.
భారత జట్టులో తనతో ఆడిన ఆటగాళ్లలో నైపుణ్యాలు, వారి నుంచి ఏం నేర్చుకున్నానో వివరిస్తానని లక్ష్మణ్ వారం క్రితం ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటికే రాహుల్ ద్రవిడ్, సౌరవ్ గంగూలీ, అనిల్ కుంబ్లే, సచిన్ టెండూల్కర్ గురించి చెప్పిన ఈ హైదరాబాద్ స్టార్ క్రికెటర్.. గురువారం శ్రీనాథ్ గురించి మాట్లాడుతూ అతనిపై ప్రశంసల జల్లు కురిపించాడు.

'మైసూర్ నుంచి వచ్చిన ఓ అద్భుతమైన పేసర్ భారత్ ఫాస్ట్ బౌలింగ్‌లో ఒక విప్లవాన్ని ప్రేరేపించాడు. అసలే మాత్రం అనుకూలించని పరిస్థితుల్లోనూ జట్టు అవసరాలకు తగ్గట్టుగా ఎంతో ఉత్సాహంగా స్పందించేవాడు. అత్యంత ప్రతికూల పరిస్థితుల్లోనూ సత్తాచాటాలనే తపనే అతని బలం'అని కొనియాడుతూ లక్మణ్ ట్వీట్ చేశాడు. ఇక భారత్ తరఫున 1991 అక్టోబర్‌లో అరంగేట్రం చేసిన శ్రీకాంత్ 67 టెస్ట్‌ల్లో 236, 229 వన్డేల్లో 315 వికెట్లు తీశాడు.

డిప్రెషన్‌లో చిక్కుకొని చావాలనుకున్నా: ఊతప్పడిప్రెషన్‌లో చిక్కుకొని చావాలనుకున్నా: ఊతప్ప

Story first published: Friday, June 5, 2020, 9:14 [IST]
Other articles published on Jun 5, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X