న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టీమిండియా బౌలింగ్‍పై ప్రశంసలు కురిపిస్తోన్న లక్ష్మణ్, సెహ్వాగ్

Asia Cup 2018 : VVS Laxman And Veerendra Sehwag Tweeted On Yesterday's Ind vs Pak Match | Oneindia
Virender Sehwag and VVS Laxmans appraises team India bowling

న్యూ ఢిల్లీ: ఆసియా కప్‌లో భాగంగా జరిగిన వన్డేలో పాకిస్థాన్‌పై భారత్ సునాయాసంగా విజయాన్ని సాధించింది. ఆ మ్యాచ్‌లో బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారంటూ .. మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ ప్రశంసలు కురిపించారు. టీమిండియాను కెప్టెన్ రోహిత్ సమర్థంగా నడిపించారని ట్వీట్ చేశారు. విపరీతమైన వేడిలో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో భారత్ నెగ్గడం గొప్పవిషయమని లక్ష్మణ్ తెలిపాడు.

మాజీ డ్యాషింగ్ ఓపెనర్ సెహ్వాగ్ కూడా టీమిండియాకు కంగ్రాట్స్ తెలిపాడు. ఇండియా సంపూర్ణమైన విజయాన్ని నమోదు చేసిందని సెహ్వాగ్ తన ట్వీట్‌లో తెలిపాడు. టీమంతా కలిసికట్టుగా ఆడిందని, ప్రతి ఒక్కరూ అద్భుతమైన ప్రదర్శన ఇచ్చారని వీరూ తెలిపాడు.

ఆసియా కప్‌లో తన ఆరంభ మ్యాచ్‌లో హాంకాంగ్‌ను చిత్తుగా ఓడించింది పాకిస్థాన్‌. ఆ చిన్న జట్టుపై టీమ్‌ఇండియా మాత్రం చచ్చీ చెడీ గెలిచింది. ఇక దుబాయేమో పాకిస్థాన్‌కు రెండో సొంతగడ్డ. అక్కడి పరిస్థితులు వాళ్లకు కొట్టిన పిండి. చివరగా ఛాంపియన్స్‌ ట్రోఫీలో భారత్‌తో మ్యాచ్‌లో భారీ విజయం సాధించింది పాక్‌. గత ఏడాది కాలంలో వాళ్ల ఫామ్‌ కూడా బావుంది.

కానీ మ్యాచ్‌ మొదలైన కొన్ని నిమిషాలకే ఆందోళన ఎగిరిపోయింది. సందేహాలు పటాపంచలయ్యాయి. ఒక్క రోజు వ్యవధిలో భారత ఆటగాళ్ల ప్రదర్శన మారిపోయింది. పాక్‌తో పోరనగానే మనోళ్లలో ఎక్కడ లేని కసి వచ్చింది. పట్టుదల పెరిగింది. బౌలర్లు విజృంభించారు. బ్యాట్స్‌మెనూ చెలరేగారు. భారత్‌కు సునాయాస విజయాన్నందించారు. సూపర్‌-4 దశలో భారత్‌.. ఆదివారం పాక్‌తో మళ్లీ తలపడబోతుండటం విశేషం.

కంగ్రాట్స్‌ ఇండియా. బౌలర్లు, బ్యాట్స్‌మెన్‌ అంతా కలిసి చక్కటి ప్రదర్శన చేశారు.

గొప్ప మ్యాచ్.. గొప్ప విజయం.. కంగ్రాట్స్ టీమిండియా.

అద్భుతంగా ఆడారు.. కంగ్రాట్స్‌ టీమిండియా.

Story first published: Thursday, September 20, 2018, 12:10 [IST]
Other articles published on Sep 20, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X