న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

దాదా ఎంతో ధైర్యం ఇచ్చారు.. నేను ఈ స్థానంలో ఉన్నానంటే కారణం ఆయనే: సెహ్వాగ్‌

Virender Sehwag reveals how Sourav Ganguly convinced him to open batting for India

ఢిల్లీ: బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ జట్టులోని ఆటగాళ్లకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చారు. దాదా ప్రోత్సహించడం వల్లనే టీమిండియా ఓపెనర్‌గా విజయవంతమయ్యా. నేను ఈ స్థానంలో ఉన్నానంటే దానికి కారణం దాదానే అని మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌ పేర్కొన్నారు. తాజాగా ఓ మీడియా సమావేశంలో పాల్గొన్న సెహ్వాగ్‌.. గంగూలీతో తన అనుభవాలను పంచుకున్నారు.

<strong>India vs Bangladesh: కోల్‌కతాలో డేనైట్ టెస్టు పక్కాగా జరుగుతుంది: గంగూలీ</strong>India vs Bangladesh: కోల్‌కతాలో డేనైట్ టెస్టు పక్కాగా జరుగుతుంది: గంగూలీ

ఓపెనర్ స్థానం ఖాళీగా ఉంది

ఓపెనర్ స్థానం ఖాళీగా ఉంది

వీరేంద్ర సెహ్వాగ్‌ మాట్లాడుతూ... 'టాప్‌ ఆర్డర్‌లో నేను బ్యాటింగ్‌ చేయడానికి ప్రధాన కారణం దాదా. ఓసారి దాదా నా దగ్గరికి వచ్చి ఓపెనింగ్ చేస్తావా అని అడిగాడు. ఏం మాట్లాడాలో అర్ధం కాలేదు. అయినా సాధారణంగా సమాధానం ఇచ్చా. నువ్వు ఓపెనర్‌గా ఎందుకు బరిలోకి దిగకూడదు?. ఓపెనర్ స్థానం ఖాళీగా ఉంది. సచిన్ టెండూల్కర్ కూడా ఓపెనింగ్ చేస్తాడు' అని చెప్పారు.

దాదా ఎంతో ధైర్యం ఇచ్చారు

దాదా ఎంతో ధైర్యం ఇచ్చారు

'మిడిల్‌ఆర్డర్‌లో ఆడాలని నువ్వు అనుకుంటే.. జట్టులోని ఇతర ఆటగాళ్లకు గాయమయ్యే వరకు జట్టులో స్థానం కోసం ఎదురుచూడాల్సి వస్తుంది. మూడు నుంచి నాలుగు ఇన్నింగ్స్‌ల వరకు ఓపెనర్‌గా అవకాశం ఇస్తా. నువ్వెంతో నిరూపించుకో. ఒకవేళ విఫలమైతే మిడిలార్డర్‌లో ఆడు' అని దాదా అన్నారు. 'దాదా మాటలు నాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చాయి. ఆటగాడిపై కెప్టెన్ ఉంచే నమ్మకానికి ఇదే నిదర్శనం. నేను ఈ స్థానంలో ఉన్నానంటే దానికి కారణం దాదానే' అని సెహ్వాగ్‌ అన్నారు.

గంగూలీనే సరైనోడు

గంగూలీనే సరైనోడు

'గంగూలీ దేశవాళీ క్రికెట్‌ను మెరుగుపరుస్తానని చెప్పడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఆ పని చేయడానికి గంగూలీనే సరైనోడు. దేశవాళీ క్రికెట్‌లోని సమస్యలన్నీ అతడికి తెలుసు. జాతీయ జట్టులో దాదా చోటు కోల్పోయినప్పుడు దేశవాళీ క్రికెట్‌ ఆడుతూ దేశమంతటా పర్యటించాడు. తిరిగి జట్టులో చోటు దక్కించుకున్న తర్వాత దేశవాళీ క్రికెట్‌లోని లోపాల గురించి నాతో చర్చించాడు. విఫలమయినా దాదా ఆటగాళ్లను ఉత్తేజపరుస్తూ వారిలో ఆత్మవిశ్వాసం నింపేవారు' అని సెహ్వాగ్‌ చెప్పుకొచ్చారు.

గంగూలీ తెలివైన నాయకుడు

గంగూలీ తెలివైన నాయకుడు

'గంగూలీ తెలివైన సహజసిద్ధ నాయకుడు. అందరి అభిప్రాయాలను గౌరవిస్తాడు. కానీ.. ఏది సరైనదని భావిస్తాడో అదే చేస్తాడు' అని సెహ్వాగ్‌ పేర్కొన్నారు. అక్టోబర్‌ 23న దాదా బీసీసీఐ అధ్యక్ష బాధ్యతలు అందుకున్న విషయం తెలిసిందే. బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నికైన రెండో క్రికెటర్‌గా గంగూలీ చరిత్ర సృష్టించారు.

సచిన్‌ గైర్హాజరీలో ఓపెనర్‌గా

సచిన్‌ గైర్హాజరీలో ఓపెనర్‌గా

1999లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన సెహ్వాగ్.. కొన్ని రోజులు మిడిల్‌ ఆర్డర్‌లో ఆడాడు. 2001లో శ్రీలంకలో జరిగిన ట్రై సిరీస్‌లో సచిన్‌ గైర్హాజరీలో ఓపెనర్‌గా వచ్చిన సెహ్వగ్‌.. న్యూజీలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 69 బంతుల్లోనే సెంచరీ చేసాడు. ఫాస్టెస్ట్‌ సెంచరీ చేసిన మూడో భారత క్రికెటర్‌గా నిలిచాడు. టెస్టు ఫార్మాట్‌లో ట్రిపుల్‌ సెంచరీలు చేశాడు. 14 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్‌లో మూడు ఫార్మాట్‌లు కలిపి 17వేలకుపైగా పరుగులు చేశాడు.

Story first published: Tuesday, October 29, 2019, 9:10 [IST]
Other articles published on Oct 29, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X