న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

న్యూజిలాండ్ ఏడో సూపర్ ఓవర్ ఓటమి.. నెట్టింట పేలుతున్న జోకులు, మీమ్స్

Virat was right, NZ players are nice guys: Fans troll Black Caps after Wellington T20I thriller

హైదరాబాద్: న్యూజిలాండ్‌కు సూపర్ ఓవర్ ఏ మాత్రం కలిసి రావడం లేదు. భారత్‌తో మూడో ఓటమి అనంతరం ఆ జట్టు కెప్టెన్ విలియమ్సన్ కూడా ఇదే అభిప్రాయం వక్తం చేశాడు. అంతేకాకుండా అసలు సూపర్ ఓవర్‌కు రాకుండానే ఫలితం రాబట్టాలని కూడా అభిప్రాయపడ్డాడు. కానీ కాకతాళీయమో ఏమో కానీ రెండు రోజుల తర్వాత జరిగిన నాలుగో టీ20లో కూడా సూపర్ ఓవర్‌కు దారితీయడం.. న్యూజిలాండ్ ఓడిపోవడం అలా జరిగిపోయింది.

ఇప్పటికే సూపర్ ఓవర్ పుణ్యాన విశ్వటైటిల్ చేజార్చుకున్న న్యూజిలాండ్.. ఇప్పుడు వరుసగా పరాజయాలపాలవుతోంది. అద్భుతంగా ఆడినా గెలవలేకపోతుంది. ఇక వరల్డ్ కప్ ఓటమితో సహా బ్లాక్ క్యాప్స్‌కు ఇది వరుసగా నాలుగో సూపర్ ఓవర్ ఓటమి కావడం గమనార్హం. అంతర్జాతీయ క్రికెట్‌లో తొలి సూపర్ ఓవర్ ఆడిన జట్టు.. ఎక్కువ సార్లు ఆడిన ఓడిన టీమ్ న్యూజిలాండే కావడం విశేషం. ఇప్పటి వరకు ఆ జట్టు టీ20ల్లో 8 సూపర్ ఓవర్లు ఆడగా ఒక్కటంటే ఒక్కటే గెలిచి ఏడ్చినట్లు ఏడింట్లో ఓడిపోయింది.

ఇప్పుడే ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఓ ఆట ఆడుకుంటున్నారు. 'ఒక వేళ ఆమె సూపర్ ఓవర్ అయితే.. నేను న్యూజిలాండ్'అని, న్యూజిలాండ్ మరో సౌతాఫ్రికా అని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. అంతేకాకుండా కివీస్ టూర్‌కు ముందు కోహ్లీ చెప్పిన మాటలను ప్రస్తావిస్తూ.. 'న్యూజిలాండ్ ప్లేయర్లు చాలా నైస్. అందుకే ఎవ్వరిని హర్ట్ చేయకుండా మ్యాచ్‌లు టై చేస్తున్నారు. గెలవకుండా తమని తామె హర్ట్ చేసుకుంటున్నారు. కోహ్లీ చెప్పింది నిజమే.. వారు చాలా నైస్'అని సెటైర్లు వేస్తున్నారు.

ఇంకొందరూ కామెంటేటర్ ఇయాన్ స్మిత్ ఫొటో పెట్టి మళ్లీ మళ్లీ ఓడింది! అనే క్యాప్షన్‌తో షేర్ చేస్తున్నారు. మరికొందరూ వారి ఎడిటింగ్ నైపుణ్యానికి పనిచెప్పి మరి మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. మొత్తానికి గెలిచే మ్యాచ్‌లో ఓడిని జట్టును సోషల్ మీడియా వేదికగా ఓ ఆట ఆడుకుంటున్నారు.

Story first published: Friday, January 31, 2020, 20:17 [IST]
Other articles published on Jan 31, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X