న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మ్యాన్ ఆఫ్ ద సిరీస్‌లలో గంగూలీతో పాటుగా కోహ్లీ

Virat Kohli Wins 7th Man Of The Series Award, Equals Sourav Gangulys Record

హైదరాబాద్: భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో ఘనత అందుకున్నాడు. ఫర్‌ఫెక్ట్ ఫిట్‌నెస్‌తో భారీగా పరుగుల వరద పారిస్తున్న రన్‌ మెషీన్‌.. వెస్టిండీస్‌తో జరిగిన అయిదు వన్డేల సిరీస్‌లో మూడు సెంచరీలు సాధించి (453 రన్స్‌) మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌గా ఎంపికయ్యాడు. దీంతో అతను వన్డే క్రికెట్‌లో 7 మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌ అవార్డులు సొంతం చేసుకున్న ఆటగాడిగా విరాట్‌ నిలిచాడు.

సచిన్‌ మొదటి స్థానంలో 15తో నిలవగా..

సచిన్‌ మొదటి స్థానంలో 15తో నిలవగా..

ఇలా 7 మ్యాన్ ఆఫ్ ద సిరీస్‌లు గెలుచుకున్న ఆటగాళ్ల జాబితాలో చేరిపోయిన కోహ్లీ.. టీమిండియా మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ, యువరాజ్‌ సింగ్‌, వివ్‌ రిచర్డ్ష్‌, రికీ పాంటింగ్‌, హషీం ఆమ్లా సరసన చేరాడు. కాగా, ఈ కేటగిరిలో 15 మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్ అవార్డులు సాధించి మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్ మొదటి స్థానంలో నిలవగా.. 11 అవార్డులతో సనత్‌ జయసూర్య, 9 అవార్డులతో షాన్‌ పొల్లాక్‌ తరువాతి స్థానాల్లో ఉన్నారు.

మూడు వన్డేల్లోనూ వరుసగా సెంచరీలు

మూడు వన్డేల్లోనూ వరుసగా సెంచరీలు

రెండు టెస్టు సిరీస్‌ల భాగంగా వెస్టిండీస్‌తో తలపడిన కోహ్లీ.. రెండు ఇన్నింగ్స్‌లు కలిపి 184పరుగులు నమోదు చేశాడు. ఇదే క్రమంలో వన్డేల్లోనూ చక్కటి ప్రదర్శన చూపించి మరిన్ని రికార్డులు కొల్లగొట్టాడు. మొదటి మూడు వన్డేల్లోనూ వరుసగా సెంచరీలు నమోదుచేసి హ్యాట్రిక్ సెంచరీల రికార్డు సృష్టించాడు. తాజా వన్డే సిరీస్‌లో విరాట్‌ కోహ్లి మొదటి మ్యాచ్‌లో 140, రెండో మ్యాచ్‌లో 157, మూడో మ్యాచ్‌లో 107 పరుగులు చేసిన విషయం తెలిసిందే.

వాళ్లు లేనప్పుడే ఆస్ట్రేలియాను గెలవాలి: సచిన్

కోహ్లీ-రోహిత్‌ల జోడీ రికార్డు

కోహ్లీ-రోహిత్‌ల జోడీ రికార్డు

వన్డేల్లో కోహ్లీ-రోహిత్‌ల జోడీ 4000 పరుగులను పూర్తి చేసుకుంది. ఈ క్రమంలో వీరిద్దరూ కలిసి 66 సార్లు భాగస్వామ్యాల్లోనే ఈ మైలురాయిని అందుకున్నారు. ఈ క్రమంలో రాహుల్ ద్రవిడ్-సౌరవ్ గంగూలీ(80) రికార్డుని బద్దలు కొట్టారు.

భారత్‌ 14.5 ఓవర్లలో వికెట్‌ నష్టానికి

భారత్‌ 14.5 ఓవర్లలో వికెట్‌ నష్టానికి

ఇక గురువారం కేరళలోని గ్రీన్‌ఫీల్డ్‌ స్టేడియంలో వెస్టిండీస్‌తో జరిగిన చివరిదైన 5 వన్డేలో భారత్‌ ఫలితం 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఐదు వన్డేల సిరీస్‌ను 3-1తో సొంతం చేసుకుంది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న విండీస్‌ 31.5 ఓవర్లలో 104 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్‌ జేసన్‌ హోల్డర్‌ (33 బంతుల్లో 25; 2 ఫోర్లు), మార్లోన్‌ శామ్యూల్స్‌ (38 బంతుల్లో 24; 3 ఫోర్లు, 1 సిక్స్‌) ఓ మాదిరిగా ఆడగా, జట్టులో ఎనిమిది మంది కనీసం రెండంకెల స్కోరు కూడా చేయలేకపోయారు. అనంతరం భారత్‌ 14.5 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 105 పరుగులు చేసి సునాయాసంగా విజయాన్ని అందుకుంది.

Story first published: Friday, November 2, 2018, 13:32 [IST]
Other articles published on Nov 2, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X