Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

'నేనే 4 సార్లు డకౌట్ అయ్యా!': టీ20 వరల్డ్ కప్ హీరో వెనుక కోచ్ వ్యూహం!

టీ20 వరల్డ్ కప్ 2026లో టీమిండియా యువ ఓపెనర్, నంబర్ వన్ టీ20 బ్యాటర్ అభిషేక్ శర్మ ఆరంభంలో వరుసగా విఫలమైనప్పటికీ.. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అతడిపై అచంచలమైన నమ్మకాన్ని ఉంచారు. లీగ్ దశలో 3 ఇన్నింగ్స్‌ల్లో పరుగులు సాధించలేకపోయినా అభిషేక్ శర్మను తుది జట్టులో కొనసాగించాలనే గౌతమ్ గంభీర్ తీసుకున్న సాహసోపేత నిర్ణయం వెనుక ఉన్న ఆసక్తికర కారణాలను తాజాగా వెల్లడించారు.

వృథాగా పోని గంభీర్ నమ్మకం
అమృత్‌సర్‌కు చెందిన 25 ఏళ్ల అభిషేక్ శర్మపై గంభీర్ ఉంచిన నమ్మకాన్ని అతను నిలబెట్టుకున్నాడు. ఫిబ్రవరి 26న జింబాబ్వేతో జరిగిన సూపర్ 8 మ్యాచ్‌లో కేవలం 30 బంతుల్లోనే 55 పరుగులు చేశాడు. ఇక అత్యంత కీలకమైన ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టుపై కేవలం 21 బంతుల్లోనే 52 పరుగులు బాది భారత్ విశ్వవిజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ టోర్నీలో అభిషేక్ శర్మ మూడు సార్లు డకౌట్ అయినప్పటికీ.. రెండు మెరుపు హాఫ్ సెంచరీలతో తన విలువను చాటుకున్నాడు.

Gautam Gambhir Reveals Strategy Behind Backing Abhishek Sharma in T20 World Cup 2026 Details

నా అనుభవం గుర్తొచ్చింది:కోచ్ గంభీర్
అభిషేక్ శర్మ ఫామ్ గురించి విమర్శలు వస్తున్న సమయంలో గౌతమ్ గంభీర్ అతడికి ఎలా మద్దతు ఇచ్చారో అని 'ఫాలో ది బ్లూస్' కార్యక్రమంలో వివరించారు. "2014 ఐపీఎల్ సీజన్‌లో నేను అభిషేక్ కంటే ఘోరమైన అనుభవాన్ని ఎదుర్కొన్నాను. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో డకౌట్ అయ్యాను, నాలుగో మ్యాచ్‌లోనూ సున్నాకే వెనుదిరిగాను. ఆ బాధ నాకు తెలుసు" అని గంభీర్ తన పాత రోజులను గుర్తు చేసుకున్నారు.

పరుగులు రానంత మాత్రాన ఫామ్‌లో లేనట్టు కాదు..
అభిషేక్‌ శర్మతో గౌతమ్ గంభీర్ చెప్పిన మాటలు అతనిలో ఎంతో ధైర్యాన్ని నింపాయి. "ప్రజలు నీ స్కోరు బోర్డు చూసి నువ్వు ఫామ్‌లో లేవని అంటారు. కానీ వాస్తవానికి నీకు పరుగులు రాలేదు అంతే, నువ్వు ఫామ్‌లో లేవని కాదు. కనీసం 20 నుంచి 30 బంతులు ఆడితేనే ఒక ఆటగాడి సామర్థ్యాన్ని అంచనా వేయగలం. నువ్వు అంతవరకు కూడా ఆడలేదు. కాబట్టి తర్వాతి మ్యాచ్‌లో మరింత దూకుడుగా ఆడు" అని గంభీర్ అభిషేక్‌కు భరోసా ఇచ్చారు.

డ్రెస్సింగ్ రూమ్ నమ్మకమే ముఖ్యం
బయటి ప్రపంచం ఓ ఆటగాడి గురించి ఏమనుకుంటుందో అన్నది ముఖ్యం కాదని.. డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్న మిగతా 30 మంది అతనిపై ఎంత నమ్మకంగా ఉన్నారన్నదే ముఖ్యమని గంభీర్ స్పష్టం చేశారు. ప్రపంచకప్‌కు ఎంపికైన ప్రతి ఆటగాడిపై తమకు పూర్తి విశ్వాసం ఉందని.. అందుకే అభిషేక్ శర్మను తుది వరకు ఆడించామని గంభీర్ గర్వంగా చెప్పుకొచ్చారు.

Story first published: Sunday, March 15, 2026, 16:38 [IST]
Other articles published on Mar 15, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+