న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వాళ్లు లేనప్పుడే ఆస్ట్రేలియాను గెలవాలి: సచిన్

Virat Kohli is one of leading players of all time, but never believed in comparisons: Sachin Tendulkar

హైదరాబాద్: భారత్‌లో వెస్టిండీస్ పర్యటనల 2/3వ వంతు పూర్తయినట్లే. ఇక మిగిలిందొక్కటే టీ20 సిరీస్. ఈ షార్ట్ ఫార్మాట్‌లో అద్భుతమైన ఫామ్‌లో దూసుకెళ్తున్న టీమిండియాకు ఈ సిరీస్ లెక్కేం కాదు. వెస్టిండీస్‌తో టీ20ల అనంతరం టీమిండియా ఆస్ట్రేలియా పర్యటన చేయనుంది. ఈ పర్యటన భారత్‌కు చాలా లాభదాయకమంటున్నాడు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్.

టెస్టు సిరీస్‌ గెలిచేందుకు మంచి అవకాశాలే

టెస్టు సిరీస్‌ గెలిచేందుకు మంచి అవకాశాలే

ఇటీవల ఇంగ్లాండ్‌లో క్రికెట్ అకాడమీ మొదలుపెట్టిన సచిన్.. అంతకుముందే ముంబైలోనూ క్రికెట్ అకాడమీ నడిపిస్తున్నాడు. అక్కడ స్థానిక మీడియాతో మాట్లాడిన సచిన్.. మరోవైపు ఈసారి ఆస్ట్రేలియాలో భారత్‌ టెస్టు సిరీస్‌ గెలిచేందుకు మంచి అవకాశాలే ఉన్నాయని మాస్టర్‌ అన్నాడు.

ధోనీ ఆశించాడు.. కాబట్టే టీ20 నుంచి తప్పుకున్నాడు: కోహ్లీ

ఫలితం రాబట్టడానికి మంచి తరుణం

ఫలితం రాబట్టడానికి మంచి తరుణం

‘ఈసారి ఆస్ట్రేలియాలో విజయం సాధించేందుకు మనవాళ్లకు మంచి అవకాశాలున్నాయి. ప్రస్తుత ఆస్ట్రేలియా జట్టు స్మిత్‌, వార్నర్‌ ఉన్నప్పటిలా లేదు. కాబట్టి భిన్నమైన ఫలితం రాబట్టడానికి ఇదే మంచి తరుణం'అని సచిన్‌ అన్నాడు.

క్రికెట్‌ చరిత్రలో బ్యాట్స్‌మెన్‌లో కోహ్లి ఒకడు

క్రికెట్‌ చరిత్రలో బ్యాట్స్‌మెన్‌లో కోహ్లి ఒకడు

టీమిండియాను వరుస విజయాలతో నడిపిస్తున్న కెప్టెన్ కోహ్లీని కొనియాడాడు. క్రికెట్‌ చరిత్రలో అత్యంత గొప్ప బ్యాట్స్‌మెన్‌లో విరాట్‌ కోహ్లి ఒకడనడంలో సందేహం లేదని సచిన్‌ అభిప్రాయపడ్డాడు. ఐతే వేర్వేరు తరాల ఆటగాళ్లను పోల్చడం మాత్రం సరి కాదని అతనన్నాడు.

బ్యాట్స్‌మెన్‌ ఎదుర్కొన్న బౌలర్లు వేరు.

బ్యాట్స్‌మెన్‌ ఎదుర్కొన్న బౌలర్లు వేరు.

ఒక ఆటగాడిగా కోహ్లి అభివృద్ధి చెందిన తీరు అమోఘం. ఎప్పుడూ అతడిలో ఒక మెరుపు చూస్తూనే ఉన్నా. ప్రపంచ అత్యుత్తమ ఆటగాళ్లలో అతనొకడు అవుతాడని ముందే ఊహించా. ఈ తరం అనే కాదు.. మొత్తంగా క్రికెట్‌ చరిత్రలోనే గొప్ప ఆటగాళ్లలో అతనొకడు. ఐతే వేర్వేరు తరాలకు చెందిన ఆటగాళ్లను పోల్చడం మాత్రం సమంజసం కాదు. ఆయా కాలాల్లో బ్యాట్స్‌మెన్‌ ఎదుర్కొన్న బౌలర్లు వేరు. పరిస్థితులు వేరని సచిన్‌ చెప్పుకొచ్చాడు.

Story first published: Friday, November 2, 2018, 10:54 [IST]
Other articles published on Nov 2, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X