న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బంగ్లాతో టీ20 సిరిస్‌కు విరాట్ కోహ్లీ దూరం: కెప్టెన్‌గా రోహిత్ శర్మ!

Virat Kohli To Skip T20I Series With Bangladesh
Virat Kohli to skip the T20I series against Bangladesh

హైదరాబాద్: బంగ్లాదేశ్‌తో స్వదేశంలో జరగనున్న టీ20 సిరిస్‌ నుంచి టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ విశ్రాంతి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది మార్చి నుంచి విరాట్ కోహ్లీ నాన్ స్టాఫ్‌గా క్రికెట్ ఆడుతోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీ పని భారాన్ని దృష్టిలో పెట్టుకుని జట్టు మనేజ్‌మెంట్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

వరల్డ్‌కప్‌కు ముందు పలువురు సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతి ఇచ్చినప్పటికీ కోహ్లీకి మాత్రం ఆ అవకాశం లేదు. విరాట్ కోహ్లీ చివరగా ఈ ఏడాది జనవరిలో విశ్రాంతి తీసుకున్నాడు. జనవరిలో న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరిస్‌లో చివరి రెండు వన్డేలతో పాటు ఆ తర్వాత జరిగిన టీ20 సిరిస్‌ నుంచి కోహ్లీ విశ్రాంతి తీసుకున్నాడు.

<strong>బ్యాడ్ లైట్: రాంచీ టెస్టు, Day 1: రోహిత్ సెంచరీ, టీమిండియా 224/3</strong>బ్యాడ్ లైట్: రాంచీ టెస్టు, Day 1: రోహిత్ సెంచరీ, టీమిండియా 224/3

కోహ్లీకి విశ్రాంతి

కోహ్లీకి విశ్రాంతి

బీసీసీఐ వర్గాల సమాచారం మేరకు బంగ్లాదేశ్‌తో జరగనున్న మూడు టీ20ల సిరిస్ నుంచి విరాట్ కోహ్లీకి విశ్రాంతి ఇచ్చేందుకు జట్టు మేనేజ్‌మెంట్ సిద్ధమైంది. "అవును, ఆస్ట్రేలియా సిరిస్, ఐపీఎల్, వరల్డ్‌కప్, వెస్టిండిస్‌లో పర్యటన, ఇప్పుడు దక్షిణాఫ్రికాతో సిరిస్ ఇలా... కోహ్లీ నాన్ స్టాఫ్‌గా క్రికెట్ ఆడుతుండటంతో అతడికి విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించాం" అని తెలిపారు.

పనిభారాన్ని దృష్టిలో పెట్టుకుని

పనిభారాన్ని దృష్టిలో పెట్టుకుని

"ఆటగాళ్ల పనిభారాన్ని దృష్టిలో పెట్టుకుని... ముఖ్యంగా మూడు ఫార్మాట్లలో ఆడుతున్న ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వాలని భావించాం. విశ్రాంతి ఇవ్వడం వల్ల ఆటగాళ్ళు కూడా తాజాగా ఉంటారు. వారి ఆట పైన ప్రత్యేకంగా దృష్టి సారిస్తారు" అని తెలిపారు. బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ ఎన్నికైన మరుసటి రోజునే బంగ్లాదేశ్‌తో టీ20 సిరిస్‌కు జట్టుని ఎంపిక చేయనున్నారు.

అక్టోబర్ 23న బాధ్యతలు

అక్టోబర్ 23న బాధ్యతలు

బీసీసీఐ నూతన అధ్యక్షుడిగా టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అక్టోబర్ 23న బాధ్యతలు చేపట్టనున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ధోనిపై భవితవ్వంపై సెలెక్టర్లతో మాట్లాడి ఓ నిర్ణయం తీసుకుంటామని గంగూలీ వెల్లడించిన సంగతి తెలిసిందే. కాగా, ఇంగ్లాండ్‌ వేదికగా వరల్డ్‌కప్ ముగిసిన తర్వాత నుంచి ధోని విశ్రాంతి తీసుకుంటున్నాడు.

టెస్టు సిరిస్‌కు అందుబాటులో

టెస్టు సిరిస్‌కు అందుబాటులో

టీ20 సిరిస్ అనంతరం ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో టీమిండియా రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ ఆడనుంది. ఈ సిరిస్‌కు తిరిగి కోహ్లీ జట్టులోకి వస్తాడని తెలిపారు. "అవును, విరాట్ కోహ్లీ బంగ్లాతో జరగబోయే రెండు టెస్టులకు జట్టులో తిరిగి వస్తాడు" అని తెలిపాడు. ఎందుకంటే ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో టీమిండియాను విజేతగా నిలబెట్టేందుకు కోహ్లీ ఏ అవకాశాన్ని కూడా వదులుకోకూడదని నిర్ణయించుకున్నాడు.

Story first published: Saturday, October 19, 2019, 18:06 [IST]
Other articles published on Oct 19, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X