న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

18,000: సచిన్, లారా, పాంటింగ్ రికార్డు బద్దలు కొట్టిన కోహ్లీ

By Nageshwara Rao
 Virat Kohli surpasses sachin, lara and pointing by scoring 18,000 runs in record innings

హైదరాబాద్: ఓవల్ వేదికగా ఆతిథ్య ఇంగ్లాండ్‌తో జరుగుతున్న చివరి టెస్టులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కెరీర్‌లో మరో మైలురాయి చేరింది. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత వేగంగా (382 ఇన్నింగ్స్‌) 18 వేల పరుగులు చేసిన క్రికెటర్‌గా విరాట్ కోహ్లీ రికార్డు సృష్టించాడు.

చివరి టెస్టులో రెండో రోజైన శనివారం విరాట్ కోహ్లీ 49 పరుగులు చేయడంతో ఈ ఘనత సాధించాడు. ఈ క్రమంలో మాజీ క్రికెట్ దిగ్గజాలు బ్రయాన్‌ లారా (411 ఇన్నింగ్స్‌), సచిన్‌ టెండూల్కర్‌ (412 ఇన్నింగ్స్‌), రికీ పాంటింగ్(422 ఇన్నింగ్స్‌)లను అధిగమించాడు.

 18 వేల పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో చోటు

18 వేల పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో చోటు

మరోవైపు భారత్‌ తరఫున 18 వేల పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో చోటు దక్కించుకున్నాడు. అంతకముందు భారత్ తరుపున సచిన్‌ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్‌, సౌరవ్ గంగూలీలు మాత్రమే ఈ ఘనత సాధించారు. ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో కెప్టెన్ కోహ్లీ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు.

ఇంగ్లీషు గడ్డపై చెలరేగి ఆడుతోన్న కోహ్లీ

2014 ఇంగ్లాండ్ పర్యటనతో పోలిస్తే ప్రస్తుత పర్యటనలో కోహ్లీ చెలరేగి ఆడుతున్నాడు. ట్రెంట్ బ్రిడ్జి వేదికగా జరిగిన మూడో టెస్టులో విరాట్ కోహ్లీ తన కెరీర్‌లో 23వ టెస్టు సెంచరీని నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ట్రెంట్ బ్రిడ్జి మైదానంలోని హానర్ బోర్డుపై కోహ్లీ పేరు చరిత్రలో నిలిచిపోయింది.

టెస్టుల్లో 6000 పరుగులు సైతం

అదే సమయంలో టెస్టుల్లో విరాట్ కోహ్లీ 6000 పరుగుల మైలురాయిని సైతం అందుకున్నాడు. టెస్టుల్లో ఆరు వేల పరుగులను కోహ్లీ కేవలం 70 ఇన్నింగ్స్‌ల్లో అందుకోవడం విశేషం. నాలుగో టెస్టులో ఆండర్సన్ బౌలింగ్‌లో ఫోర్‌ కొట్టిన కోహ్లీ.. అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో 6,000 పరుగులు చేసిన రెండో భారత క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు.

117 ఇన్నింగ్స్‌లలోనే 6 వేల పరుగుల మైలు రాయిని

ఈ క్రమంలో సచిన్‌ (120 ఇన్నింగ్స్‌ల) రికార్డును సైతం బద్దలు కొట్టాడు. 117 ఇన్నింగ్స్‌లలోనే 6 వేల పరుగుల మైలు రాయిని చేరుకున్న సునీల్ గవాస్కర్ ఈ జాబితాలో ముందుండగా, కోహ్లీ రెండో స్థానంలో నిలిచాడు. 120 ఇన్నింగ్స్‌లలో 6 వేల పరుగులు చేసిన టెండూల్కర్ మూడో స్థానానికి దిగజారాడు.

6వేల పరుగులు సాధించిన తొలి ఆటగాడిగా

ఆ తర్వాతి స్థానాల్లో వీరేంద్ర సెహ్వాగ్ (121), రాహుల్ ద్రవిడ్ (125) ఉన్నారు. అంతర్జాతీయంగా అత్యంత వేగంగా 6వేల పరుగులు సాధించిన తొలి ఆటగాడి రికార్డు ఆస్ట్రేలియా ఆల్‌టైమ్ గ్రేట్ సర్ డొనాల్డ్ బ్రాడ్‌మన్ పేరున ఉంది. బ్రాడ్‌మన్ కేవలం 68 ఇన్నింగ్స్‌లలోనే ఈ ఘనత సాధించాడు.

Story first published: Monday, September 10, 2018, 17:42 [IST]
Other articles published on Sep 10, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X