న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అభిమానుల మద్దతును, ప్రేమను వీడియో కాల్‌లో అనుష్కకు చూపించిన విరాట్ కోహ్లీ..

Virat Kohli Showed The Fans Support and Love Via Video Call to Anushka Sharma

తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ స్టేడియంలో దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో భారత్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. కేరళ ప్రేక్షకులు గత రెండు రోజులుగా నమ్మశక్యం కాని రీతిలో క్రికెటర్లపై తమ ప్రేమను కురిపించారు. ఇకపోతే ఈ మ్యాచ్ లో స్కోరింగ్ మ్యాచ్ అయినప్పటికీ మ్యాచ్ మంచి రసవత్తరంగానే సాగింది.

ఇక మ్యాచ్ ముగిశాక.. విరాట్ కోహ్లీ అభిమానుల ఆనందాన్ని, మద్దతును తన సతీమణి అనుష్క శర్మకు చూపించాడు. గ్రౌండ్ నుండి హోటల్ గదికి తిరిగి వచ్చే టైంలో.. కోహ్లీ బస్సులో ఉన్న టైంలో స్టేడియం వెలుపల అభిమానులు బస్సు దగ్గర గుమిగూడారు. ఇక అభిమానుల సందోహాన్ని కోహ్లీ తన భార్య అనుష్క శర్మకు వీడియో కాల్‌ ద్వారా చూపించాడు.

ఇకపోతే అభిమానులను ఆశ్చర్యపరిచేలా కోహ్లీ అకస్మాత్తుగా తన ఫోన్‌ను వారి వైపుకు తిప్పాడు. అనుష్క శర్మ వీడియో కాల్‌‌లో ఉండడంతో అభిమానులు సైతం సంబరపడిపోయారు. వీడియో కాల్‌లో అనుష్క అభిమానులకు హాయ్ చెబుతూ సందడి చేసింది. ఇకపోతే ఈ మ్యాచ్‌కు ముందు గ్రీన్‌ఫీల్డ్ స్టేడియం ముందు భాగంలో కోహ్లీ భారీ కటౌట్ అభిమానులు స్థాపించిన సంగతి తెలిసిందే. కోహ్లీతో పాటు రోహిత్ శర్మ, సంజూ శాంసన్, ఎంఎస్ ధోనీ తదితర ఆటగాళ్ల కటౌట్లు కూడా భారీగా స్టేడియం వద్ద కొలువుదీరాయి.

మొదటి టీ20లో కోహ్లీ కేవలం మూడు పరుగులకే ఔటయ్యాడు. అయితే కేఎల్ రాహుల్ (51*), సూర్యకుమార్ యాదవ్ (50*) తుది వరకు క్రీజులో ఉండి.. 93పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసిన మ్యాచ్ గెలిపించారు. మరో 20బంతులు మిగిలి ఉండగానే భారత్ గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో ఒకే ఓవర్లో 3 వికెట్లు తీసిన అర్ష్‌దీప్ సింగ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.

Story first published: Thursday, September 29, 2022, 17:22 [IST]
Other articles published on Sep 29, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X