400వ మ్యాచ్: విశాఖ వన్డేలో విరాట్ కోహ్లీ ఖాతాలో మరో అరుదైన రికార్డు

హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఖాతాలో మరో అరుదైన రికార్డుకి చేరింది. మూడు ఫార్మాట్లలో కలిపి భారత్ తరుపున 400 మ్యాచ్‌లు ఆడిన ఎనిమిదో భారత ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. మూడు వన్డేల సిరిస్‌లో భాగంగా భారత్-వెస్టిండిస్ జట్ల మధ్య బుధవారం రెండో వన్డే ప్రారంభమైంది.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన వెస్టిండిస్ కెప్టెన్ కీరన్ పొలార్డ్ టీమిండియా బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఈ మ్యాచ్ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి 400వ మ్యాచ్. మూడు ఫార్మాట్లలో కలిపి కోహ్లీ ఇప్పటి వరకు 399 మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో 84 టెస్టులు, 240 వన్డేలు, 75 టీ20లు ఉన్నాయి.

400 మ్యాచ్‌లు అంతకంటే ఎక్కువ
కాగా, 400 మ్యాచ్‌లు అంతకంటే ఎక్కువ ఆడిన భారత ఆటగాళ్ల జాబితాలో సచిన్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఆ తర్వాతి స్థానంలో ధోని, రాహుల్ ద్రవిడ్, అజహరుద్దీన్, గంగూలీ, కుంబ్లే, యువరాజ్ సింగ్‌లు ఉన్నారు. విశాఖపట్నం వేదికగా బుధవారం జరగనున్న రెండో వన్డేలో టీమిండియా ఒత్తిడితో బరిలోకి దిగనుంది.

సిరిస్‌లో ఉండాలంటే
సిరిస్‌లో ఉండాలంటే టీమిండియా ఈ మ్యాచ్‌లో తప్పక నెగ్గాలి. ఈ నేపథ్యంలో విశాఖ వన్డేలో విజయం సాధించి సిరీస్‌పై ఆశలు నిలబెట్టుకోవాలని టీమిండియా భావిస్తుండగా.. ఈ మ్యాచ్‌లో నెగ్గి సిరీస్ కైవసం చేసుకోవాలనే పట్టుదలతో వెస్టిండిస్ ఉంది. విశాఖపట్నంలో టీమిండియా ఇప్పటివరకు ఆడిన తొమ్మిది వన్డేల్లో ఆరింట విజయం సాధించి ఒక దాంట్లో ఓడింది.

5 మ్యాచ్‌ల్లో 556 పరుగులు
ఆ ఓటమి కూడా వెస్టిండిస్ చేతిలోనే కావడం విశేషం. ఒక మ్యాచ్ టై కాగా మరొకటి వర్షం కారణంగా రద్దు అయింది. ఇక్కడ చివరగా ఈ స్టేడియంలో జరిగిన వన్డే మ్యాచ్ టైగా ముగిసింది. మరోవైపు విశాఖ స్టేడియంలో కోహ్లీకి మెరుగైన రికార్డుని కలిగి ఉన్నాడు. ఇక్కడ కోహ్లీ ఆడిన 5 మ్యాచ్‌ల్లో 556 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

టీమిండియా తరుపున అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్లు వీరే:
* సచిన్ టెండూల్కర్- 664 (ఇండియా)
* ఎంఎస్ ధోని- 538 (ఇండియా / ఆసియా)
* రాహుల్ ద్రవిడ్- 509 (ఇండియా / ఆసియా / ఐసిసి)
* మహ్మద్ అజారుద్దీన్- 433 (ఇండియా)
* సౌరవ్ గంగూలీ- 424 (ఇండియా / ఆసియా)
* అనిల్ కుంబ్లే- 403 (ఇండియా / ఆసియా)
* యువరాజ్ సింగ్- 402 (ఇండియా / ఆసియా)
* విరాట్ కోహ్లీ- 400 * (ఇండియా)
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications