న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వరుసగా 3 సెంచరీలు: జనవరి 15 అంటే కోహ్లీ కెరీర్‌లో ఎంతో ప్రత్యేకం!

Virat Kohlis tryst with January 15: A hundred in 2017, 2018 and 2019

హైదరాబాద్: విరాట్ కోహ్లీ.... మోడ్రన్ డే క్రికెట్ దిగ్గజాల్లో ఒకడు. అభిమానులు ముద్దుగా రన్ మెషిన్ అని పిలుచుకుంటారు. కోహ్లీ ఏంటో అతడి రికార్డులే చెబుతాయి. అడిలైడ్‌ వేదికగా మంగళవారం(జనవరి 15) జరిగిన రెండో వన్డేలోనూ కోహ్లీ అద్భుత సెంచరీతో రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

<strong>ఖవాజా రనౌట్: ఒంటి చేత్తో స్టంప్స్‌ని గిరాటేసిన జడేజా (వీడియో)</strong>ఖవాజా రనౌట్: ఒంటి చేత్తో స్టంప్స్‌ని గిరాటేసిన జడేజా (వీడియో)

ఈ ఏడాది కోహ్లీకి ఇది తొలి సెంచరీ. మొత్తంగా వన్డేల్లో 39వ సెంచరీ. అయితే కోహ్లీ కెరీర్‌లో ఈ 'జనవరి 15' తేదీ ఎంతో ప్రత్యేకంగా నిలుస్తూ వస్తోంది. ఎందుకంటే.. 2017, 2018లో కోహ్లీ అదే రోజున తన తొలి సెంచరీని నమోదు చేయడం విశేషం.

2017 జనవరి 15న

2017 జనవరి 15న

2017 జనవరి 15న భారత్‌-ఇంగ్లాండ్‌ మధ్య పుణె వేదికగా వన్డే మ్యాచ్‌ జరిగింది. ఆ మ్యాచ్‌లో కోహ్లీ 105 బంతుల్లో 122 పరుగులు చేసి వన్డే కెరీర్‌లో 27వ సెంచరీని నమోదుచేశాడు. అంతేగాక, ఆ ఏడాది కోహ్లీకి అదే తొలి సెంచరీ. ఆ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై టీమిండియా 3 వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించింది.

2018 జనవరి 13-17 తేదీల్లో

2018 జనవరి 13-17 తేదీల్లో

2018 జనవరి 13-17 తేదీల్లో సెంచూరియన్‌ వేదికగా భారత్‌, దక్షిణాఫ్రికా టెస్టు సిరీస్‌లో భాగంగా రెండో టెస్టు మ్యాచ్‌ జరిగింది. రెండో టెస్టు మూడో రోజైన జనవరి 15న కోహ్లీ సెంచరీ సాధించాడు. ఆ ఇన్నింగ్స్‌లో కోహ్లీ 153 పరుగులు చేశాడు. 2018లో కోహ్లీ ఇదే తొలి సెంచరీ. అయితే, ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓటమిపాలైంది.

రెండో వన్డేలో

తాజాగా 2019 జనవరి 15న(మంగళవారం) అడిలైడ్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో కోహ్లీ 104 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా సమిష్టి ప్రదర్శన చేసింది. రెండో వన్డేలో కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి సెంచరీతో చెలరేగడంతో భారత్‌ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. చివరి ఓవర్‌ వరకు ఉత్కంఠకరంగా సాగిన ఈ మ్యాచ్‌లో ధోని ఫినిషింగ్‌ టచ్‌తో విజయం భారత్‌నే వరించింది.

తన తొలి సెంచరీని జనవరి 15నే

ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేయడంలో భారత బౌలర్లు తడబడినా, పరుగులు రాబట్టడంలో బ్యాట్స్‌మెన్‌ చివరి వరకూ పోరాడి విజయం సాధించారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్లలో షాన్‌ మార్ష్‌ (131; 123 బంతులు,11ఫోర్లు, 3 సిక్స్‌లు) సెంచరీ, మాక్స్‌వెల్‌(48)లు చెలరేగడంతో నిర్ణీత 50 ఓవర్లకు 9 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. ఇలా గత మూడేళ్లుగా కోహ్లీ ఏడాదిలో తన తొలి సెంచరీని జనవరి 15నే సాధించడంతో ఈ రోజు ప్రత్యేకంగా నిలుస్తోంది.

Story first published: Wednesday, January 16, 2019, 15:06 [IST]
Other articles published on Jan 16, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X