న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కౌంటీల్లో కోహ్లీ ఆడాలని అనుకోకపోవడం వల్లనే.. ??

Virat Kohlis Surrey saga: 20 (confusing) questions

హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి కౌంటీల్లో ఆడటంపై కొన్ని వారాల పాటు చర్చ నడిచింది. ఎట్టకేలకు కోహ్లీ ఆరోగ్యం సరిపడలేదని వైద్యులు చెప్పడంతో కౌంటీలు మానేయాల్సి వచ్చింది. ముందు హెర్నియేటెడ్ డిస్క్ అని తర్వాత మెడ నొప్పి కూడా రావడంతో వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ఈ నేపథ్యంలో కోహ్లీ ఫిట్‌నెస్ ఛాలెంజ్ వీడియోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతుండగా కోహ్లీకి విశ్రాంతి కావాల్సిందే.

 ఇంగ్లాండ్ గడ్డ మీద సత్తా చాటాలనే కసితో:

ఇంగ్లాండ్ గడ్డ మీద సత్తా చాటాలనే కసితో:

కౌంటీల్లో ఆడడంపై ముందుగా చర్చించిన బోర్డు.. జూన్ నెల మొత్తం సర్రే తరఫున ఆడతాడని.. ఈసారి ఎలాగైనా ఇంగ్లాండ్ గడ్డ మీద సత్తా చాటాలనే కసితో ఉన్నాడని ఊదరగొట్టారు. కానీ మెడ గాయం కారణంగా అనూహ్య రీతిలో కౌంటీలకు దూరమయ్యాడు. కోహ్లీ సర్రే తరఫున ఆడటం గురించి గతంలోనే అనేక ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. అవేంటంటే..

ఇంగ్లాండ్ టూర్‌కు ముందు సన్నద్ధత:

ఇంగ్లాండ్ టూర్‌కు ముందు సన్నద్ధత:

కోహ్లి జూన్ మొత్తం సర్రే తరఫున ఆడతాడని చెప్పారు. ఇంగ్లాండ్ టూర్‌కు ముందు సన్నద్ధతకు ఉపకరిస్తుందని చెప్పారు. ఎన్ని మ్యాచ్‌లంటే.. స్పష్టత లేదు. ఓసారి మూడు ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు, మూడు వన్డేలు ఆడొచ్చన్నారు. తర్వాత మూడు ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు, ఐదు వన్డేలన్నారు.

3 మ్యాచ్‌లు ఆడతాడా? అంటే.. లేదు 2 మ్యాచ్‌లే:

3 మ్యాచ్‌లు ఆడతాడా? అంటే.. లేదు 2 మ్యాచ్‌లే:

ఐర్లాండ్‌తో జూన్ చివర్లో జరిగే టీ20లకు కోహ్లినే కెప్టెన్ అన్నారు. అప్పుడు సర్రేతో మూడు మ్యాచ్‌లు ఆడతాడా అంటే లేదు రెండు మ్యాచ్‌లే అని మాట మార్చారు. పోనీ ఐర్లాండ్‌తో జరిగేవి రెండు టీ20లా అంటే కాదు ఒకటేనన్నారు.

చివరకు సర్రేతో కౌంటీలకు దూరమై:

చివరకు సర్రేతో కౌంటీలకు దూరమై:

చివరకు సర్రేతో కౌంటీలకు దూరమయ్యాడు. అందు కోసం ముందుగా చెప్పిన కారణం హెర్నియేటెడ్ డిస్క్. తర్వాత మెడ నొప్పి అని, సన్‌రైజర్స్‌తో మ్యాచ్ సందర్భంగా గాయపడ్డాడని చెప్పారు. కోహ్లికి గాయమైన సంగతి గురువారం ఉదయం వరకు సర్రేకి సమాచారం అందించలేదు. సర్రే తరఫున ఆడటం లేదు కాబట్టి అప్ఘాన్‌తో టెస్టు మ్యాచ్ ఆడతాడా అంటే లేదని చెబుతున్నారు. ఈ ఒక్క విషయంలోనే కాసింత క్లారిటీ ఉంది. ఐర్లాండ్‌తో టీ20 మ్యాచ్ ఆడే అవకాశం ఉందని మాత్రమే చెప్పారు.

కౌంటీల్లో కోహ్లీ ఆడతాడని తొలి నాళ్ల నుంచి తలెత్తుతున్న ప్రశ్నలు ఇవే:


* సర్రే క్రికెట్‌ను కోహ్లీ జూన్ నెల మొత్తం ఆడనున్నాడా?

అవును


* ఇంగ్లాండ్ పర్యటనకు గురించి పూర్తిగా ప్రిపేర్ అయ్యారా?

అవును


* అయితే అవి ఆరు మ్యాచ్‌లా (3 ఫస్ట్ క్లాస్‌లు+3 వన్డేలు)

చెప్పలేం


* చెప్పలేమంటే దానికర్షం?

ఒకవేళ 8 (3 ఫస్ట్ క్లాస్‌లు+5 వన్డేలు) కూడా కావచ్చు.


* అలా అయితే అఫ్గనిస్తాన్ వర్సెస్ భారత్ చారిత్రాత్మక టెస్టు ఉండదా?

కాదు


* ఐర్లాండ్ టీ 20కు కోహ్లీ కెప్టెన్సీ వహిస్తాడా?

అవును


* అయితే సర్రేలో 3 మ్యాచ్‌లకు వహిస్తాడా?

కాదు


* పోనీ, రెండు మ్యాచ్‌లా?

అవును


* మరి, ఐర్లాండ్‌లో జరిగే రెండు ఫార్మాట్‌లకు కెప్టెన్సీ?

లేదు. రెండింటిలో ఒకటే.


* ఎందుకు?

జూనె 27న రెండింటి వేదికలు వేర్వేరుగా జరుగుతాయి కాబట్టి.


* కనీసం సర్రేతో ఒక్క మ్యాచ్ అయినా?

ఆడడు.


* ఎందుకు హెర్నియాటెడ్ డిస్క్?

కాదు.


* అది కాకపోతే.. మరింకేంటి??

మెడ నొప్పి, ఆర్‌సీబీ జట్టులో ఆడిన మ్యాచ్ గాయం కారణంగా..


* మరి చివరి గేమ్ ఆడాడు. కదా?

అవును.


* ఈ గాయం గురించి సర్రేకు తెలుసా?

గురువారం ఉదయం తర్వాత తెలిసింది.


* అయితే అఫ్గనిస్థాన్‌తో మ్యాచ్ ఆడుతున్నాడా?

ఆడడు.


* మరి ఐర్లాండ్‌తో టీ 20?

చెప్పలేం.


* త్వరలోనే ట్రైనింగ్‌లో పాల్గొంటాడా?

లేదు. అతను ప్రస్తుతం జూన్ 15 నుంచి జాతీయ క్రికెట్ అకాడమీలో ఉన్నాడు.


Story first published: Friday, May 25, 2018, 16:31 [IST]
Other articles published on May 25, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X