న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ధోనీ- కోహ్లీ సిక్సర్లు: ఎన్నిసార్లు చూసినా తనివి తీరవు..!!

 Virat Kohlis sixes will be watched as many times as MS Dhonis World Cup winning six: Kapil Dev

మెల్‌‌బోర్న్: టీ20 ప్రపంచకప్ 2022 టోర్నమెంట్‌లో భారత్.. తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌పై చిరస్మరణీయమైన విజయాన్ని అందుకుంది. టీమిండియా మాజీ కేప్టెన్, బ్యాటింగ్ బ్యాక్‌బోన్ విరాట్ కోహ్లీ- ఈ మ్యాచ్‌లో విశ్వరూపాన్ని చూపాడు. ఓటమి కోరల్లో ఉన్న జట్టును గెలుపుబాట పట్టించాడు. 31 పరుగులకే నాలుగు వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడిన జట్టుకు ఒంటిచేత్తో గెలుపుబాట పట్టించాడు. 53 బంతుల్లో ఆరు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 82 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

కోహ్లీ విజృంభణ ముందు..

కోహ్లీ విజృంభణ ముందు..

పాకిస్తాన్‌పై భారత్ గెలవాలంటే చివరి 12 బంతుల్లో 31 పరుగులు చేయాల్సిన దశ అది. విరాట్ కోహ్లీ, ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా క్రీజ్‌లో ఉండటం వల్ల విజయం భారత్‌నే వరిస్తుందనే ఆశ అభిమానుల్లో నెలకొంది. 19వ ఓవర్‌లో గేర్ మారిస్తే గానీ విజయం దక్కదనే విషయం వారిద్దరికీ తెలుసు. స్టార్ బౌలర్ హ్యారిస్ రవూఫ్ సంధించిన ఓవర్ అది. పైగా ఆ ఓవర్ తొలి నాలుగు బంతుల్లో వచ్చింది మూడు పరుగులే. ఆ తరువాత కోహ్లీ విజృంభించాడు. చివరి రెండు బంతులను సిక్సర్లుగా మలిచాడు. దీనితో ఈక్వేషన్స్ మారిపోయాయి.

మెరుపు వేగంతో

మెరుపు వేగంతో

ఆ ఓవర్ చివరి రెండు బంతులను సిక్సర్లుగా మలిచాడు. ఎవ్వరూ ఊహించని విధంగా మెరుపువేగంతో ఆ రెండు బంతులను ఫెన్సింగ్ దాటించాడు. 19వ ఓవర్‌లో 17 పరుగులు రావడంతో ఈక్వేషన్లు మారిపోయాయి. చివరి ఆరు బంతుల్లో 16 పరుగులు అవసరం అయ్యాయి టీమిండియాకు. దాన్ని లాంఛనంగా ముగించాడు కోహ్లీ. రవిచంద్రన్ అశ్విన్ విన్నింగ్ షాట్ కొట్టిన తరువాత- ఇక మెల్‌బోర్న్ స్టేడియం మొత్తం రచ్చరచ్చగా మారింది.

 కపిల్ దేవ్ ప్రశంసలు..

కపిల్ దేవ్ ప్రశంసలు..

చిట్టచివరి బంతి వరకూ ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించడం పట్ల మాజీ ఆల్‌రౌండర్ కపిల్ దేవ్ స్పందించారు. కొన్ని సంవత్సరాల పాటు ఈ మ్యాచ్ భారత ప్రేక్షకులకు గుర్తుండిపోతుందని వ్యాఖ్యానించారు. ఈ రెండు జట్లు ఎప్పుడు తలపడినా భావోద్వేగాలు పతాక స్థాయికి చేరుకుంటుంటాయని, మెల్‌బోర్న్ మ్యాచ్ కూడా దీనికి మినహాయింపు కాదని, పైగా టీమిండియా గెలిచిన విధానం మరింత ఎమోషన్స్‌కు గురి చేసిందని పేర్కొన్నారు.

కోహ్లీ ఒక్కడికే సాధ్యం..

కోహ్లీ ఒక్కడికే సాధ్యం..

పాకిస్తాన్‌పై విరాట్ కోహ్లీ ఆడిన విధానానికి తాను హ్యాట్సాఫ్ చెప్పకుండా ఉండలేకపోతున్నానని కపిల్ దేవ్ పేర్కొన్నారు. విరాట్ కోహ్లీ మాత్రమే ఈ మ్యాచ్‌ను గెలిపించగలడని భావించానని, అతను క్రీజ్‌లో ఉన్నంత సేపూ జట్టు విజయం సాధిస్తుందనే తాను ఆశించానని స్పష్టం చేశారు. తన నమ్మకం వమ్ము కాలేదని, జట్టును విజయ తీరాలకు చేర్చాడని అన్నారు.

 ఆ రెండు సిక్సర్లు..

ఆ రెండు సిక్సర్లు..

పాకిస్తాన్ స్టార్ బౌలర్ హ్యారిస్ రవూఫ్ బౌలింగ్‌లో విరాట్ కోహ్లీ బాదిన రెండు సిక్సర్లను కపిల్ దేవ్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ రెండింటినీ ఆయన 2011లో ప్రపంచకప్ ఫైనల్‌లో శ్రీలంకపై అప్పటి జట్టు సారథి మహేంద్ర సింగ్ ధోనీ కొట్టిన విన్నింగ్ సిక్సర్‌తో కంపేర్ చేశారు. దేశాన్ని ఛాంపియన్‌గా నిలబెట్టిన ఆ సిక్స్‌ను ఎన్నిసార్లు చూసినా తనివి తీరదని, కోహ్లీ తాజాగా హ్యారిస్ రవూఫ్ బౌలింగ్‌లో బాదినవి కూడా అలాంటివేనని పేర్కొన్నారు. ఆ షాట్లను ఎన్నిసార్లయినా చూడొచ్చని వ్యాఖ్యానించారు.

Story first published: Tuesday, October 25, 2022, 11:23 [IST]
Other articles published on Oct 25, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X