న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఎక్కువ మంది వీక్షించిన బీసీసీఐ వీడియోలివే

Virat Kohlis short-arm jab to his race with Jadeja - Indian crickets most viewed videos of 2018

హైదరాబాద్: సంవత్సరాంతం జరిగిన మ్యాచ్‌లలో హైలెట్‌గా నిలిచిన వీడియోలను బీసీసీఐ ట్వీట్ చేసి టీమిండియా క్రికెట్ అభిమానులకు సరికొత్త విధంగా శుభాకాంక్షలు తెలిపింది. స్వదేశంతో పాటు విదేశాల్లోనూ తన సత్తా చాటి శభాష్ అనిపించుకున్నాడు. ఇంత ప్రత్యేకంగా నిలిచిన 2018వ సంవత్సరం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లికి 2018 ఎప్పటికీ గుర్తుండి పోతుంది. విదేశాల్లోనూ పరుగులు రాబట్టిన కోహ్లి తనేంటో నిరూపించుకున్నాడు. దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాల్లో ఒకే క్యాలెండర్ ఇయర్లో టెస్టు విజయాలు సాధించిన తొలి భారత కెప్టెన్‌గా విరాట్ రికార్డు క్రియేట్ చేశాడు. ఇంగ్లాండ్‌పై కోహ్లి ఆడిన షార్ట్ ఆర్మ్ షాట్.. ఈ ఏడాది అత్యుత్తమ షాట్లలో ఒకటిగా నిలిచింది.

వోక్స్ బౌలింగ్‌లో కోహ్లి సిక్స్‌గా మలిచిన షాట్

టీమిండియాకు సంబంధించి 2018లో ఎక్కువ మంది ట్విట్టర్లో చూసిన వీడియోలను బీసీసీఐ విడుదల చేసింది. గంటకు 121 కి.మీ. వేగంతో విసిరిన బంతి తన వైపు దూసుకొస్తుండగా.. చేతిని ఎక్కువ దూరం కదిలించే వీల్లేని పరిస్థితుల్లో మిడాన్ మీదుగా కోహ్లి కొట్టిన సిక్స్ హైలెట్‌గా నిలిచింది. కోహ్లి స్థానంలో ఎవరున్నా.. ఆ బంతిని పుల్ చేయడమో లేదా డిఫెండ్ చేయడమో చేస్తారు. కానీ కోహ్లి మాత్రం దాన్ని సిక్స్‌గా మలిచాడు. తర్వాత అండర్-19 వరల్డ్ కప్‌లో జింబాబ్వేపై శుభ్‌మన్ గిల్ అదే తరహా షాట్ ఆడి ఆకట్టుకున్నాడు. ఈ వీడియోను బీసీసీఐ మళ్లీ షేర్ చేసింది.

కోహ్లి, జడేజా పరిగెడుతున్న వీడియోను కూడా

విండీస్‌తో జరిగిన సిరీస్‌లో బంతిని అందుకోవడం కోసం కోహ్లి, జడేజా పరిగెడుతున్న వీడియోను కూడా బీసీసీఐ పోస్టు చేసింది. పాల్ హేమరాజ్ ఆడిన బంతి బౌండరీ లైన్ వైపు దూసుకెళ్తుండగా.. కోహ్లి, జడేజా ఒకరితో మరొకరు పోటీపడి పరిగెత్తుకుంటూ వెళ్లి బంతిని ఆపారు. అత్యధిక మంది వీక్షించిన వీడియోల్లో ఇది ఒకటి.

అన్ని ఫార్మాట్లలో కలిపి 11 సెంచరీల వరకూ

అన్ని ఫార్మాట్లలో కలిపి 11 సెంచరీల వరకూ

కోహ్లీ 2018 సంవత్సరంలో 2, 735 పరుగులు చేసి అన్ని ఫార్మాట్లలో కలిపి 11 సెంచరీల వరకూ చేశాడు. కానీ, గిల్ ఏడు ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు మూడు హాఫ్ సెంచరీలు.. ఐదు సెంచరీల సాయంతో 897 పరుగులు చేయగలిగాడు.

Story first published: Tuesday, January 1, 2019, 10:24 [IST]
Other articles published on Jan 1, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X