న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'కోహ్లీ ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాడు.. అతడు లేకుంటే టీమిండియా బలహీనపడుతుంది'

India vs Bangladesh: Kohli's Absence Opportunity For Others To Stand Up - Dean Jones
Virat Kohlis Absence Opportunity For Others to Stand Up says Dean Jones

హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రపంచంలోనే అత్యుత్త ఆటగాడు. కోహ్లీ లేకపోతే ఏ ఫార్మాట్లోనైనా టీమిండియా కాస్త బలహీనపడుతుంది అని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ డీన్‌ జోన్స్‌ అభిప్రాయపడ్డారు. జట్టులోని ఇతర ఆటగాళ్లు సత్తా చాటేందుకు అతడి గైర్హాజరీ ఓ మంచి అవకాశం అని అన్నారు. స్టార్‌ ఆల్‌రౌండర్‌ షకిబ్‌ అల్‌ హసన్‌ లేకపోవడం బంగ్లాదేశ్‌ జట్టుకు తీరని లోటని ఆయన పేర్కొన్నారు.

India vs Bangladesh: 1000వ టీ20.. చరిత్రలో భారత్‌, బంగ్లా!!India vs Bangladesh: 1000వ టీ20.. చరిత్రలో భారత్‌, బంగ్లా!!

తాజాగా డీన్‌ జోన్స్‌ మీడియాతో మాట్లాడుతూ... 'కోహ్లీ ప్రపంచంలోనే అత్యుత్త ఆటగాడు. అతడు లేకపోతే ఏ ఫార్మాట్లోనైనా టీమిండియా కాస్త బలహీనపడుతుంది. ఇది వాస్తవం. అయితే కోహ్లీ గైర్హాజరీ జట్టులోని ఇతరులు సత్తా చాటేందుకు ఓ మంచి అవకాశం. ఒకవేళ కోహ్లీ గాయపడ్డాడు లేదా ప్రపంచకప్‌లో ఓ మ్యాచ్‌ ఆడలేడు అనుకుందాం. అప్పుడు ఎవరు బాధ్యతలు తీసుకుంటారు?. రాజస్థాన్‌, బెంగళూరు మ్యాచ్‌ను ఆరు ఓవర్లకు కుదించారని అనుకుందాం. అప్పుడు మైదానంలోకి వెళ్లేందుకు జట్లకు ఎలాంటి వైఖరి అవసరమో తెలిసేదెలా?' అని ప్రశ్నించారు.

రోహిత్‌ శర్మ జట్టు పగ్గాలు చేపట్టడం సంతోషం. రోహిత్ నాలుగు ఐపీఎల్‌ ట్రోఫీలు తన జట్టుకు అందించాడు. జట్టును నడిపించడం ఎలాగో తెలుసు. కేఎల్‌ రాహుల్‌ మూడో స్థానంలో బ్యాటింగ్‌ చేస్తాడో లేదో చూడాలి. రిషబ్ పంత్‌ను నాలుగులోఆడిస్తే..సెలక్టర్లు రెండు మూడు సిరీస్‌ల వరకు దానినే కొనసాగించాలి. అప్పుడే జట్టులో తమ పాత్రేంటో ఆటగాళ్లకు అర్థమవుతుంది. తొలి స్థానంలో సరైన ఆటగాడిని ఎంచుకోవడమే అసలైన సవాల్' అని జోన్స్‌ పేర్కొన్నారు.

'షకిబ్‌ దూరమవడం బంగ్లాదేశ్‌కు పెద్ద లోటు. కెప్టెన్ లేనప్పుడు నిర్భయంగా ముందుకెళ్లడమో చేయాలి. ఇలాంటి పరిస్థితులలో శుభారంభాలు అవసరం. బంగ్లాదేశ్‌ చరిత్రలోనే షకిబ్‌ అతిపెద్ద స్టార్‌ ఆటగాడు. అతడు లేని లోటు పూడ్చలేనిది. షకిబ్‌ బౌలింగ్‌ కన్నా బ్యాటింగ్‌ జట్టుకు ఎంతో అవసరం. కొత్త కోచింగ్‌ బృందం ప్రణాళికలు ఎలా ఉంటాయో చూడాలి. కొన్ని మంచి వ్యూహాలు ఉంటాయనే అనుకుంటున్నా. నమ్మకమే ముఖ్యం. కొత్త కెప్టెన్ జట్టును ముందుండి నడిపించాలి. అత్యుత్తమ జట్టు టీమిండియాపై బంగ్లా గెలవాలంటే శ్రమించాలి' అని జోన్స్‌ అన్నారు.

Story first published: Sunday, November 3, 2019, 16:41 [IST]
Other articles published on Nov 3, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X