అనుష్కను కోహ్లీ ముద్దుగా ఏమని పిలుస్తాడో తెలుసా? (వీడియో)

Posted By:

హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీ తన ప్రేయసి, బాలీవుడ్‌ నటి అనుష్క శర్మల లవ్ స్టోరీ గురించి తెలిసిందే. క్రికెట్, బాలీవుడ్ కలయిక కావడంతో వీళ్లకు సంబంధించిన ఏ చిన్న న్యూస్ అయినా మీడియాకు పండగే. తాజాగా జీ టీవీ కోసం కోహ్లీ, ఆమిర్‌ ఖాన్ కలిసి చేసిన ఓ చాట్ షోకు సంబంధించిన టీజర్ ట్విట్టర్‌లో హల్‌చల్ చేస్తోంది.

ఈ టీజర్‌ని జీ టీవీ తన ట్విట్టర్ ఖాతాలో అభిమానులతో పంచుకుంది. ఈ టీజర్‌లో విరాట్ కోహ్లీ... అమీర్ ఖాన్‌తో డ్యాన్స్ చేయడాన్ని మనం చూడొచ్చు. అంతేకాదు ఈ చాట్ షోలో అనుష్కను తాను ఏమని పిలుస్తాడో కూడా విరాట్ కోహ్లీ చెప్పాడు. నుష్కీ చాలా నిజాయతీ కలిగిన వ్యక్తి అంటూ అనుష్కను తాను ఏమని పిలుస్తాడో కోహ్లీ చెప్పకనే చెప్పాడు.

ఈ చాట్ షో వచ్చే ఆదివారం జీటీవీలో ప్రసారం కానుంది. ఈ చాట్ షో ముంబై ఫిల్మ్ సిటీలోని ఓ స్టూడియోలో చిత్రీకరించారు. ఈ ఇంటర్యూలో విరాట్ కోహ్లీ ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకున్నాడు. చాట్ షోలో భాగంగా అమీర్ ఖాన్.. కెప్టెన్ కోహ్లీని కొన్ని ప్రశ్నలు అడిగాడు. ముఖ్యంగా బాలీవుడ్ నటి అనుష్క శర్మలో మీకు నచ్చేవి.. నచ్చని అంశాలు ఏమిటి అని అడిగాడు.

ఇందుకు కోహ్లీ 'తన నిజాయతీ, జాగ్రత్తగా చూసుకునే స్వభావం ఎంతో నచ్చుతాయి. ఇక నచ్చనిది అంటే సమయపాలన. ఎప్పుడూ చెప్పిన టైంకి రాదు. 5-7 నిమిషాల పాటు లేట్‌గా వస్తుంది. కొంచమే కాబట్టి ఎప్పుడూ పెద్దగా ఇబ్బంది అనిపించలేదు' అని కోహ్లీ అన్నాడు.

ఆ తర్వాత 'చీకూ' అనే ముద్దుపేరు ఎలా వచ్చిందని ఆమిర్‌ అడిగాడు. ఇందుకు కోహ్లీ 'అండర్‌-17 క్రికెట్‌ ఆడే సమయంలో నా చెవులు చాలా పెద్దగా కనిపించేవి. పొడవాటి జట్టుతో వాటిని కప్పి ఉంచేవాడిని. నా హెయిర్‌ స్టైల్‌ చూసి మిగతా ఆటగాళ్లు 'చీకూ రాబిట్‌' అంటూ పిలవడం మొదలుపెట్టారు. ఆ తర్వాత ధోని కూడా అలాగే పిలవడం ప్రారంభించాడు. ఒకసారి స్టంప్స్‌ వెనుక ఉన్న ధోని నన్ను చీకూ అని పిలవడం మైక్‌లో రికార్డయ్యింది. అలా ఆ పేరు ప్రచారంలోకి వచ్చింది' అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.

Story first published: Friday, October 13, 2017, 13:35 [IST]
Other articles published on Oct 13, 2017
Please Wait while comments are loading...
POLLS