For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2026: ధోనీ 10 బంతుల్లో 30 పరుగులు చేయలేడు: కైఫ్

ఐపీఎల్ 2026 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్‌కే) మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడించడం సరికాదని మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ అన్నాడు. ఇంపాక్ట్ ప్లేయర్‌గా ధోనీని కేవలం బ్యాటింగ్‌కు పరిమితం చేయడం అర్థరహితమన్నాడు. ధోనీ ఒకప్పటిలా 10 బంతుల్లో 30 పరుగులు చేయలేడని స్పష్టం చేశాడు.

సంజూ శాంసన్ ఉన్నప్పటికీ ధోనీని వికెట్ కీపర్‌గా ఉపయోగించుకోవాలని సూచించాడు. వికెట్ల వెనుక ఉండి బౌలర్లను గైడ్ చేయడం, ఫీల్డ్ సెట్ చేయడం వంటి పనుల్లో ధోనీకి ఎవరూ సాటి లేరని, అదే జట్టుకు అతిపెద్ద బలం అని కైఫ్ అభిప్రాయపడ్డాడు.

ఇంపాక్ట్ ప్లేయర్‌గా వద్దు..

తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా ఐపీఎల్ 2026 సీజన్‌లో ధోనీ పాత్ర గురించి మాట్లాడిన కైఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'ధోనీని ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడించాలనే వాదనకు నేను వ్యతిరేకం. అలా చేయడం వల్ల జట్టుకు పెద్ద ప్రయోజనం ఉండదు. . ధోనీ 8వ స్థానంలో బ్యాటింగ్‌కు వస్తాడు. కేవలం 6 నుంచి 12 బంతులు ఆడేందుకు ధోనీని ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడించడం సరికాదు.

Don t Expect 30 Runs off 10 Balls Mohammad Kaif s Reality Check for MS Dhoni Ahead of IPL 2026

అతను ఇప్పటికే 20 ఓవర్ల పాటు వికెట్ కీపింగ్ చేస్తున్నాడు. 20 ఓవర్ల పాటు వికెట్ల వెనుక ఉండి బౌలర్లను గైడ్ చేయడం, ఫీల్డ్ సెట్ చేయడం వంటి పనుల్లో ధోనీకి ఎవరూ సాటి లేరు. ముఖ్యంగా రుతురాజ్ గైక్వాడ్‌కు ధోనీ అండగా ఉంటాడు. ఒత్తిడిలో ఉన్నప్పుడు గైక్వాడ్‌కు మద్దతుగా నిర్ణయాలు తీసుకుంటాడు. కెప్టెన్‌గా గైక్వాడ్ రాణిస్తున్నా.. ధోనీ ఉన్నంత కాలం నిర్ణయాలన్ని అతనే తీసుకుంటాడు. సంజూ శాంసన్ జట్టులోకి వచ్చినప్పటికీ ధోనీ ఉన్నంత వరకు అతనితోనే వికెట్ కీపింగ్ చేయించాలి. సంజూను ఒక ఫీల్డర్‌గా వాడుకుంటూ.. ధోనీ వారుసుడిగా సిద్దం చేయాలి.

10 బంతుల్లో 30 పరుగులు చేయలేడు..

అయితే ఐపీఎల్ మినహా ధోనీ మరే టోర్నీ ఆడటం లేదు. ధోనీని కేవలం ఇంపాక్ట్ ప్లేయర్‌గా బ్యాటింగ్‌కు మాత్రమే పరిమితం చేయడం సరికాదు. ఎందుకంటే ధోనీ ఏడాది పొడవునా క్రికెట్ ఆడడు.గతంలోలా 10 బంతుల్లో 30 పరుగులు చేయలేడు. ఒకవేళ చేసినా.. ప్రతీ మ్యాచ్‌లో రాణించడం కష్టం. గతేడాది తరహాలో ఒకటి, రెండు మ్యాచ్‌ల్లో మెరుపులు మెరిపించవచ్చు. కానీ నిలకడగా మాత్రం పరుగులు చేయలేడు.

ధోనీకి ఇదే చివరి సీజన్ కావచ్చు. అయితే ప్రతీ ఏడాది ఈ మాట వింటూనే ఉన్నాం. కానీ ఈ ఏడాది అతను ఆటకు వీడ్కోలు పలికే అవకాశం ఉంది. అయితే ఈ విషయాన్ని కచ్చితంగా చెప్పలేం. ఎందుకంటే ధోనీ తన ప్రణాళికలను అస్సలు బయటపెట్టడు. ఆఖరి వరకు వేచిచూస్తాడు. ధోనీ ప్రణాళిక తమకు తెలియదని సీఎస్‌కే సీఈఓ విశ్వనాథన్ కూడా చాలా సార్లు చెప్పారు. అతను ఆడుతాడా? లేదా ఆటలో కొనసాగుతాడా? అనేది ధోనీకి మాత్రమే తెలుసు.'అని కైఫ్ అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్ 2025 సీజన్‌లో ధోనీ మొత్తం 14 మ్యాచ్‌లు ఆడి 135.17 స్ట్రైక్‌రేట్‌తో 196 పరుగులు చేశాడు.ఓవరాల్‌గా ఇప్పటి వరకు 278 మ్యాచ్‌లు ఆడి 24 హాఫ్ సెంచరీలతో 38.30 సగటు, 137.45 స్ట్రైక్‌రేట్‌తో 5439 పరుగులు చేశాడు.

Story first published: Thursday, March 19, 2026, 16:54 [IST]
Other articles published on Mar 19, 2026
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+