ఐపీఎల్ 2026 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) తొలి మ్యాచే ఆడనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)తో మార్చి 28న చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగే సీజన్ ఫస్ట్ మ్యాచ్‌తో తమ క్యాంపైన్‌ను ప్రారంభించనుంది.అయితే ఈ సీజన్‌లోని ఆరంభ మ్యాచ్‌లకు సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ దూరమయ్యాడు. మోకాలి గాయంతో బాధపడుతున్న అతను పూర్తి కోలుకోవడానికి మరింత సమయం పట్టనుంది.
దాంతో ఇషాన్ కిషన్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ మేనేజ్‌మెంట్ తాత్కలిక సారథిగా నియమించింది. డేంజరస్ ఓపెనర్ అభిషేక్ శర్మకు వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. కమిన్స్ అందుబాటులోకి వచ్చే వరకు ఇషాన్ కిషన్ సారథిగా జట్టును నడిపించనున్నాడు. కమిన్స్ గైర్హాజరీ నేపథ్యంలో టీమిండియా కాంబినేషన్ ఎలా ఉండబోతుందనేది తీవ్ర చర్చనీయాంశమైంది.

ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఓపెనర్లుగా బరిలోకి దిగనుండగా.. ఇషాన్ కిషన్, హెన్రీచ్ క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి మిడిలార్డర్‌లో ఆడనున్నారు. కమిన్స్ గైర్హాజరీతో లియామ్ లివింగ్‌స్టోన్‌కు మార్గం సుగుమమైంది. అనికేత్ వర్మతో కలిసి అతను ఫినిషర్ పాత్ర పోషించనున్నాడు. బ్రైడన్ కార్స్, హర్షల్ పటేల్ బౌలింగ్ ఆల్‌రౌండర్లు బరిలోకి దిగనున్నారు. జయదేవ్ ఉనాద్కత్, ప్రఫుల్ హింగేలు ఒకరు పేస్ బాధ్యతలు పంచుకోనున్నారు.
ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (కెప్టెన్), హెన్రీచ్ క్లాసెన్ (కీపర్), లియామ్ లివింగ్‌స్టన్, నితీశ్ కుమార్ రెడ్డి, అనికేత్ వర్మ, బ్రైడన్ కార్స్, హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కత్/ప్రఫుల్ హింగే, జీషన్ అన్సారీ/క్రెయిన్స్ ఫులెట్రా.
ఇంపాక్ట్ సబ్: అనికేత్ వర్మ/సలీల్ అరోరా
మార్చి 28: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs సన్‌రైజర్స్ హైదరాబాద్ (రాత్రి 7:30, బెంగళూరు)
ఏప్రిల్ 02: కోల్‌కతా నైట్ రైడర్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్ (రాత్రి 7:30, కోల్‌కతా)
ఏప్రిల్ 05: సన్‌రైజర్స్ హైదరాబాద్ vs లక్నో సూపర్ జెయింట్స్ (మధ్యాహ్నం 3:30, హైదరాబాద్) - హోమ్ మ్యాచ్
ఏప్రిల్ 11: పంజాబ్ కింగ్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్ (మధ్యాహ్నం 3:30, న్యూ చండీగఢ్)
సలీల్ అరోరా(రూ.1.50 కోట్లు), శివాంగ్ కుమార్(రూ.30 లక్షలు), క్రెయిన్స్ ఫులెట్రా(రూ.30 లక్షలు), సాకిబ్ హుస్సేన్(రూ.30 లక్షలు), ఓంకార్ తర్మలె(రూ.30 లక్షలు), ప్రఫుల్ హింగే(రూ.30 లక్షలు), అమిత్ కుమార్(రూ.30 లక్షలు), లియామ్ లివింగ్ స్టోన్(రూ.13 కోట్లు), శివమ్ మావి(రూ.75 లక్షలు), జాక్ ఎడ్వర్డ్స్(రూ.3 కోట్లు).
ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, అనికేత్ వర్మ, ఆర్ సమరన్, ఇషాన్ కిషన్, హెన్రీచ్ క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి, హర్ష్ దూబే, కామిందు మెండీస్, హర్షల్ పటేల్, బ్రైడన్ కార్స్, ప్యాట్ కమిన్స్, జయదేవ్ ఉనాద్కత్, ఇషాన్ మలింగా, జీషన్ అన్సారీ.