న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఇంగ్లాండ్ గడ్డపై నీ సత్తా చూపెట్టు, 'కోహ్లీ ముందు మరో ఛాలెంజ్'

Virat Kohli not great until he scores runs in England, says Michael Holding

హైదరాబాద్: తాజాగా ఐసీసీ ప్రకటించిన ప్రతిష్టాత్మక అవార్డుల్లో బెస్ట్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ద ఇయర్‌తో పాటు వన్డే ప్లేయర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డును కైవసం చేసుకున్న కోహ్లీ గొప్ప ఆటగాడిగా నిరూపించుకోవాలంటే ఇప్పటి వరకు ఆడినవి సరిపోవట. కోహ్లీ ఇంగ్లాండ్‌ గడ్డపై రాణించి గొప్ప బ్యాట్స్‌మెన్‌ అని నిరూపించుకోవాల్సి ఉందంటూ ఇంగ్లాండ్ బౌలర్ మైకేల్ హోల్డింగ్ సవాలు విసిరాడు.

ఈ ఏడాది జూన్‌లో భారత జట్టు టెస్టు, వన్డే, టీ20 సిరీస్‌ కోసం ఇంగ్లాండ్ గడ్డపై అడుగు పెట్టనుంది. ఈ నేపథ్యంలో తాజాగా వెస్టిండీస్‌ మాజీ బౌలర్‌ మైకేల్‌ హోల్డింగ్‌ మాట్లాడుతూ..'2014లో భారత జట్టు ఇంగ్లాండ్‌లో పర్యటించింది. ఈ పర్యటనలో 10 ఇన్నింగ్స్‌ల్లో కలిపి కోహ్లీ సగటు 13.4శాతం మాత్రమే.' అంటూ తేల్చి చెప్పాడు.

'ఈ ఏడాది కోహ్లీ ఇంగ్లాండ్‌ గడ్డపై తానేంటో నిరూపించుకోవాల్సిన సమయం వచ్చింది. జో రూట్‌ సారథ్యంలోని ఇంగ్లాండ్‌ను ఈ ఏడాది జూన్‌లో కోహ్లీ సేన ఢీకొట్టనుంది. గత ఇంగ్లాండ్‌ పర్యటనలో కోహ్లీ ఆశించిన స్థాయిలో రాణించలేదు. ఈ ఏడాది కోహ్లీకి ఇంగ్లాండ్‌ గడ్డపై తానేంటో నిరూపించుకునేందుకు మరో అవకాశం వచ్చింది. కోహ్లీ అద్భుతమైన ఆటగాడే. కానీ గొప్ప ఆటగాడు కావాలంటే ఇక్కడ పరుగులు చేస్తేనే' తాను ఒప్పుకుంటానని అతను స్పష్టం చేశాడు.

'ఎవరైనా టాప్‌-3 క్రికెటర్లు ఎవరని తనను అడిగితే ఆ లిస్టులో కోహ్లీ పేరు కూడా తప్పకుండా ఉంటుందని కితాబిచ్చాడు. 'ప్రస్తుత అంతర్జాతీయ క్రికెట్లో జో రూట్‌, విరాట్‌ కోహ్లీ, స్టీవ్‌ స్మిత్‌ బెస్ట్‌ ఆటగాళ్లు. డివిలియర్స్‌ ఇప్పుడే తిరిగి టెస్టు క్రికెట్లో ఆడుతున్నాడు. కాబట్టి అతని పేరును ఇప్పుడే బెస్ట్‌ ఆటగాళ్ల జాబితాలో చేర్చలేను' అని హోల్డింగ్‌ వివరించాడు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Monday, January 22, 2018, 18:40 [IST]
Other articles published on Jan 22, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X