న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టెస్టుల్లో 400 పరుగులు: తన రికార్డుని బద్దలు కొట్టే ఆ ముగ్గురి పేర్లు చెప్పిన లారా!

Virat Kohli-led Team India capable of winning T20 World Cup: Brian Lara

హైదరాబాద్: ఈ ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరుగనున్న టీ20 వరల్డ్‌కప్‌‌లో విరాట్‌ కోహ్లీ నేతృత్వంలోని భారత క్రికెట్‌ జట్టుకు టీ20 వరల్డ్‌కప్‌ను గెలిచే అవకాశం ఉందని వెస్టిండిస్ మాజీ క్రికెట్ దిగ్గజం బ్రియాన్ లారా చెప్పాడు. టీ20
వరల్డ్‌కప్‌ను టీమిండియా తప్పక సొంతం చేసుకుంటుందని అన్నాడు.

ప్రస్తుత భారత జట్టులో ప్రతీ ఒక్కరూ తమ తమ టార్గెట్‌లు ఏమిటో తెలుసుకుని జట్టును పటిష్టం చేశారని లారా తెలిపాడు. క్వార్టర్‌ ఫైనల్‌, సెమీ ఫైనల్‌, ఫైనల్‌ వంటి మ్యాచ్‌ల్లో ప్రత్యర్థి జట్లకు భారత్‌ ఎదురుపడితే అది అవతలి జట్టుకు సవాలే అవుతుందని లారా స్పష్టం చేశాడు.

బ్రిస్బేన్‌ ఇంటర్నేషనల్‌ టోర్నీకి వీనస్‌ విలియమ్స్ దూరంబ్రిస్బేన్‌ ఇంటర్నేషనల్‌ టోర్నీకి వీనస్‌ విలియమ్స్ దూరం

కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా

కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా

గత కొన్నేళ్లుగా కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా ఐసీసీ ఈవెంట్లలో సత్తా చాటుతోంది. అయితే, పైనల్స్‌లో మాత్రం అంచనాలను అందుకోలేకపోతుంది. ఇంగ్లాండ్ వేదికగా ముగిసిన వన్డే వరల్డ్‌కప్‌లో సెమీఫైనల్‌కు చేరుకున్న టీమిండియా... న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించింది.

టో్ర్నీ అసాంతం ఒక్క మ్యాచ్ కూడా

టో్ర్నీ అసాంతం ఒక్క మ్యాచ్ కూడా

అయితే, టో్ర్నీ అసాంతం ఒక్క మ్యాచ్ కూడా ఓడకుండా సెమీస్‌కు చేరుకుంది. కాగా, టెస్టుల్లో తాను నెలకొల్పిన 400 పరుగుల రికార్డు ఏదో ఒకరోజు బద్దలవుతుందని లారా చెప్పుకొచ్చాడు. మోడ్రన్ డే క్రికెట్‌లో తన రికార్డుని బద్దలు చేసే ఆటగాళ్లలో భారత్ నుంచి రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీలకు అవకాశం ఉందని చెప్పిన లారా ఆస్ట్రేలియా నుంచి డేవిడ్‌ వార్నర్‌కు తన రికార్డును బద్ధలు కొట్టే సత్తా ఉందని చెప్పాడు.

ఈ ముగ్గురిలో ఎవరో ఒకరు

ఈ ముగ్గురిలో ఎవరో ఒకరు

ఈ ముగ్గురిలో ఎవరో ఒకరు తన రికార్డును బద్దలు కొట్టడానికి ఎక్కువ సమయం పట్టదని లారా అన్నాడు. ఈ ముగ్గురిలో వార్నర్, రోహిత్ శర్మలు ఓపెనర్లు కాబట్టి క్రీజులో సుదీర్ఘ సమయం నిలదొక్కుకుంటే తన రికార్డుని అధిగమిస్తారని లారా అన్నాడు. ఇక, విరాట్ కోహ్లీ ఫస్ట్‌ డౌన్‌లో రావడంతో అతనికి కూడా అవకాశం ఉందని అన్నాడు.

స్టీవ్‌ స్మిత్‌కు మాత్రం ఆ అవకాశం లేదు

స్టీవ్‌ స్మిత్‌కు మాత్రం ఆ అవకాశం లేదు

ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ స్టీవ్‌ స్మిత్‌కు మాత్రం తన రికార్డును బద్దలు కొట్టడం సాధ్యం కాకపోవచ్చని లారా పేర్కొన్నాడు. స్టీవ్ స్మిత్ సాధారణంగా నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తాడు కాబట్టి 400 పరుగుల మైలురాయిని అందుకోవడం కష్టమని లారా ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు. 2004లో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టులో లారా 400 పరుగుల మైలురాయిని అందుకున్నాడు.

పదిహేను ఏళ్లుగా టెస్టుల్లో

పదిహేను ఏళ్లుగా టెస్టుల్లో

గత పదిహేను ఏళ్లుగా టెస్టుల్లో ఈ రికార్డు పదిలంగానే ఉంది. గతంలో ఈ రికార్డుకు మాథ్యూ హేడెన్‌ ఒకానొక సమయంలో చేరువగా వచ్చినప్పటికీ దానిని అందుకోలేకపోయాడు. గతేడాది పాక్‌తో జరిగిన ఓ టెస్టులో డేవిడ్‌ వార్నర్‌ ఆ రికార్డును బ్రేక్‌ చేసే అవకాశం వచ్చినా ఆసీస్‌ తమ ఇన్నింగ్స్‌ను డిక్లేర్డ్‌ చేయడంతో అది సాధ్యం కాలేదు.

Story first published: Thursday, January 2, 2020, 12:36 [IST]
Other articles published on Jan 2, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X