న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆస్ట్రేలియన్లు స్నేహితులు కారు: కోహ్లీ వ్యాఖ్యలపై రిచర్డ్స్ ఇలా

ఆస్ట్రేలియన్లు ఇక ఎప్పటికీ తనకు స్నేహితులు కారని చెప్పి విమర్శలు పాలైన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి వెస్టిండిస్ క్రికెట్ లెజెండ్ వివ్ రిచర్డ్స్ మద్దతుగా నిలిచాడు.

By Nageshwara Rao

హైదరాబాద్: ఇటీవల ఆస్ట్రేలియాతో ముగిసిన టెస్టు సిరిస్ అనంతరం ఆస్ట్రేలియన్లు ఇక ఎప్పటికీ తనకు స్నేహితులు కారని చెప్పి విమర్శలు పాలైన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి వెస్టిండిస్ క్రికెట్ లెజెండ్ వివ్ రిచర్డ్స్ మద్దతుగా నిలిచాడు.

అలా మాట్లాడొచ్చా!: కోహ్లీ తీరుపై ఆసీస్‌ మాజీల అసంతృప్తిఅలా మాట్లాడొచ్చా!: కోహ్లీ తీరుపై ఆసీస్‌ మాజీల అసంతృప్తి

ఇండియా టుడేకి ఇచ్చిన ఇంటర్యూలో రిచర్డ్స్ మాట్లాడుతూ కోహ్లీ పట్ల ఆసీస్ ఆటగాళ్ల చేసిన వ్యాఖ్యల కారణంగానే కోహ్లీ ఆ విధంగా స్పందించాడని రిచర్డ్స్ పేర్కొన్నాడు. భారత్ పర్యటనలో ఆసీస్ ఆటగాళ్ల వ్యవహార శైలిని కోహ్లీ సీరియస్‌గా తీసుకోవడంతోనే అతని వ్యాఖ్యలకు కారణమై ఉండవచ్చని చెప్పుకొచ్చాడు.

Virat Kohli knows that he is talented enough, says Viv Richards

'ఆసీస్ క్రికెట్ జట్టు స్లెడ్జింగ్ చేయడంలో ఎప్పుడూ దిట్ట. ప్రధాన ఆటగాళ్లను ముందుగానే లక్ష్యంగా చేసుకుని పైచేయి సాధించడం ఆస్ట్రేలియాకు వెన్నతో పెట్టిన విద్య. ఆ క్రమంలోనే భారత్‌ పర్యటనలో ఆసీస్ ఆటగాళ్లు హద్దులు దాటి ఉండవచ్చు. అదే సమయంలో కోహ్లీని టార్గెట్ చేయడం కూడా అతన్ని ఇబ్బంది పెట్టింది' అని అన్నాడు.

ఇందులో భాగంగానే ఆసీస్ సిరిస్ తర్వాత ఆస్ట్రేలియా క్రికెటర్లు ఇకపై తనకు స్నేహితులు కాదంటూ కోహ్లీ బహిరంగ ప్రకటనకు కారణమై ఉండొచ్చని రిచర్డ్స్ అభిప్రాయపడ్డాడు. మరోవైపు టీమిండియా తన నెంబర్ వన్ ర్యాంకుని సుదీర్ఘ కాలం కాపాడుకోవాలంటే విదేశాల్లో సత్తా చాటాల్సిన అవసరం ఉందన్నాడు.

ధోనితో విభేదాలు లేవు: కోహ్లీ 'శత్రువుల' జాబితాపై స్మిత్ ఇలాధోనితో విభేదాలు లేవు: కోహ్లీ 'శత్రువుల' జాబితాపై స్మిత్ ఇలా

కోహ్లీ చేసిన ఈ వ్యాఖ్యలపై ఆ దేశ మాజీ క్రికెటర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆటలో గెలుపు ఓటములు సహజమని, ఈ విషయంలో అతడు ప్రత్యర్థి ఆటగాళ్లపై కక్ష పెంచుకోవడం సరికాదని హితవు పలికారు. కోహ్లీ వ్యాఖ్యలను ఆసీస్ బ్యాటింగ్‌ దిగ్గజం మార్క్‌ టేలర్‌ తీవ్రంగా తప్పుబట్టిన సంగతి తెలిసిందే.

'ఈరోజుల్లో క్రికెటర్లు లీగ్‌ల్లో కలిసి చాలా మ్యాచ్‌లు ఆడతున్నారు. కొన్నిసార్లు ప్రత్యర్థులుగా ఆడుతున్నారు. అలాంటపుడు ఏదైనా మాట్లాడేటపుడు జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి సమయంలో కక్షలు పెంచుకోవడం సరికాదు. ఇలాంటి వ్యాఖ్యలు చేసేవిషయంలో అప్రమత్తంగా ఉండాలి. మ్యాచ్‌లో కొన్ని సంఘటనలు జరుగుతాయి. వాటిని దాటుకుని వెళ్లిపోయేలా ఎదగాలి' అని మార్క్‌ టేలర్‌ అన్నాడు.

Story first published: Monday, November 13, 2017, 12:14 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X