న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఉమేశ్‌ బ్యాటింగ్‌పై కోహ్లీ జోక్‌.. అతడు మూడో స్థానంలో ఆడొచ్చు!!

Virat Kohli Jokes About Umesh Yadav's Batting ! || Oneindia Telugu
Virat Kohli jokes, Umesh Yadav can come in at No.3 with the way he is batting

ఢిల్లీ: ఇటీవలి కాలంలో టీమిండియా పేస్‌ర్‌ ఉమేశ్‌ యాదవ్‌ అద్భుతంగా రాణిస్తున్నాడని కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ప్రశంసలు కురిపించాడు. ఇదే సమయంలో ఉమేశ్‌ బ్యాటింగ్‌పై కోహ్లీ ఓ జోక్‌ కూడా వేసాడు. ఉమేశ్‌ ప్రస్తుత బ్యాటింగ్‌ చూస్తుంటే.. అతడు మూడో స్థానంలో ఆడొచ్చు అని నవ్వాడు. గాయం కారణంగా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌ సిరీస్‌లకు దూరమయ్యాడు. బుమ్రా స్థానంలో జట్టులోకి వచ్చిన ఉమేశ్.. బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ అదరగొట్టాడు.

'విండీస్‌తో టీ20 సిరీస్‌.. రోహిత్‌తో కలిసి అతడే ఓపెనింగ్‌ చేస్తాడు''విండీస్‌తో టీ20 సిరీస్‌.. రోహిత్‌తో కలిసి అతడే ఓపెనింగ్‌ చేస్తాడు'

అత్యంత వేగంగా 30 పరుగులు:

అత్యంత వేగంగా 30 పరుగులు:

గత నెలలో దక్షిణాఫ్రికాతో రాంచీ వేదికగా జరిగిన మూడో టెస్టులో ఉమేశ్ సిక్సర్ల మోత మోగించాడు. కేవలం 10 బంతుల్లోనే 31 పరుగులు చేశాడు. దీంతో టెస్టు చరిత్రలో అత్యంత వేగంగా 30కిపైగా పరుగులు చేసిన క్రికెటర్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. గతంలో న్యూజిలాండ్‌ కెప్టెన్ స్టీఫెన్‌ ఫ్లెమింగ్స్‌ 11 బంతుల్లో 31 పరుగులు చేశాడు. ఆ మ్యాచ్‌లో ఉమేశ్‌ ఎదుర్కొన్న తొలి రెండు బంతులను సిక్సులుగా మలిచాడు. సచిన్‌ టెండూల్కర్, ఫోఫీ విలియమ్స్‌ మాత్రమే ఈ ఘనత సాధించారు.

ఉమేశ్‌ మూడో స్థానంలో ఆడొచ్చు:

ఉమేశ్‌ మూడో స్థానంలో ఆడొచ్చు:

తాజాగా ఓ మీడియా సమావేశంలో కోహ్లీ మాట్లాడుతూ ఉమేశ్‌ బ్యాటింగ్‌పై జోక్‌ చేసాడు. 'ఐదుగురు బౌలర్లు (ఒక స్పిన్నర్‌-జడేజా/అశ్విన్‌తో సహా), ఒక కీపర్‌తో ప్రస్తుతం టీమిండియా ఏడో స్థానం వరకు బ్యాటింగ్‌ చేయగలదు. ఒకవేళ విదేశాల్లో హార్దిక్‌ పాండ్య ఆల్‌రౌండర్‌గా రాణించకపోతే.. ఉమేశ్‌ ప్రస్తుతం ఆడుతున్న విధానంతో మూడో స్థానంలో ఆడొచ్చు. పించ్‌ హిట్టర్‌గా కూడా ఉండొచ్చు' అని కోహ్లీ ఒక్కసారిగా నవ్వాడు.

రెండు మ్యాచ్‌ల్లో 11 వికెట్లు:

రెండు మ్యాచ్‌ల్లో 11 వికెట్లు:

కొంతకాలం క్రితం ఉమేశ్ బంతిని పట్టుకునే విధానాన్ని మార్చుకుని అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. ఇక బౌలింగ్‌లో మరింత నియంత్రణ సాధించాడు. దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టుల్లో అతడి బౌలింగ్ అమోగం. నిజానికి దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు ఉమేశ్ తొలుత ఎంపిక కాలేదు. అయితే జస్ప్రీత్ బుమ్రా గాయపడడంతో చోటు దక్కింది. తొలి టెస్టులో అవకాశం రాకపోయినా.. చివరి రెండు మ్యాచ్‌లకు జట్టులోకి వచ్చి సత్తా చాటాడు. రెండు మ్యాచ్‌ల్లో 11 వికెట్లు తీసి జట్టు గెలుపులో కీలకపాత్ర పోషించాడు.

టెస్టు ఛాంపియన్‌షిప్‌లో అత్యుత్తమ గణంకాలు:

టెస్టు ఛాంపియన్‌షిప్‌లో అత్యుత్తమ గణంకాలు:

దక్షిణాఫ్రికా సిరీస్‌ ప్రదర్శనతో బంగ్లాతో సిరీస్‌కు ఎంపికయ్యాడు. తొలి టెస్టులో నాలుగు వికెట్లే తీసినా.. కోల్‌కతాలో జరిగిన చారిత్రాత్మక డే/నైట్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో రెచ్చిపోయాడు. ఏకంగా ఐదు వికెట్లు తీసి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. డే/నైట్ టెస్టులో ఉమేశ్‌ 8/81 అద్భుత గణాంకాలు నమోదు చేసాడు. మొత్తంగా నాలుగు టెస్టుల్లో 13.65 సగటుతో 23 వికెట్లు తీశాడు. 23.1 స్ట్రైక్‌రేట్‌తో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో అత్యుత్తమ గణంకాలు నమోదు చేసిన బౌలర్‌గా నిలిచాడు.

Story first published: Sunday, December 1, 2019, 17:26 [IST]
Other articles published on Dec 1, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X