న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోహ్లీ మనిషే కాదు: సంచలన వ్యాఖ్యలు చేసిన బంగ్లా క్రికెటర్

Virat Kohli is not human, says Bangladesh star Tamim

హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అసలు మనిషే కాదని బంగ్లాదేస్ క్రికెటర్ తమీమ్‌ ఇక్బాల్‌ అభిప్రాయపడ్డాడు. విరాట్ కోహ్లీలో ఏదో శక్తి దాగి ఉందని తాజాగా ఖలీజ్‌ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా విండిస్‌తో జరిగిన తొలి వన్డేలో కోహ్లీ 36వ సెంచరీని సాధించిన సంగతి తెలిసిందే.

<strong>ఐకానిక్ ఫోటోషూట్: డిజైనర్ దుస్తుల్లో మెరిసిన టెన్నిస్ క్వీన్స్ (ఫోటోలు)</strong>ఐకానిక్ ఫోటోషూట్: డిజైనర్ దుస్తుల్లో మెరిసిన టెన్నిస్ క్వీన్స్ (ఫోటోలు)

గువహటి వన్డేలో కెప్టెన్ విరాట్ కోహ్లీ 140 పరుగులు చేయడంతో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ రికార్డుని సమం చేశాడు. వరుసగా మూడు కేలండర్‌ ఇయర్స్‌ (20016-18)లో 2000కు పైగా పరుగులు సాధించిన ఆటగాడిగానూ సచిన్‌ టెండూల్కర్, మాథ్యూ హెడెన్‌, జో రూట్‌ సరసన కోహ్లీ నిలిచాడు.

కోహ్లీపై తమీమ్‌ ఇక్బాల్ ప్రశంసల వర్షం

కోహ్లీపై తమీమ్‌ ఇక్బాల్ ప్రశంసల వర్షం

కోహ్లీ సెంచరీకి ఫిదా అయిన తమీమ్‌ ఇక్బాల్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ సందర్భంగా ఖలీజ్‌ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తమీమ్ మాట్లాడుతూ "కోహ్లీ ఆటను చూస్తుంటే నాకు అతను మనిషేనా అనిపిస్తోంది. ప్రతి మ్యాచ్‌లో సెంచరీ చేసేలా కనిపిస్తున్నాడు. ఆటపట్ల అతనికున్న నిబద్దతను చూస్తుంటే నమ్మబుద్ది కావడం లేదు" అని అన్నాడు.

నిజంగా కోహ్లీ ఓ అద్భుతం

నిజంగా కోహ్లీ ఓ అద్భుతం

"మూడు ఫార్మాట్లలో అతడే ప్రపంచ నంబర్ వన్ బ్యాట్స్‌మన్‌. కోహ్లీ కూడా ఎవరినో ఒకరిని ఆరాధిస్తూ అతని నుంచి ఎదో ఒకటి నేర్చుకొని ఉంటాడు. గత 12 ఏళ్లుగా నేను ఎంతో మంది గొప్ప ఆటగాళ్లను చూశాను. వారందరిలో ఎవరి ప్రత్యేక వారిదే. కానీ నాకు వారిలో కోహ్లిని డామినేట్‌ చేసే ఆటగాడు ఒక్కరు కూడా కనిపించలేదు. నిజంగా కోహ్లీ ఓ అద్భుతం" అని అన్నాడు.

1-0 ఆధిక్యంలో టీమిండియా

ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా జరిగిన తొలి వన్డేలో విజయం సాధించడంతో భారత్ 1-0 ఆధిక్యంలో కొనసాగుతోంది. విశాఖపట్నం వేదికగా బుధవారం పర్యాటక వెస్టిండిస్ జట్టుతో తలపడే భారత జట్టుని బీసీసీఐ మంగళవారం ప్రకటించింది. తొలి వన్డే జట్టునే ప్రకటించిన జట్టు మేనేజ్‌మెంట్ రెండో వన్డే కోసం కొత్తగా చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ పేరుని చేర్చింది.

రెండో వన్డేకు భారత జట్టుని ప్రకటించిన బీసీసీఐ

అయితే తుది జట్టులో కుల్దీప్‌ ఆడుతాడా లేక రిజర్వ్ బెంచికే పరిమితం అవుతాడా అన్నది తెలియాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే. ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగితే మాత్రం కుల్దీప్‌ మరోసారి బెంచ్‌కే పరిమితం కావాల్సి ఉంటుంది. అలా కాకుండా కెప్టెన్‌ కోహ్లీ ముగ్గురు స్పిన్నర్లకు మొగ్గు చూపితే ఉమేశ్‌ లేదా ఖలీల్ బెంచ్‌కు పరిమితం అవుతారు.

వైజాగ్ వన్డేలో ఆడనున్న టీమిండియా:

విరాట్‌ కోహ్లి (కెప్టెన్‌), శిఖర్‌ ధావన్‌, రోహిత్‌ శర్మ, అంబటి రాయుడు, రిషభ్‌ పంత్‌, ఎంఎస్‌ ధోని, రవీంద్ర జడేజా, కుల్దీప్‌ యాదవ్‌, యుజువేంద్ర చహల్‌, ఉమేశ్‌ యాదవ్‌, మహ్మద్‌ షమీ, ఖలీల్‌ అహ్మద్‌

Story first published: Tuesday, October 23, 2018, 18:28 [IST]
Other articles published on Oct 23, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X