వచ్చే ఏడాది దాటేస్తాడు: తన రికార్డుని కోహ్లీ మిస్ అవడంపై సంగక్కర

Posted By:
Virat Kohli is a different class, will surpass my record next year

హైదరాబాద్: ఈ ఏడాది మూడు ఫార్మాట్లలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అద్భుత ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. ఎన్నో రికార్డులను అధిగమించడంతో పాటు అనేక రికార్డులను తన ఖాతాలో కూడా వేసుకున్నాడు. అయితే, శ్రీలంక క్రికెట్ దిగ్గజం కుమార సంగక్కర రికార్డుని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తృటిలో మిస్సయ్యాడు.

అంతర్జాతీయ క్రికెట్లో ఒకే ఏడాది అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లీ మూడోస్థానంలో నిలిచాడు. విరాట్ కోహ్లీ ఈ ఏడాది మరో 51 పరుగులు చేసి ఉంటే సంగక్కర రికార్డుని బద్దలు కొట్టి ఉండేవాడు. ఈ జాబితాలో 2014లో శ్రీలంక క్రికెటర్ కుమార సంగక్కర 53.11 యావరేజితో 2868 పరుగులు చేసి అగ్రస్థానంలో ఉన్నాడు.

ఆ తర్వాత ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ రికీ పాంటింగ్ 2005లో 56.66 యావరేజ్‌తో 2833 పరుగులతో రెండో స్ధానంలో కొనసాగుతున్నాడు. ఈ నేపథ్యంలో కుమార సంగక్కర రికార్డు సేఫ్‌గా ఉందంటూ శ్రీలంకకు చెందిన జర్నలిస్ట్ అజ్జామ్ అమీన్ తన ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశాడు.

ఈ ట్వీట్‌కు కుమార సంగక్కర తనదైన శైలిలో స్పందించాడు. 'విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేస్తున్నంత కాలం ఆ రికార్డు ఎంతో కాలం నాపేరుపై ఉంటుందని నేను అనుకోవడం లేదు. వచ్చే ఏడాది అతను దానిని అధిగమిస్తాడని.... మళ్లీ తన రికార్డు ఆ పై వచ్చే సంవత్సరం తానే బ్రేక్ చేస్తాడు. అతడు అద్భుతమైన బ్యాట్స్‌మన్' అని సంగక్కర ట్వీట్ చేశాడు.

నిజానికి ఈ రికార్డుని విరాట్ కోహ్లీ ఈ ఏడాదే బద్దలు కొట్టాల్సి ఉంది. ఈ ఏడాదిలో టీమిండియా ఇంకా మూడు వన్డేలు, మూడు టీ20లు మాత్రమే ఆడనుంది. ఈ పరిమిత ఓవర్ల సిరిస్ నుంచి విరాట్ కోహ్లీ తప్పుకున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది దక్షిణాఫ్రికా పర్యటనను దృష్టిలో పెట్టుకుని ఈ పరిమిత ఓవర్ల సిరిస్ నుంచి కోహ్లీ తప్పుకున్న సంగతి తెలిసిందే.

దీంతో కోహ్లీ ఈ రికార్డుని చేజార్చుకున్నాడు. ఈ సిరిస్ నుంచి కోహ్లీ తప్పుకోవడంతో ఒక్క కుమార సంగక్కర రికార్డుని మాత్రమే కోహ్లీ చేజార్చుకోలేదు. ఈ ఏడాది 11 సెంచరీలు చేసిన కోహ్లీ ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక సెంచరీలు చేసిన క్రికెటర్ల జాబితాలో పాంటింగ్‌తో కలిసి రెండో స్థానంలో ఉన్నాడు.

మరో సెంచరీ చేసి ఉంటే 12 సెంచరీలతో సచిన్ రికార్డుతో సమం చేసేవాడు. ఈ ఏడాది కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లో పరుగుల వరద పారించాడు. మొత్తం 46 మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ ఇప్పటివరకు 2818 పరుగులు చేశాడు. 68.73 యావరేజితో పరుగులు చేసిన కోహ్లీ 11 సెంచరీలు, 10 హాఫ్ సెంచరీలు సాధించాడు. వరుసగా రెండో ఏడాది కూడా మూడు డబుల్ సెంచరీలను నమోదు చేశాడు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

రికెట్ అంటే ఇష్టమా? నిరూపించు! మైఖేల్ ఫాంటసీ క్రికెట్ ఆడు

Story first published: Thursday, December 7, 2017, 17:11 [IST]
Other articles published on Dec 7, 2017
POLLS

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి