స‌చిన్ రికార్డు బ్రేక్ చేయ‌డానికి 9 ప‌రుగుల దూరంలో విరాట్ కోహ్లీ

టీమిండియా రన్ మెషీన్ విరాట్ కోహ్లీ మ‌రో రికార్డుకు చేరువ‌లో ఉన్నాడు. ఇప్ప‌టికే త‌న‌దైన బ్యాటింగ్‌తో విరాట్ కోహ్లీ ఎన్నో రికార్డుల‌ను బ‌ద్ద‌లు కొట్టాడు. వ‌రుస సెంచ‌రీలు, వేల కొద్దీ ప‌రుగులు సునాయ‌సంగా సాధిస్తూ ఇప్ప‌టికే అంత‌ర్జాతీయ క్రికెట్‌లో త‌న కంటూ అనేక రికార్డుల‌ను క్రియేట్ చేసుకున్నాడు. తాజాగా వ‌న్డే క్రికెట్‌లో మాష్ట‌ర్ బ్లాష్ట‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్ రికార్డును బ్రేక్ చేయ‌డానికి విరాట్ కోహ్లీ అత్యంత చేరువ‌లో ఉన్నాడు.

9 ర‌న్స్ దూరంలో కోహ్లీ

9 ర‌న్స్ దూరంలో కోహ్లీ

విదేశాల్లో వ‌న్డే క్రికెట్‌లో అత్య‌ధిక రన్స్ చేసిన భార‌త బ్యాట‌ర్‌గా నిల‌వ‌డానికి విరాట్ కోహ్లీ మ‌రో 9 ప‌రుగుల దూరంలో మాత్ర‌మే ఉన్నాడు. ఇప్ప‌టివ‌ర‌కు విదేశాల్లో వ‌న్డేల్లో విరాట్ కోహ్లీ 5057 ప‌రుగులు చేశాడు. ప్ర‌స్తుతం విదేశాల్లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన భార‌త బ్యాట‌ర్ల‌ జాబితాలో స‌చిన్ టెండూల్క‌ర్ మొదటి స్థానంలో ఉన్నాడు.

విదేశాల్లో సచిన్ 5065 ప‌రుగులు చేశాడు. దీంతో విరాట్ కోహ్లీ మ‌రో 9 ప‌రుగులు సాధిస్తే విదేశాల్లో వ‌న్డే క్రికెట్‌లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన భార‌త్ బ్యాట‌ర్‌గా రికార్డు సృష్టిస్తాడు.

కోహ్లీ రికార్డులు

కోహ్లీ రికార్డులు

ఇప్ప‌టివ‌ర‌కు త‌న కెరీర్‌లో 254 వ‌న్డే మ్యాచ్‌లు ఆడిన విరాట్ కోహ్లీ 59 స‌గ‌టుతో 12169 ప‌రుగులు చేశాడు. ఇందులో 43 సెంచ‌రీలు, 62 హాఫ్ సెంచ‌రీలు ఉన్నాయి. అత్య‌ధిక స్కోర్ 183 ప‌రుగులు. స్ట్రైక్‌రేట్ 93గా ఉంది. ఈ క్ర‌మంలో కోహ్లీ 1140 ఫోర్లు, 125 సిక్స్‌లు బాదాడు. అలాగే వ‌న్డే క్రికెట్‌లో అత్య‌ధికంగా 59 స‌గ‌టు ఉన్న బ్యాట‌ర్‌గా విరాట్ కోహ్లీ ఇప్ప‌టికే రికార్డు సృష్టించాడు.

100 వికెట్ల‌కు చేరువ‌లో చాహ‌ల్‌

100 వికెట్ల‌కు చేరువ‌లో చాహ‌ల్‌

భార‌త స్పిన్న‌ర్ య‌జేర్వేంద్ర చాహ‌ల్ వ‌న్డే క్రికెట్‌లో ఓ రికార్డుకు చేరువ‌లో ఉన్నాడు. వ‌న్డేల్లో ఇప్ప‌టివ‌ర‌కు 97 వికెట్లు తీసిన చాహ‌ల్, మ‌రో 3 వికెట్లు తీస్తే 100 క్ల‌బ్‌లో చేరుతాడు. ఈ క్ర‌మంలో వ‌న్డేల్లో 100 వికెట్లు తీసిన 23వ భార‌త బౌల‌ర్‌గా నిలుస్తాడు. అలాగే మ‌రో రెండు వికెట్లు తీస్తే ద‌క్షిణాఫ్రికాలో ఎక్కువ వికెట్లు తీసిన భార‌త్ బౌల‌ర్‌గా నిలుస్తాడు. ఇప్ప‌టివ‌ర‌కు ద‌క్షిణాఫ్రికాలో చాహ‌ల్‌ 18 వికెట్లు తీశాడు.

నేడే తొలి వ‌న్డే

నేడే తొలి వ‌న్డే

కాగా భార‌త్, సౌతాఫ్రికా మ‌ధ్య నేటి నుంచే వ‌న్డే సిరీస్ ప్రారంభం కానుంది. పార్ల్‌లోని బోలాండ్ మైదానం వేదిక‌గా నేడు తొలి వ‌న్డే మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. భారత కాల‌మానం ప్ర‌కారం మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. చాలా కాలం త‌ర్వాత ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ఓ సాధార‌ణ ఆట‌గాడిగా బ‌రిలోకి దిగుతున్నాడు. కాగా సౌతాఫ్రికాలో చివ‌రి సారి ఆడిన వన్డే సిరీస్‌ను టీమిండియానే గెలుచుకుంది. అప్పుడు జ‌రిగిన 6 వ‌న్డేల సిరీస్‌ను భార‌త్ ఏకంగా 5-1తో గెలుచుకుంది. ఆ సిరీస్‌లో విరాట్ కోహ్లీ ఏకంగా 3 సెంచ‌రీల‌తో దుమ్ము రేపాడు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Wednesday, January 19, 2022, 8:29 [IST]
Other articles published on Jan 19, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X