న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రెండు ఇన్నింగ్స్‌లలో విఫలం.. కోహ్లీపై లక్ష్మణ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు!!

Virat Kohli has to show more discipline: VVS Laxman on kohli poor show in Wellington Test

వెల్లింగ్టన్‌: న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ రెండు ఇన్నింగ్స్‌లలో విఫలమ్ముడు. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 2 పరుగులే చేసి కైలీ జెమీస‌న్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ఇక కీలక రెండో ఇన్నింగ్స్‌లో 19 పరుగులు చేసి ట్రెంట్ బోల్ట్ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. కోహ్లీ రెండు ఇన్నింగ్స్‌లలో విఫలమవ్వడంపై భారత మాజీ బ్యాట్స్‌మన్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ స్పందించారు. విరాట్ కోహ్లీ మరింత క్రమశిక్షణతో ఆడాల్సింది, ఓపిక పట్టాల్సింది అని అన్నారు.

<strong>విండీస్‌ స్టార్ క్రికెటర్‌కు పాక్‌ పౌరసత్వం.. ఎందుకో తెలుసా?!!</strong>విండీస్‌ స్టార్ క్రికెటర్‌కు పాక్‌ పౌరసత్వం.. ఎందుకో తెలుసా?!!

మరింత క్రమశిక్షణగా ఆడాల్సింది

మరింత క్రమశిక్షణగా ఆడాల్సింది

మూడో రోజు మ్యాచ్‌ అనంతరం వీవీఎస్‌ లక్ష్మణ్‌ స్టార్‌స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ...'విరాట్ కోహ్లీ మరింత క్రమశిక్షణతో, పట్టుదలతో ఆడాల్సింది. పరుగులు చేయలేక సతమతమవుతున్న కోహ్లీ లాంటి స్ట్రోక్‌ ప్లేయర్లు ధాటిగా ఆడాలని చూస్తారు. ప్రత్యర్థులు లైన్‌ అండ్‌ లెంగ్త్‌లో బౌలింగ్‌ చేస్తే పరుగులు సాధించాలనుకుంటారు. అయితే కివీస్‌ బౌలర్లు అందుకు విరుద్ధంగా బంతులేశారు. కోహ్లీ పరుగులు తీసేందుకు అవకాశం ఇవ్వలేదు' అని అన్నారు.

కోహ్లీని టార్గెట్‌ చేసారు

కోహ్లీని టార్గెట్‌ చేసారు

'స్టంప్స్‌ పైకి బంతి విసిరితే కోహ్లీ పరుగులు చేస్తున్నాడని కివీస్ బౌలర్లు తెలుసుకున్నారు. దీంతో కివీస్‌ బౌలర్లు అతడిని టార్గెట్‌ చేసి షార్ట్‌ పిచ్‌ బంతులేశారు. కోహ్లీ సహనాన్ని బౌలర్లు పరీక్షించారు. ఈ పర్యటన మొత్తంలో కోహ్లీకి ఆఫ్‌స్టంప్‌ ఆవల బంతులేశారు. తద్వారా అతడు ఔటేయ్యేలా చేశారు. తొలి ఇన్నింగ్స్‌లో కివీస్ కెప్టెన్ కేన్‌ విలియమ్సన్‌ ఆడినట్టు ఆడితేనే వారి బౌలింగ్‌ను ఎదుర్కోవచ్చు' అని లక్ష్మణ్‌ పేర్కొన్నారు.

భారమంతా రహానె, విహారిపైనే:

భారమంతా రహానె, విహారిపైనే:

మూడో రోజు ఆటముగిసే సరికి భారత్‌ నాలుగు వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. అజింక్య రహానె (25), హనుమ విహారి (15) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం కివీస్‌ కన్నా భారత్‌ ఇంకా 39 పరుగుల వెనుకంజలో ఉంది. మయాంక్ అగర్వాల్ హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. తొలి టెస్టును టీమిండియా గెలుచుకోవాలన్నా, కనీసం డ్రా చేయాలన్నా ఆ భారమంతా రహానె, విహారి బ్యాటింగ్‌పైనే ఆధారపడి ఉంది.

183 పరుగుల ఆధిక్యం:

183 పరుగుల ఆధిక్యం:

ఆదివారం 216/5తో మూడో రోజు తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన కివీస్‌ మరో 132 పరుగులు చేసి మిగతా ఐదు వికెట్లు కోల్పోయింది. ఇషాంత్‌ శర్మ (5), ఆర్ అశ్విన్‌ (3) ధాటికి 348 పరుగులు చేసి ఆలౌటైంది. దీంతో ఆతిథ్య జట్టుకు 183 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన టీమిండియాకు శుభారంభం దక్కలేదు. పృథ్వీ షా (14), చటేశ్వర్ పుజారా (11), విరాట్ కోహ్లీ (19) విఫలమయ్యారు.

Story first published: Sunday, February 23, 2020, 16:03 [IST]
Other articles published on Feb 23, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X