న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రిటైర్‌మెంట్ గురించి పెదవి విప్పిన ధోనీ.. కోహ్లీ కూడా తనలాగే..

Virat Kohli has almost attained legendary status: MS Dhoni

హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ.. విరాట్‌ కోహ్లి క్రికెటర్‌గా ఇప్పటికే దిగ్గజ స్థాయిని అందుకున్నాడని కొనియాడాడు. కోహ్లి ఇప్పటికే ఆటగాడిగా ఎంతో సాధించాడని, ఒక కెప్టెన్‌ నుంచి జట్టు ఎలాంటి ప్రదర్శన ఆశిస్తుందో.. కోహ్లి అలాగే ఆడతాడని ధోని కితాబిచ్చాడు. ముంబైలో మంగళవారం జరిగిన ఒక ప్రచార కార్యక్రమంలో భాగంగా ధోని మాట్లాడాడు.

Virat Kohli has almost attained legendary status: MS Dhoni

'అతను అత్యుత్తమ ఆటగాడు. దిగ్గజ ఆటగాడు కావడానికి చాలా దగ్గరగా ఉన్నాడు. ఇప్పటికే ఆ స్థాయిని అందుకున్నాడు. అతడి విషయంలో నేను చాలా సంతోషంగా ఉన్నా. గత కొన్నేళ్లలో ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో అతను బ్యాటింగ్‌ చేసిన తీరు అమోఘం. విరాట్‌ జట్టును ఎప్పుడూ ముందుండి నడిపిస్తాడు. ఒక కెప్టెన్‌ నుంచి ఆశించేది అదే. అతడికి అంతా మంచే జరగాలని కోరుకుంటున్నా' అని చెప్పాడు.

రిటైర్‌మెంట్ గురించి మాట్లాడుతూ..:

రిటైర్‌మెంట్ గురించి మాట్లాడుతూ..:

మరోవైపు తన రిటైర్మెంట్‌ గురించి వస్తున్న ఊహాగానాలకు ధోని తెరదించాడు. ఇటీవల ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్‌ సందర్భంగా మ్యాచ్‌ అనంతరం అంపైర్‌ నుంచి ధోని బంతి తీసుకోవడంతో అతడి రిటైర్మెంట్‌పై ఊహాగానాలు వచ్చిన సంగతి తెలిసిందే. తాను బంతి తీసుకోవడానికి అసలు కారణమేంటో ధోని వివరించాడు.

ఆశించిన స్థాయిలో స్వింగ్‌ చేయలేక

ఆశించిన స్థాయిలో స్వింగ్‌ చేయలేక

‘మా బౌలర్లు బంతిని ఆశించిన స్థాయిలో స్వింగ్‌ చేయలేకపోయారు. వచ్చే ఏడాది ఇంగ్లాండ్‌లోనే ప్రపంచకప్‌ జరగబోతోంది. కాబట్టి మేం రివర్స్‌ స్వింగ్‌ రాబట్టడం చాలా అవసరం. ప్రత్యర్థి జట్టు ఈ విషయంలో విజయవంతమవుతున్నపుడు మేం కూడా అది చేయాలి. మ్యాచ్‌ ముగిశాక ఐసీసీకి ఆ బంతితో ఎలాంటి ఉపయోగం ఉండదు. అందుకే అంపైర్‌ను అడిగి మా బౌలింగ్‌ కోచ్‌ కోసం బంతిని తీసుకున్నా' అని ధోని తెలిపాడు.

సిరీస్ గెలిచేందుకు ఒకేదారి:

సిరీస్ గెలిచేందుకు ఒకేదారి:

ఇంగ్లాండ్‌తో తొలి టెస్టులో పరాజయం పాలైన భారత్‌.. సిరీస్‌ గెలవగలదా అని ధోనిని అడిగితే.. ‘ఒక టెస్టు మ్యాచ్‌ గెలవాలంటే 20 వికెట్లు తీయడం చాలా కీలకం. భారత బౌలర్లు అది చేయగలిగారు. ఇదే నా జవాబు. బ్యాటింగ్‌ ఎంత బాగా చేసినా 20 వికెట్లు తీస్తేనే గెలవగలం' అన్నాడు. తన కూతురు జీవా రాకతో తన జీవితంలో చాలా ప్రశాంతత వచ్చిందని చెప్పాడు.

అలాంటి వ్యక్తి.. జీవితంలో ఉండటం..

అలాంటి వ్యక్తి.. జీవితంలో ఉండటం..

‘నాకు నచ్చినా నచ్చకపోయినా జీవాకు బయట చాలా ప్రచారం వస్తోంది. నేనెక్కడికి వెళ్లినా తన గురించి అడుగుతున్నారు. మనకు ఉత్సాహాన్నిచ్చే, ఒత్తిడినంతా దూరం చేసే అలాంటి వ్యక్తి ఒకరు జీవితంలో ఉండటం చాలా బాగుంటుంది. తన వయసు మూడున్నరేళ్లే. కానీ ఇప్పటికే తనకంటూ ఒక వ్యక్తిత్వం ఉంది. తన మాట తీరే ఒక రకంగా ఉంటుంది. ఇంట్లో కూతురుండటం బాగుంటుంది' అన్నాడు.

Story first published: Wednesday, August 8, 2018, 13:28 [IST]
Other articles published on Aug 8, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X