న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోహ్లీ నీళ్ల బాటిల్ ఖరీదు రూ.600: ప్రపంచంలో ఖరీదైన నీళ్లు..

ముంబై: క్రికెట్ మ్యాచుల సమయంలో భారత టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఏ హోటల్లో బస చేసినా ఏవియాన్ మంచినీళ్ల బాటిళ్లను తెప్పించాలి. ఈ బ్రాండ్ నీళ్ల బాటిల్ ధర రూ.600కు పైగానా ఉంటుంది. ఏవియాన్ వాటర్ బాటిల్ మేడిన్ ఇండియా కాదు. కేవలం లీటర్ రూ.600 కాదు.. అంతకంటే ఎక్కువ ఖరీదైన నీళ్ల బాటిల్స్ కూడా ఉన్నాయి.

అతి ఖరీదైన నీళ్లు కోనా నిగరి. 750మి.లీ. ఈ నీటికి రూ.27వేలు. వీటిని తాగితే ఆరోగ్యం మెరుగు పడటంతో పాటు, బరువు తగ్గి, చర్మం నిగారింపును సంతరించుకుంటుందనీ ఒత్తిడి దూరమవుతుందనేది పలువురి నమ్మకం. ఈ నీటి ప్రత్యేకత ఏమిటంటే.. హవాయి దగ్గర్లోని పసిఫిక్‌ సముద్ర తీరంలో రెండువేల అడుగుల లోతు నుంచి ఈ నీటిని తీసుకు వస్తారు.

ప్రత్యేక పద్ధతుల్లో ఆ నీటిలోని ఉప్పదనాన్ని పోగొట్టి బాటిళ్లలో నింపుతారు. సముద్రం కింద వేల అడుగుల లోతునుంచి వస్తాయి కాబట్టి, స్వచ్ఛంగా ఉండడంతో పాటు వీటిలో ఖనిజ లవణాలు కూడా ఎక్కువ మోతాదులో ఉంటాయంటున్నారు. ఈ బ్రాండుకు జపాన్‌లో చాలా డిమాండ్ ఉంది. జపాన్‌లో రోజుకి 80వేలకు పైగా బాటిళ్లు దిగుమతి అవుతున్నాయి.

బ్లింగ్ హెచ్‌టూవో అనే కంపెనీ నీటి ఖరీదు కూడా చాలా ఎక్కువే. టెనెస్సీ దగ్గరున్న నీటి బుగ్గల నుంచి సేకరించిన జలంతో నింపే ఈ బాటిళ్లను స్వరోవ్‌స్కీ రాళ్లతో తీర్చిదిద్దుతారట.

Virat Kohli drinks Evian water costs Rs.600+ per litre


వీన్ నీటిని ఖరీదు 750మి.లీ.కు రూ.1500. ఈ నీటిని తాగినప్పుడల్లా నాలుకకు సుతిమెత్తని అనూభూతి కలుగుతుందట. ఫిన్లాండుకు చెందిన వీన్ కంపెనీ.. కాలుష్యం లేకుండా పచ్చదనం, స్వచ్ఛమైన వాతావరణం ఉన్న వివిధ ప్రాంతాల్లోని నీటి బుగ్గల నుంచి జలాన్ని సేకరించి బాటిళ్లలో నింపుతోంది.

*10థౌజండ్‌ బీసీ... 750మి.లీ రూ.950*

కెనడాలోని వాంకోవర్‌ నగరానికి 200 మైళ్ల దూరంలో ఉన్న ఓ పర్వత ప్రాంతంలో ఎవరూ ఉండరు. జంతువులు కూడా కనిపించవు. అక్కడ 6 వేల అడుగుల లోతుతో వాలుగా ఉండే హిమనీనదాలను కరిగించి బాటిళ్లలో నింపుతోంది 10 థౌజండ్‌ కంపెనీ. ఈ కంపెనీ నీరు 750మి.లీ.కు రూ.950.

అక్వా డెకో నీటి ఖరీదు 750మి.లీ.కు రూ.800. పద్దెనిమిది వేల సంవత్సరాల కిందట ఘనీభవించిన హిమనీనదాల నుంచి సేకరించిన నీరు.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X