న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సిడ్నీ టెస్టు, డే3: ‘పింక్ డే’గా నామకరణం, పింక్ కలర్ టోపీలతో కోహ్లీసేన

Virat Kohli and Co win hearts with their support for McGrath Foundation in Sydney – Watch Video

హైదరాబాద్: సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టు మూడో రోజైన శనివారం ఆటలో భాగంగా టీమిండియా పింక్ కలర్ టోపీలు ధరించి మైదానంలోకి దిగింది. మహిళలకు బ్రెస్ట్‌ కేన్సర్‌ మీద అవగాహన కల్పించడానికి టీమిండియా ఆటగాళ్లు పింక్ కలర్ టోపీలు ధరించారు.

సిడ్నీ టెస్ట్‌లో ఆస్ట్రేలియా 236/6: బ్యాడ్ లైట్‌తో మూడో రోజు నిలిచిన మ్యాచ్సిడ్నీ టెస్ట్‌లో ఆస్ట్రేలియా 236/6: బ్యాడ్ లైట్‌తో మూడో రోజు నిలిచిన మ్యాచ్

దీని వెనుక ఓ కారణం ఉంది. ఆసీస్ మాజీ క్రికెట్ దిగ్గజం గ్లెన్ మెక్‌గ్రాత్ తన భార్య జేన్ మెక్‌గ్రాత్ జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన మెక్‌గ్రాత్ ఫౌండేషన్‌కు మద్దతుగా సిడ్నీ ఇలా పింక్ టెస్ట్ నిర్వహిస్తోంది. 2009 నుంచి ప్రతి ఏటా సిడ్నీలో ఇలా పింక్ టెస్ట్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ మ్యాచ్‌కు వాడే స్టంప్స్, బౌండరీ లైన్స్ అన్నీ పింక్ కలర్‌లోనే ఉండటం విశేషం.

1
43626

మెక్‌గ్రాత్‌ ఫౌండేషన్‌కు నిధుల సేకరణ కోసం

ఆటలో భాగంగా శనివారం ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ గ్లెన్‌ మెక్‌గ్రాత్‌ ఫౌండేషన్‌కు నిధుల సేకరణ కోసం సిడ్నీ టెస్టు మూడో రోజు మ్యాచ్‌ను ‘పింక్ డే'గా నామకరణం చేశారు. మూడో రోజైన శనివారం ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ మొత్తం పింక్ మయం అయింది. క్రికెట్ అభిమానులు సైతం పింక్ కలర్ దుస్తులు ధరించి మైదానానికి వచ్చారు.

బ్రెస్ట్‌ కేన్సర్‌తో బాధపడుతున్న వారికి

ఈ రోజు సేకరించిన మొత్తాన్ని ఆస్ట్రేలియా వ్యాప్తంగా బ్రెస్ట్‌ కేన్సర్‌తో బాధపడుతున్న వారికి మెక్‌గ్రాత్‌ ఫౌండేషన్‌ ద్వారా అందిస్తారు. మెక్‌గ్రాత్ భార్య జేన్ మెక్‌గ్రాత్‌ కేన్సర్‌తో బాధపడుతూ 2008లో చనిపోయింది. ఆమె జ్ఞాపకార్థమే ఫౌండేషన్ ఏర్పాటు చేసి మెక్‌గ్రాత్ క్యాన్సర్‌పై పోరాడుతున్నాడు. 2005లో మెక్‌గ్రాత్‌ ఫౌండేషన్‌ను ప్రారంభించారు.

పింక్ టెస్ట్ ద్వారా వచ్చిన డబ్బంతా

బ్రెస్ట్‌ కేన్సర్‌ బాధితులకు ఈ ఫౌండేషన్ బాసటగా నిలుస్తోంది. అవగాహనా కార్యక్రమాలు నిర్వహించడం, చికిత్స అందించడం వంటి సేవలను ఈ ఫౌండేషన్‌ అందిస్తోంది.‌ ఈ పింక్ టెస్ట్ ద్వారా వచ్చిన డబ్బంతా మెక్‌గ్రాత్ ఫౌండేషన్‌కే వెళ్తుంది. ఈ డబ్బును దేశంలో ఎక్కడ అవసరమైతే అక్కడ మెక్‌గ్రాత్ బ్రెస్ట్ కేర్ నర్సులను నియమించడానికి ఉపయోగిస్తారు.

కెప్టెన్ కోహ్లీ సైతం ఇలా

బ్రెస్ట్ కేన్సర్‌పై మహిళల్లో అవగాహన కల్పించడం కోసం సిడ్నీ టెస్టు ప్రారంభమైన తొలిరోజున విరాట్ కోహ్లీ పింక్ గ్లోవ్స్, బ్యాట్‌కు పింక్ ఎమ్మారెఫ్ స్టికర్‌తో బ్యాటింగ్‌కు క్రీజులోకి వచ్చాడు. అయితే, ఎప్పుడూ లేనిది విరాట్ కోహ్లీ ఇలా పింక్ కలర్‌లో కనిపించాడు ఏంటని అభిమానులు చాలా మంది ఆశ్చర్యపోయిన సంగతి తెలిసిందే.

Story first published: Saturday, January 5, 2019, 14:42 [IST]
Other articles published on Jan 5, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X