న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ధోనీ రికార్డు బద్దలు.. అత్యంత విజయవంతమైన టెస్ట్ కెప్టెన్‌గా కోహ్లీ

WI vs IND : Kohli Breaks Dhoni Record To Become Most Successful Test Captian For India || Oneindia
Virat Kohli breaks MS Dhoni record to become most successful Test captain for India

కింగ్‌స్టన్‌: విండీస్‌తో జ‌రిగిన రెండో టెస్ట్‌లో భారత్ 257 పరుగుల భారీ తేడాతో ఘ‌న విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో 2-0తో భారత్ సిరీస్‌ను కైవసం చేసుకుంది. తద్వారా కరేబియన్‌ దీవుల్లో తొలిసారి టెస్ట్‌ సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసిన ఘనతను సాధించింది. ఇక ఐసీసీ వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ పాయింట్ల పట్టికలో 120 పాయింట్లతో భారత్ అగ్రస్థానంలో నిలిచింది.

షూటింగ్ ప్రపంచకప్‌.. 5 స్వర్ణాలతో సత్తాచాటిన భారత్షూటింగ్ ప్రపంచకప్‌.. 5 స్వర్ణాలతో సత్తాచాటిన భారత్

ధోనీ రికార్డు బద్దలు:

ధోనీ రికార్డు బద్దలు:

ఈ టెస్ట్ విజయంతో కెప్టెన్ విరాట్ కోహ్లీ వ్యక్తిగతంగానూ ఓ అరుదైన రికార్డు నెలకొల్పాడు. అంతేకాదు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ రికార్డును బద్దలు కొట్టాడు. కోహ్లీ 48 టెస్టులకు సారథ్యం వహించి.. టీమిండియాకు 28 విజయాలు అందించాడు. దీంతో ధోనీ రికార్డును బద్దలు కొట్టి అత్యంత విజయవంతమైన టెస్ట్ కెప్టెన్‌గా కోహ్లీ నిలిచాడు. టీమిండియా మాజీ కెప్టెన్ల అందరికంటే ఎక్కువ విజయాలు సాధించిన కెప్టెన్‌గా రికార్డులోకి ఎక్కాడు.

అత్యంత విజయవంతమైన కెప్టెన్‌:

అత్యంత విజయవంతమైన కెప్టెన్‌:

ధోనీ తన కెరీర్‌లో 60 టెస్టులకు సారథిగా వ్యవహరించి 27 మ్యాచ్‌ల్లో గెలిపించాడు. ఇందులో ఓటమి-18, డ్రా-15 ఉన్నాయి. ఇక విజయాల శాతం 45. కోహ్లీ 48 టెస్టులకు నాయకత్వం వహించి 28 మ్యాచ్‌ల్లో భారత్‌కు విజయాలు అందించి ధోనీని అధిగమించాడు. ఇందులో 10 ఓటమి, డ్రా-10లు ఉన్నాయి. విజయాల శాతం 55.31. సౌరభ్‌ గంగూలీ కెప్టెన్సీలో భారత్‌ 49 టెస్టుల్లో 21 గెలువగా.. మహ్మద్‌ అజారుద్దీన్‌ సారథ్యంలో 47 మ్యాచ్‌ల్లో 14 గెలుపొందింది.

 టాప్‌లో స్టీవ్‌ వా:

టాప్‌లో స్టీవ్‌ వా:

48 టెస్టుల తర్వాత అత్యధిక టెస్టు మ్యాచ్‌లు గెలిచిన కెప్టెన్ల జాబితాలో స్టీవ్‌ వా (36), రికీ పాంటింగ్‌ (33)లు మొదటి రెండు స్థానాల్లో ఉన్నారు. 28 విజయాలతో కోహ్లీ మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. ధోనీ (27) నాలుగో స్థానంలో ఉన్నాడు. కోహ్లీకి ఇంకా చాలా కెరీర్ ఉన్న నేపథ్యంలో పాంటింగ్‌, స్టీవ్‌ వాలను కూడా అధిగమించే అవకాశం ఉంది.

చార్జ్‌షీట్‌ను పరిశీలించేవరకు షమీపై ఎటువంటి చర్యలు తీసుకోము: బీసీసీఐ

2014లో టెస్టు పగ్గాలు:

2014లో టెస్టు పగ్గాలు:

2014లో ధోని నుంచి టెస్టు పగ్గాలు అందుకున్న కోహ్లీ వెనుదిరిగి చూసుకోలేదు. అతడు టీమిండియాకు పలు చిరస్మరణీయ విజయాలు అందించాడు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌ జట్లపై స్వదేశంలో గెలుపొందడంతో పాటు.. ఈ ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియాలో టెస్ట్‌ సిరీస్‌ నెగ్గి 71 ఏళ్లుగా భారత్‌కు అందని ద్రాక్షగా ఉన్న కలను సాకారం చేశాడు. అంతేకాకుండా విదేశాల్లో అత్యధిక టెస్టు మ్యాచ్‌లు గెలిచిన కెప్టెన్‌గా సౌరవ్‌ గంగూలీ పేరిట ఉన్న రికార్డును కూడా కోహ్లీ అధిగమించాడు.

Story first published: Tuesday, September 3, 2019, 10:56 [IST]
Other articles published on Sep 3, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X