న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భారత్ నుంచి ఒకే ఒక్కడు: కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డు

IND vs SA : Kohli Betters Dhoni Record With 30 Wins In 50 Tests As Captain
Virat Kohli betters MS Dhoni record with 30 wins in 50 Tests as captain


హైదరాబాద్: పూణె వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. ఆదివారం ఫాలోఆన్ ఆడిన దక్షిణాఫ్రికా జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 189 పరుగులకే ఆలౌటైంది. పుణె టెస్టులో టీమిండియా ఆల్‌రౌండ్‌ షోతో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించడంతో ఇన్నింగ్స్ 137 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది.

దీంతో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ఖాతాలో ఓ అరుదైన రికార్డు చేరింది. తొలి 50 టెస్టుల్లో అత్యధిక విజయాలు సాధించిన మూడో కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు. మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా పూణె వేదికగా జరిగిన రెండో టెస్టులో టీమిండియా విజయం సాధించిన సంగతి తెలిసిందే.

కోహ్లీకి ఇది 30వ విజయం

కోహ్లీకి ఇది 30వ విజయం

కెప్టెన్‌గా విరాట్ కోహ్లీకి ఇది 30వ విజయం కాగా... కెప్టెన్‌గా 50వ టెస్టు మ్యాచ్‌. దీంతో తొలి 50 టెస్టుల్లో అత్యధిక విజయాలు సాధించిన కెప్టెన్ల జాబితాలో ఆస్ట్రేలియా మాజీ క్రికెట్ దిగ్గజాలు స్టీవ్‌ వా(37), రికీ పాంటింగ్‌(35)ల తర్వాత మూడో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో కోహ్లీ తర్వాత వివ్‌ రిచర్డ్స్‌(27) నాలుగో స్థానంలో ఉన్నాడు.

తొలి 50 టెస్టుల్లో 30 విజయాలు

తొలి 50 టెస్టుల్లో 30 విజయాలు

ఇక, భారత్ తరుపున తొలి 50 టెస్టుల్లో 30 విజయాలు సాధించిన ఏకైక కెప్టెన్‌ విరాట్ కోహ్లీనే. కోహ్లీ తర్వాత టీమిండియాకు అత్యధిక టెస్టు విజయాలను అందించిన కెప్టెన్‌గా ధోని ఉన్నాడు. ధోని సారథ్యంలో టీమిండియా మొత్తం 60 టెస్టులాడగా 27 టెస్టుల్లో విజయం సాధించింది. వీరిద్దరి తర్వాత గంగూలీ మూడో స్థానంలో ఉన్నాడు.

ఇంకో టెస్టు మిగిలుండగానే

ఇంకో టెస్టు మిగిలుండగానే

పూణె టెస్టులో విజయం సాధించడంతో మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను ఇంకో టెస్టు మిగిలుండగానే సిరిస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. అంతేకాదు ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ పాయింట్ల పట్టికలో కోహ్లీసేన అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకుంది. ఇరు జట్ల మధ్య ఈ సిరిస్‌లో ఆఖరిదైన మూడో టెస్టు అక్టోబర్ 19 నుంచి రాంచీలో జరగనుంది.

పూణె టెస్టు స్కోరు వివరాలు

పూణె టెస్టు స్కోరు వివరాలు

ఈ మ్యాచ్‌లో ఉమేశ్ యాదవ్ (3/22), రవీంజ్ర జడేజా (3/52) అద్భుత ప్రదర్శన చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. విశాఖ వేదికగా జరిగిన మొదటి టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. పూణె టెస్టులో స్కోరు వివరాలు ఇలా ఉన్నాయి.

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 601/5 డిక్లేర్డ్‌

దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌ : 275 ఆలౌట్‌

దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌: 189 ఆలౌట్‌(ఫాలోఆన్)

Story first published: Sunday, October 13, 2019, 16:51 [IST]
Other articles published on Oct 13, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X