కోహ్లీ ఖాతాలో 1000 పరుగుల రికార్డు: ఏబీని అధిగమించాడు

హైదరాబాద్: ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో వన్డేలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో రికార్డుని సొంతం చేసుకున్నాడు. మూడో వన్డేలో ఫస్ట్ డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన విరాట్ కోహ్లీ అత్యంత వేగంగా వెయ్యి పరుగులు సాధించిన వన్డే కెప్టెన్‌గా అరుదైన గుర్తింపు పొందాడు.

ఈ మ్యాచ్ ద్వారా 17 ఇన్నింగ్స్‌ల్లోనే విరాట్ కోహ్లి కెప్టెన్ వెయ్యి పరుగుల్ని సాధించి దక్షిణాఫ్రికా ఆటగాడు ఏబీ డివిలియర్స్‌ని అధిగమించాడు. అంతక ముందు ఏబీ డివిలియర్స్ వన్డే కెప్టెన్ గా 18 ఇన్నింగ్స్ ల్లో వెయ్యి పరుగుల్ని సాధించాడు.

ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన మూడో వన్డేలో విరాట్ కోహ్లీ 20 పరుగులు చేయగానే వన్డేల్లో అత్యంత వేగంగా వెయ్యి పరుగులు చేసిన కెప్టెన్‌గా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. అంతకుముందు ధోని గైర్హాజరీ సమయంలో 14 వన్డేలకు కోహ్లీ కెప్టెన్‌గా వ్యవహరించాడు.

28ఏళ్ల కోహ్లీ ఇటీవలే ఛేజింగ్‌లో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్‌ను అధిగమించిన సంగతి తెలిసిందే. అయితే టీమిండియా తరపున అత్యంత వేగంగా వెయ్యి పరుగుల్ని సాధించిన కెప్టెన్ల జాబితాలో సౌరభ్ గంగూలీ (దాదా) ఐదో స్థానంలో ఉన్నాడు. విరాట్ కోహ్లీ ఇప్పటివరకు వన్డేల్లో 27, టెస్టుల్లో 15 సెంచరీలు చేశాడు.

వన్డేల్లో వేగంగా 1000 పరుగులు చేసిన కెప్టెన్లు:

* 17 innings - Virat Kohli

* 18 innings - AB deVilliers

* 20 innings - Kane Williamson

* 21 innings - Alastair Cook

* 22 innings - Sourav Ganguly

For Quick Alerts
Subscribe Now
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
 
Story first published: Monday, January 23, 2017, 10:28 [IST]
Other articles published on Jan 23, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X