న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మేమిద్దరం వేర్వేరు.. కోహ్లీతో నన్ను పోల్చొద్దు

Virat Kohli and Me different types of players says Babar Azam wants Virat Kohli comparisons to end

లాహోర్‌: భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ, నేను వేర్వేరు. కోహ్లీతో నన్ను పోల్చొద్దు అని పాకిస్థాన్‌ స్టార్ బ్యాట్స్‌మన్‌ బాబర్‌ అజామ్‌ విజ్ఞప్తి చేశాడు. బాబర్‌ నిలకడైన ఆటతీరు కోహ్లీని పోలి ఉంటుందని సోషల్‌మీడియాలో అభిమానులు అనేకసార్లు పేర్కొన్నారు. మరోవైపు మాజీ కోచ్, ఆటగాళ్లు కూడా చాలా సందర్భాల్లో ఇద్దరినీ పోల్చుతూ మాట్లాడారు. ఇక ఐసీసీ టోర్నమెంట్లలలో భారత్‌, పాక్‌ తలపడే సందర్భాలలో వారి మధ్య పోలికలు మరింత ఎక్కువవుతాయి. ఇటీవల అజామ్ 3000 వన్డే పరుగులు చేసిన రెండవ వేగవంతమైన బ్యాట్స్‌మన్‌గా నిలవడంతో కోహ్లీతో పోలికలు తీవ్రమయ్యాయి.

<strong>వన్డేల్లో అత్యధిక పరుగులు.. గంగూలీని అధిగమించిన కోహ్లీ</strong>వన్డేల్లో అత్యధిక పరుగులు.. గంగూలీని అధిగమించిన కోహ్లీ

ఈ నేపథ్యంలో బాబర్‌ అజామ్‌ పాక్ స్థానిక మీడియాతో మాట్లాడుతూ కోహ్లీతో పోల్చొద్దని, ఈ ప్రచారాలకు తెరదించాలని అభిమానులను కోరాడు. 'విరాట్ కోహ్లీతో నన్ను పోల్చి చూడాల్సిన అవసరం లేదు. మా ఇద్దరి ఆటశైలి వేర్వేరుగా ఉంటుంది. నేను కేవలం నా బ్యాటింగ్‌పైనే దృష్టిపెడతా. నా బలాబలాలను మెరుగుపర్చుకోడానికి మాత్రమే ప్రయత్నిస్తా. నా దేశం కోసం మ్యాచ్‌లు గెలవాలని నేను కోరుకుంటున్నా' అని అజామ్‌ తెలిపాడు.

'ఇతర ఆటగాడితో పోల్చుకునే ఆసక్తి లేదు. క్రికెటర్లకు అసలు ఇలాంటి ఆలోచనలే ఉండవు. కేవలం సోషల్ మీడియా, మీడియాలోనే ఇలాంటి ప్రచారాలు జరుగుతాయి. ఏ ఆటగాడు కూడా ప్రస్తుత లేదా మాజీ ఆటగాళ్లతో పోల్చుకోవాలని అనుకోడు. అలా పోల్చుకుంటే అనవసర ఒత్తిడి పెరిగి ఆటపై ప్రభావం చూపుతుంది' అని అజామ్‌ పేర్కొన్నాడు.

<strong>ఒంటి చేత్తో భువీ సూపర్ క్యాచ్.. మ్యాచ్‌ మలుపు (వీడియో)</strong>ఒంటి చేత్తో భువీ సూపర్ క్యాచ్.. మ్యాచ్‌ మలుపు (వీడియో)

జూన్ చివరి వారంలో పాక్ బ్యాటింగ్‌ కోచ్‌ గ్రాంట్‌ ఫ్లవర్‌ మాట్లాడుతూ... 'బాబర్‌ అజామ్‌ బ్యాటింగ్ అద్భుతం. అతడి బ్యాటింగ్ చాలా ప్రత్యేకం. పాక్‌ జట్టులో అత్యుత్తమ క్రికెటర్‌గా ఎదుగుతాడు. అతను యువకుడు. ఫిట్‌నెస్‌ కూడా బాగానే ఉంది. ఇలానే ఒదిగి ఉంటే కచ్చితంగా అతనికి గొప్ప కెరీర్‌ ఉంటుంది. పరుగులు సాధించాలని విరాట్‌లోని తపనే అతడిలో కూడా ఉంది. ఎదోఒకరోజు కోహ్లీ స్థాయికి చేరుతాడు' అని గ్రాంట్‌ ఫ్లవర్‌ అభిప్రాయపడ్డాడు.

Story first published: Monday, August 12, 2019, 12:30 [IST]
Other articles published on Aug 12, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X