న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రెండో వన్డే: ఆఖరి ఓవర్ యాక్షన్ హీరో విజయ్ శంకర్‌పై ప్రశసంల వర్షం

 Vijay Shankar’s Final-Over Act Wins Hearts on Twitter

హైదరాబాద్: నాగ్‌పూర్ వేదికగా మంగళవారం ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో భారత జట్టు విజయంలో విజయ్ శంకర్ కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అటు బ్యాట్‌తోనూ ఇటు బౌలింగ్‌లోనూ విజయ్ శంకర్ మెరవడంతో ఆస్ట్రేలియాపై టీమిండియా రెండో వన్డేలో 8 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.

<strong>ధోనికి షేక్‌ హ్యాండ్‌ ఇచ్చేందుకు వచ్చిన అభిమానిని పరిగెత్తించాడు (వీడియో)</strong>ధోనికి షేక్‌ హ్యాండ్‌ ఇచ్చేందుకు వచ్చిన అభిమానిని పరిగెత్తించాడు (వీడియో)

వన్డేల్లో టీమిండియాకు ఇది 500వ విజయం. 1975లో వెంకట్రాఘవన్ సారథ్యంలోని టీమ్‌ఇండియా.. ఈస్ట్ ఆఫ్రికాపై తొలి విజయాన్ని నమోదు చేసింది. అయితే, ఈ తరహా ప్రదర్శనకు కారణం గతేడాది జరిగిన నిదాహస్‌ ట్రోఫీ ట్రోఫియేనని విజయ్ శంకర్ చెప్పుకొచ్చాడు. ఆ టోర్నీ వల్లే తాను ఎన్నో విషయాలు నేర్చుకున్నానని చెప్పుకొచ్చాడు.

నాగ్‌పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో టీమిండియానే 8 పరుగుల తేడాతో విజయం సాధించింది. టీమిండియా నిర్దేశించిన 251 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలో 242 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లు పడగొట్టగా... బుమ్రా, విజయ్ శంకర్ చెరో రెండు వికెట్లు... రవీంద్ర జడేజా, కేదార్ జాదవ్ తలో వికెట్ తీసుకున్నారు.

రెండో వన్డేలో విజయం సాధించడంతో ఐదు వన్డేల సిరిస్‌లో టీమిండియా 2-0 ఆధిక్యంలో నిలిచింది. ఆస్ట్రేలియా జట్టులో పీటర్‌ హ్యాండ్స్‌ కోంబ్‌(48), స్టోయినిస్‌(52), ఖవాజా(38), అరోన్‌ ఫించ్‌(37)లు మాత్రమే ఫర్వాలేదనిపించారు. చివరి ఓవర్‌లో ఆస్ట్రేలియా విజయానికి 11 పరుగులు అవసరమయ్యాయి.

చివరి ఓవర్ వేసిన విజయ్ శంకర్ 2 పరుగులిచ్చి స్టోయినిస్‌ (52), ఆడమ్‌ జంపా (2)ను పెవిలియన్‌కు చేర్చాడు. దీతో ఆస్ట్రేలియా జట్టు 242 పరుగులకు ఆలౌటైంది. దీంతో టీమిండియా 8 పరుగుల తేడాతో విజయం సాధించింది. అంతకముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 48.2 ఓవర్లలోనే 250 పరుగులు చేసి ఆలౌటైంది.

రెండో వన్డేలో భారత విజయంలో కీలకపాత్ర పోషించిన విజయ్ శంకర్‌పై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది.

Story first published: Wednesday, March 6, 2019, 12:18 [IST]
Other articles published on Mar 6, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X