న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

విజయ్ హజారే ట్రోఫీ: రాణించిన రాహుల్, మయాంక్.. ఫైనల్స్‌లో కర్ణాటక, తమిళనాడు

Vijay Hazare Trophy: Tamil Nadu set up final match with Karnataka after win over Gujarat

బెంగళూరు: విజయ్ హజారే ట్రోఫీ తుది దశకు చేరుకుంది. టోర్నీ ఫైనల్స్‌లో కర్ణాటక, తమిళనాడు జట్లు అమితుమీ తేల్చుకోనున్నాయి. ఛత్తీస్‌గఢ్‌తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో కర్ణాటక, గుజరాత్‌తో జరిగిన మరో సెమీఫైనల్ మ్యాచ్‌లో తమిళనాడు గెలుపొందాయి. అక్టోబర్ 25వ తేదీన బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా కర్ణాటక, తమిళనాడు జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగనుంది.

తొలిసారి మీడియా సమావేశం.. బ్లేజ‌ర్‌ ధరించిన గంగూలీ.. ఎందుకో తెలుసా?!!తొలిసారి మీడియా సమావేశం.. బ్లేజ‌ర్‌ ధరించిన గంగూలీ.. ఎందుకో తెలుసా?!!

బుధవారం చిన్నస్వామి స్టేడియం వేదికగా ఛత్తీస్‌గఢ్‌తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో కర్ణాటక ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఛత్తీస్‌గఢ్ 49.4 ఓవర్లలో 223 పరుగులకు ఆలౌట్ అయింది. అమన్‌దీప్ ఖరే (78) అర్ధ సెంచరీ చేసాడు. అనంతరం లక్ష్య చేధనకు దిగిన కర్ణాటక 40 ఓవర్లలో కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయి సునాయస విజయాన్ని అందుకుంది. దేవ్‌దత్ పడిక్కల్ (92), భారత ఓపెనర్ కేఎల్ రాహుల్ (88) అర్ధ సెంచరీలతో రాణించగా.. మరో భారత ఓపెనర్ మయాంక్ అగర్వాల్ 47 పరుగులు చేసాడు.

జస్ట్ క్రికెట్ అకాడమీ వేదికగా గుజరాత్, తమిళనాడు మధ్య జరిగిన మరో సైమీ ఫైనల్‌కు తొలుత వర్షం అడ్డంకిగా మారింది. దీంతో మ్యాచ్‌ని 40 ఓవర్లకు కుదించారు. మొదటగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 40 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 177 పరుగులు చేసింది. అనంతరం తమిళనాడు 39 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 181 పరుగులు చేసి ఫైనల్స్‌కి దూసుకెళ్లింది. దినేష్ కార్తీక్, అభినవ్ ముకుంద్, షారుఖ్ ఖాన్ రాణించారు.

టోర్నీలో భాగంగా పంజాబ్‌, తమిళనాడు జట్ల మధ్య జరిగిన క్వార్టర్స్‌ ఫైనల్ మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దు అయింది. నిబంధనల ప్రకారం లీగ్‌లో అత్యధిక విజయాలు నమోదు చేసిన తమిళనాడు సెమీస్‌ చేరింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన తమిళనాడు 39 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసిన దశలో వరణుడు మ్యాచ్‌ను అడ్డుకున్నాడు. వీజేడీ పద్ధతి ద్వారా పంజాబ్‌ లక్ష్యాన్ని 195 పరుగులుగా నిర్ణయించారు. లక్ష్య ఛేదనలో పంజాబ్‌ 12.2 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 52 పరుగులు చేసిన సమయంలో మరోసారి వరణుడు అడ్డుపడ్డాడు. దీంతో ఆట సాధ్యపడలేదు. అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేశారు.

మరోవైపు ముంబై, ఛత్తీస్‌గఢ్‌ మధ్య జరగాల్సిన మరో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌ కూడా వర్షం కారణంగా రద్దయింది. దీంతో లీగ్‌లో అత్యధిక విజయాలు నమోదు చేసిన ఛత్తీస్‌గడ్‌ సెమీస్‌కు చేరింది. అదృష్టం కలిసొచ్చిన రెండు జట్లలలో ఛత్తీస్‌గఢ్‌ సెమీఫైనల్ మ్యాచ్‌లో ఓడగా.. తమిళనాడు ఫైనల్ చేరింది.

Story first published: Wednesday, October 23, 2019, 18:54 [IST]
Other articles published on Oct 23, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X